ఇక్కడ నడక కష్టమే.

కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో పెద్ద వాన కొడితే రోడ్లు లేక ఏ ఊరికి పోలేము. వాగులు, వంకలు పొంగితే ఎన్నో పల్లెల ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోవాల్సిందే. ఈ టైమ్‌లో అనారోగ్యాలకు గురైతే ఆ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఊర్లకు రోడ్డు సౌలత్‌ లేక.. వాగులు, వంకలపై కల్వర్టులు లేక ఇక్కడి ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ప్రతి వానకాలం వారి ఇబ్బందులు అన్నీ.. ఇన్నీ కావు. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా మంచంపై కిలోవిూటర్ల కొద్ది మోసుకుపోవాలిసన దయనీయ పరిస్థితి. జిల్లాలో మొత్తం 1025 అవాసలకు గాను 488 ఆవాసాలకు కనీసం మట్టి రోడ్డు కూడ లేకపోవడం ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని ఎంత నిర్లక్ష్యం చేశాలో స్పష్టం చేస్తోంది. ఇప్పటికీ జిల్లాలో 82162 కిలోవిూటర్ల రోడ్లు వేయాల్సి ఉందని అధికారులే చెబుతున్నారు. జిల్లాలో 136 ప్రధాన బ్రిడ్జిలు కట్టాల్సి ఉంది. వీటి నిర్మాణానికి రూ.172 కోట్లు అవసరమని పంచాయతీరాజ్‌ శాఖ ప్లాన్‌ చేసింది. 488 గ్రామాలకు రోడ్లు ,కల్వర్టులు ,వంతెనల నిర్మాణంకు రూ.761.07 కోట్లు అవసరమని తెలిపింది. జిల్లా ప్రజలకు రోడ్డు సౌలత్‌ కలగాలంటే రూ.948.69 కోట్లు అవసరం. రెండు రోజుల క్రితంతెల్లవారుజామున బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవించిన గంట రెండు గంటల్లోనే ఆమె రెండు కిలోవిూటర్లుకు పైగా నడిచి వెళ్లి 108లో కెరమెరి పీహెచ్‌ కి చేరుకుంది. అంసుబాయికి పురిటి నొప్పులు రాగానే 108కు ఫోన్‌ చేశారు. ఆమెను దవాఖానకు తీసుకొచ్చేందుకు వెళ్లిన వెహికిల్‌ ఊరికి రెండు కి.విూ. దూరంలోని రావూజీ గూడ దగ్గరే ఆగిపోయింది. 2014లో వర్షా లకు అక్కడి వాగు పొంగి బ్రిడ్జి కొట్టు కుపోయిం ది. ఇంత వరకు దాన్ని బాగుచేసిన వారు లేదు. బ్రిడ్జి లేక ఏ వెహికిల్‌ అంతకంటే ముందుకు వెళ్లలేదు. అంసుబాయి పరిస్థితి సీరియస్‌ గా ఉండడంతో 108 సిబ్బందే నడుచుకుంటూ వెళ్లి ఆమెకు పురుడుపోశారు. అనంతరం ఇలా నడిపించుకుంటూ తీసుకొచ్చి దవాఖాన తీసుకుపోయిన్రు. అదృష్టం గా బాగుండడంతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. రోడ్డు సౌలత్‌ లేక ఆసిఫాబాద్‌ జిల్లా లో దాదాపు సగం పల్లెలు ఇలా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నరు.జిల్లాలోని అనేక గ్రామ పంచాయతీల పరిధిలో రోడ్లు లేక ఇబ్బందులు ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వాస్తవమే. రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధుల కొరత కారణంగా పనులు చేయలేక పోతున్నాం. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే రోడ్లు, వంతెనలు నిర్మాణ పనులు చేపడతామని అధికారులు చెబుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *