నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం

యునెస్కో సెప్టెంబర్‌ 8వ తేదీని అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం గా ప్రకటించింది. 1965వ సంవత్సరం, నవంబర్‌ 17వ తేదీన యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖా మంత్రుల మహాసభ అనంతరం అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని ప్రకటించారు. ఆ తరువాత 1966వ సంవత్సరం నుండి ప్రతి ఏడాదీ క్రమం తప్పకుండా జరుపుకుంటున్నాం. అక్షరాస్యతను వ్యక్తులు మరియు సంఘాలకు అందించటం. ఇది పిల్లల్లో విద్యపైనేగాకుండా, వయోజన విద్యవిూద కేంద్రీకరించడమే అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ముఖ్యోద్దేశం.చరిత్ర:1965లో యునెస్కో ప్రతిపాదనతో సెప్టెంబర్‌ 8, 1966న మొట్టమొదటి సారిగా ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం జరుపుకున్నారు. 2003`12 దశకంను యునైటెడ్‌ నేషన్స్‌ అక్షరాస్యత దశకంగా యునెస్కో ప్రకటించింది. ఆ దశకం అంతా లిటరసీ ఇనిషియేటివ్‌ ఫర్‌ ఏమ్పోవేర్మేంట్‌ ప్రక్రియ ద్వారా అక్షరాస్యుల సంఖ్యను పెంచటానికి కృషి చేసింది. ఢాకాలో జరిగిన కార్యక్రమంలో బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, యునెస్కో డైరెక్టర్‌ జెనరల్‌ ఇరిన బొకోవా కలసి 2014 యునెస్కో అంతర్జాతీయ అక్షరాస్యత బహుమతిని అందించారు. కన్ఫ్యూషియస్‌ కింగ్‌ సేజోంగ్‌ బహుమతులు పొందారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినం వేడుకలు వివిధ దేశాలలో ప్రత్యేక నేపథ్యాలుగా అందరికీ విద్య అనే నినాదంగా లక్ష్యాలను చేరే కృషి చేస్తున్నాయి. ఇతర యునైటెడ్‌ నేషన్స్‌ కార్యక్రమాలు యునైటెడ్‌ నేషన్స్‌ అక్షరాస్యత డికేడ్‌ నిర్వహిస్తున్నవి. 2007 మరియు 2008 వేడుకలలో ఆరోగ్య విద్యలో భాగంగా ‘‘అక్షరాస్యత మరియు ఆరోగ్యం’’ పై అభివృద్ధిలో ముందంజలోని సంస్థలకు బహుమతులు ఇవ్వడం జరిగింది . తల్లిదండ్రులు విధిగా తమ పిల్లలను బడిలో చేర్పించాలి, బాలకార్మికులుగా మారకుండా చూడాలి. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం మాదిరిగా ప్రతి ఒక్కరు వయోజనులతో కలిసి చదువుకోవాలన్న చట్టం తేవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్షరాస్యత సాధనలో చిత్తశుద్ధిగా వ్యవహరించాలి. నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాలు పక డ్బందీగా అమలు చేసి ఫలితాలు రాబట్టాలి. కేరళ, పశ్చిమ బెంగాల్‌రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకోవాలి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. మహిళల అక్షరాస్యత పెంపునకు ప్రత్యేక కార్యక్రమాలు తీసుకోవాలి. వారికోసం ప్రత్యేక బడులు, కళాశాలలు ఏర్పాటు చేయాలి. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యానుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలి. నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని ఖచ్చితంగా అమలుచేయాలి. 5`14 ఏళ్ల బాలబాలికలంతా బడిలో ఉండేలా చూడాలి. బాల్యవివాహాలు చేసిన వారిపై చట్టాలను కఠినంగా అమలు చేయాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *