లాభాలతో వాణిజ్య పంటలు…

సంప్రదాయ పంటల సాగుతో అన్నదాత కు ఆశించిన లాభాలు రావడం లేదు. అందువల్ల అధిక దిగుబడి, లాభాలు వచ్చే వాణిజ్య పంటలపై దృష్టిపెడుతున్నారు. అయితే సాంప్రదాయ పంటల కంటే పండ్ల తోటల సాగులో లాభాలు ఉంటాయని ఆ దిశగా ఆసక్తి చూపుతున్నారు రైతులు. ఇందులో భాగంగానే నాగర్‌ కర్నూల్‌ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం చంద్రకల్‌ గ్రామానికి చెందిన రైతు శేఖరయ్య బొప్పాయి పంట సాగు చేస్తున్నారు. ఈ పంట వేసిన అనంతరం 5 నెలల్లోనే పూతకు వచ్చి ఆరో నెలలో కాయలు కాయడం మొదలవుతుందని రైతు వివరించాడు. త్వరగా పంట చేతికి రావడంతో మంచి లాభాలు కూడా గడిరచవచ్చని చెప్పుకొచ్చాడు.రైతు శేఖరయ్య ప్రస్తుతం ఆరు ఎకరాల్లో బొప్పాయి పంటను సాగు చేశాడు. మొక్కలు నాటేందుకు రూ. 13 లక్షల వరకు ఖర్చు వచ్చిందని తెలిపారు. పంట నాటిన సమయం నుంచి క్రమ పద్ధతి ద్వారా శాస్త్రవేత్తలు సూచించిన విధంగా ఎరువులు మందులు డిఏపి వాడాడు. ప్రతి నెలా క్రమం తప్పకుందాం కావాల్సిన ఎరువులు అందించాడు. వీటితో పాటు డ్రిప్‌ సిస్టం ద్వారా బొప్పాయి తోటకు నీటిని సరఫరా చేశారు. తద్వారా ఐదు నెలల్లోనే పంట పూతకు వచ్చింది. 8 నెలలకు పంట చేతికి వచ్చిందన్నాడు. మార్కెట్లో బొప్పాయి పండ్లకు మంచి డిమాండ్‌ ఉండడంతో కిలో రూ. 30 నుంచి రూ. 40 వరకు ధర పలుకుతుందని.. తాము తోట వద్ద రూ. 25కు విక్రయిస్తున్నట్లు రైతు శేఖరయ్య తెలిపాడుగత ఐదు సంవత్సరాల నుంచి పండ్ల తోట సాగు చేస్తున్నామని గతేడాది మామిడి తోటను సాగు చేయడం ద్వారా కాస్త నష్టాలు రావడంతో ఈ ఏడాది బొప్పాయి తోటను ఎంచుకున్నామని వివరించాడు. మామిడి తోటలో వచ్చిన నష్టాలను బొప్పాయి సాగు ద్వారా పూడ్చుకోవచ్చనే ఉద్దేశంతో సాగు చేశామని చెప్పుకొచ్చాడు.అయితే పంటలో ఆశించిన మేర దిగుబడులు వచ్చినప్పటికీ ఈ ఏడూ వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉండడంవల్ల బొప్పాయి చెట్లు దెబ్బతిని కొంత నష్టం వస్తుందని అన్నారు. వర్షాలు అధికంగా లేకపోతే మంచి ఆదాయం వచ్చేదని చెప్పారు. తాము పండిరచిన పంటను తోట వద్దనే విక్రయిస్తూ ఉన్నామని ఇతర పండ్ల వ్యాపారులకు హోల్‌ సేల్‌ ధరకు అమ్ముతున్నట్లు రైతు శేఖరయ్య తెలిపాడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *