టీటీడీపీలోకి రాజాసింగ్‌..?

రాజకీయాల్లో తమకు ప్రాధాన్యత లేని పార్టీలు, ప్రాధాన్యత ఇవ్వని పార్టీల్లో కొనసాగేందుకు ఎవరూ ఇష్టపడరు. సమయం చూసుకుని వేరే పార్టీలోకి వెళుతుంటారు. తాజాగా తెలంగాణలో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్‌ కూడా అదే పనిలో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రాజాసింగ్‌. అయితే ఓ వర్గం విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌ విషయంలో బీజేపీ నాయకత్వం కఠినంగా వ్యవహరించింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఇది జరిగి కొన్ని నెలలు గడుస్తోంది. అప్పటి నుంచి తనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తేయాలని రాజాసింగ్‌ పలుసార్లు బీజేపీ నాయకత్వాన్ని కోరుతూ వచ్చారు.కానీ బీజేపీ నాయకత్వం మాత్రం ఈ విషయంలో తన నిర్ణయం మార్చుకోవడం లేదు. అంతేకాదు ప్రస్తుతం రాజాసింగ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గోషామహల్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున మరో నాయకుడిని బరిలోకి దింపేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోందనే చర్చ కూడా సాగుతోంది. జరుగుతున్న పరిణామాలను బట్టి బీజేపీ నాయకత్వం తన విషయంలో నిర్ణయం మార్చుకునే అవకాశం లేదనే భావనకు వచ్చిన రాజాసింగ్‌.. త్వరలోనే పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.కొద్దిరోజుల క్రితం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో ఆయనతో చర్చలు కూడా జరిపారని సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో టీటీడీపీకి చేరికలు అవసరం. ఆ పార్టీలో చేరేందుకు పేరున్న నాయకులు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ తరుణంలో రాజాసింగ్‌ టీటీడీపీతో చేరేందుకు సిద్ధపడితే.. అందుకు ఆ పార్టీ కూడా అడ్డు చెప్పే అవకాశం లేదనే టాక్‌ వినిపిస్తోంది. బీజేపీలో చేరకముందు రాజాసింగ్‌ టీడీపీలో ఉన్నారు. టీడీపీ తరపున ఆయన కార్పొరేటర్‌గా కూడా వ్యవహరించారు.ఆ తరువాత ఆయన బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే తనకు ప్రాధాన్యత ఇవ్వని బీజేపీ నిర్ణయం కోసం ఎక్కువకాలం ఎదురుచూడకుండా టీటీడీపీలో చేరేందుకు ఆయన సిద్ధమవుతన్నారని సమాచారం. అయితే రాజాసింగ్‌ను టీటీడీపీలో చేర్చుకునే విషయంలో కాసాని జ్ఞానేశ్వర్‌ నిర్ణయం ఫైనల్‌ కాదని.. ఈ విషయంలో చంద్రబాబు నిర్ణయాన్ని బట్టే రాజాసింగ్‌కు టీటీడీపీలోకి ఎంట్రీ ఉంటుందా ? లేదా అన్నది తెలియనుంది.
సుహాసినికి కీలక పదవి
తెలంగాణ రాష్ట్రంలో కూడా టీడీపీ సత్తా చాటాలని అనుకుంటూ ఉంది. తెలంగాణలో టీడీపీకి గత వైభవం తీసుకుని రావడానికి నారా చంద్రబాబు నాయుడు ప్రణాళికను సిద్ధం చేశారు. తాజాగా నందమూరి సుహాసినికి కీలక పదవిని ఇచ్చారు. టీడీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ విస్తరణలో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ మరో ముగ్గురికి చోటు కల్పించారు. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసిని (కూకట్‌?పల్లి నియోజక వర్గం), రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా సుధాకర్‌ నాయుడు (కొల్లాపూర్‌ నియోజకవర్గం), రాష్ట్ర కార్యదర్శిగా బి.విఠల్‌ (బాన్సువాడ నియోజకవర్గం)ను నియమించారు. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా షకీలా రెడ్డి (ఖైర తాబాద్‌ నియోజకవర్గం), జహీరాబా ద్‌ పార్లమెంట్‌? నియోజకవర్గం పరిధిలోని బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం కో ఆర్డినేటర్‌?గా కరాటే రమేశ్‌ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి కాసాని నియామక ఉత్తర్వులు జారీ చేశా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *