తగ్గేదే లే అంటూ ఉత్తమ నటితో ఉత్తమ నటుడు అల్లు అర్జున్

అల్లు అర్జున్ (AlluArjun) ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (DraupadiMurmu) నుండి అందుకున్నారు. ఈ అవార్డుల వేడుక అట్టహాసంగా ఢిల్లీ లో జరిగింది. అవార్డు గ్రహీతలు చాలామంది తమ కుటుంబ సభ్యులను వెంటపెట్టుకొని వచ్చారు. అలాగే అల్లు అర్జున్ కూడా తన సతీమణి స్నేహ రెడ్డి (SnehaReddy)ని, తల్లిదండ్రులు అల్లు అరవింద్ (AlluAravind) , నిర్మలతో వచ్చారు.అల్లు అర్జున్ జాతీయ చలన చిత్ర పురస్కారం #NationalFilmAwards అందుకోవటం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక చరిత్ర. ఇంతవరకు ఉత్తమ నటుడిగా ఈ అవార్డు ఎవరూ అందుకోలేదు, ఇప్పుడు అర్జున్ ఈ అవార్డు అందుకోవటం #69thNationalFilmAwards ఇదే మొదటిసారి. అందుకని ఇది ఒక ప్రత్యేకమైన అవార్డు.

‘పుష్ప’ #Pushpa లో తాను పోషించిన పుష్పరాజ్ #Pushparaj పాత్రకి గాను అల్లు అర్జున్ కి ఈ అవార్డు వచ్చింది. ఈ సినిమా విజయవంతం అవటంతో పాటు, పలు దేశాల్లో కూడా సందడి చేసింది. ఈ సినిమాలో ‘తగ్గేదే లే’ #ThaggedeLe అనే అల్లు అర్జున్ చేసిన ఒక మేనరిజమ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యం పొందింది. దేశివాలీ క్రికెట్ అయినా, ఒక్కరోజు మ్యాచ్ యినా, టి 20 అయినా, చాలామంది అంతర్జాతీయ ఆటగాళ్లు వికెట్ తీసినప్పుడల్లా ఆ మేనరిజమ్ చూసి చూపించేవారు.అంటే అది అంతగా ప్రాముఖ్యం పొందింది. ఆ సినిమాలో ఆ ‘తగ్గేదే లే’ అనే పదం అంతలా పాకింది. ఇక ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (DavidWarner) అయితే ‘పుష్ప’ సినిమాలో పాటలకి కూడా డాన్స్ లు చేసి చూపించాడు.

పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ నటనకే కాదు, ఆ సినిమా సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (DeviSriPrasad) పురస్కారం అందుకున్నారు. ఈ సినిమాలో పాటలు కూడా విశేష ప్రాచుర్యం పొందాయి. ఇందులో శ్రీవల్లీ పాట అయితే ఇంకా ఎక్కువ ప్రాచుర్యం పొందింది.ఇక నిన్న అవార్డుల వేడుకలో ఉత్తమ నటుడు అయిన అల్లు అర్జున్, ఉత్తమ నటి అవార్డు తీసుకున్న ఇద్దరు కృతి సనన్ (KritiSanon), అలియా భట్ (AliaBhat) తో ఫోటోలకి ఫోజులిచ్చి సందడి చేశారు. ఇలా ముగ్గురు ఉత్తమ నటీనటులు ఒకే దగ్గర ఫోజులిచ్చి సంతోషం వ్యక్తం చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *