ఢల్లీికి వెళ్లి తేల్చుకుంటారా..

విజయవాడ, అక్టోబరు 9
పొత్తుల ప్రకటన తర్వాత పవన్‌ కృష్ణా జిల్లాలో నాలుగో విడత వారాహి యాత్ర చేపట్టారు. గతంతో పోల్చుకుంటే ఈసారి జోష్‌ కూసింత తక్కువగా ఉందనే చర్చ జరుగుతోంది. పైగా ఎన్డీఏ నుంచి వచ్చేశానని ఓసారి.. అదేం లేదు.. నేనెక్కడికి వెళ్లలేదని మరోసారి పవన్‌ చెప్పారు. ఇదే సందర్భంలో ప్రెస్‌విూట్‌లో ఇంకొన్ని కీలక కామెంట్లూ చేశారు. వాస్తవానికి పొత్తును ఢల్లీిలో ప్రకటిద్దామని భావించానని.. అయితే రాష్ట్ర పరిస్థితులు, జీ`20 సదస్సులో బీజేపీ అగ్ర నేతలు బిజీగా ఉండడంతో వారికి చెప్పకుండానే చేయాల్సి వచ్చిందంటూ దాదాపు బీజేపీ అధినాయకత్వానికి వివరణ ఇచ్చుకున్నట్టుగా చెప్పారాయన. ఈ క్రమంలో ఢల్లీి ఎప్పుడు వెళ్తారు..? అడిగిన వెంటనే ఢల్లీి పెద్దలు అప్పాయింట్మెంట్‌ ఇచ్చేస్తారా? కలవడానికి కమలం పెద్దలు సుముఖంగా ఉన్నారా లాంటి చర్చలు బయలుదేరాయి. పొత్తులో ఉన్న తమకు మాట మాత్రంగానైనా చెప్పలేదనే ఆగ్రహం బీజేపీ స్థానిక నేతల్లోనే కాకుండా.. ఢల్లీి లోటస్‌ లీడర్లకు ఉన్నట్టుగానే కనిపిస్తోంది.పవన్‌ అనూహ్య ప్రకటన తర్వాత ఇక బీజేపీతో కటీఫేనా..? అనే రీతిలో విశ్లేషణలు కూడా వచ్చేశాయి. వీటన్నింటికి జవాబు చెబుతున్న విధంగా.. పవన్‌ తన ప్రెస్‌ విూట్లో వివరించారు. ముందే చెప్పాల్సింది. కానీ.. చెప్పలేకపోయాం. ఇప్పుడు చెబుతాం..అంటూ దీర్ఘాలు తీస్తున్నారాయన. తాను ఎన్డీఏలో ఉన్నానో.. లేనోననే విషయాన్ని చెప్పాల్సింది ఆయనేనని ఏపీ బీజేపీ నేతలు చేసిన కామెంట్స్‌పైనా? సూటిగా స్పందించడానికి తటపటాయించారు పవన్‌. దీన్ని బట్టి.. పైకి కన్పిస్తున్న విధంగా పవన్‌ బీజేపీతో తెగదెంపులు చేసుకోవడానికి జనసేనాని అంతగా సుముఖంగా లేరనే వాదన బలంగా వినిపిస్తోంది. అప్పుడున్న పరిస్థితిని బట్టి.. ఏదో ప్రకటించేశారు కానీ.. ఆ తర్వాత తత్వం బోధపడి ఉంటుందనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన ఢల్లీి టూర్‌పై ఉత్కంఠ నెలకొంది. పవన్‌కళ్యాణ్‌ ఇప్పటికే బీజేపీ ఢల్లీి పెద్దల అప్పాయింట్మెంట్‌ అడిగినట్టు సమాచారం. అయితే వాళ్ళు సుముఖంగా ఉన్నారా? లేదా అన్నది మిలియన్‌ డాలర్‌ క్వశ్చన్‌.వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పవన్‌ థియరీ ప్రకారం ఏపీలో నడుచుకోవడానికి బీజేపీ ముందుకు వస్తుందా..? పవన్‌ బీజేపీని ఒప్పించగలరా..? అన్న అనుమానాలు అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి. టీడీపీతో వద్దు.. బీజేపీ`జనసేన కూటమిగానే ఎన్నికలకు వెళ్దామనే ప్రతిపాదనను పవన్‌ ముందు పెడితే అప్పుడు రియాక్షన్‌ ఎలా ఉంటుందన్నది ఉత్కంఠగా మారింది. ఇదే సందర్భంలో .. అటు జనసేన కానీ.. ఇటు టీడీపీ కానీ.. బీజేపీతో మేం వెళ్లేదే లేదని గట్టిగా చెప్పలేకపోతున్నాయి. బీజేపీకి దాదాపు వివరణ ఇచ్చుకున్నట్టుగా పవన్‌ మాట్లాడితే.. అదే రోజున లోకేష్‌ కూడా కీలక కామెంట్స్‌ చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ వెనక బీజేపీ పాత్ర ఉందనడానికి ఎలాంటి ఆధారాల్లేవని.. దాని గురించి నేనేం మాట్లాడనంటూ.. దాదాపు క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్టుగానే అన్నారు. ఇప్పుడీ పరిణామాలే అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.ఈ పరిస్థితుల్లో పవన్‌ ఢల్లీి వెళ్తే చాలా అంశాలకు అవుననో.. కాదనో సమాధానాలైతే లభిస్తాయని అంచనా వేస్తున్నాయి పొలిటికల్‌ సర్కిల్స్‌. మొత్తానికి పవన్‌కళ్యాణ్‌ ఢల్లీి టూర్‌ విూద ఉత్కఠ పెరుగుతోంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *