తీరనున్న గ్యాస్‌ బండ కష్టాలు

ప్రజలకు గ్యాస్‌ కష్టాలు తీరనున్నాయి. సిలిండర్‌ బుక్‌ చేయడం..అది వచ్చేందుకు సమయం పట్టడం..ఈలోపు అవస్థలకు చెక్‌పడనుంది. గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ద్వారా దేశవ్యాప్తంగా చేపట్టే పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ పనుల్లో భాగంగా రూ.వంద కోట్ల బడ్జెట్‌తో తిరుపతి? తిరుత్తణి మార్గంలో 75 కిలోవిూటర్ల మేర గ్యాస్‌ పైప్‌లైన్‌ అమర్చుతున్నారు. ఏజీ అండ్‌ ప్రతమ్‌ కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో లేబర్‌ కాంట్రాక్టర్ల ద్వారా గ్యాస్‌ పైప్‌ లైన్ల పూడిక పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. తిరుపతిలో ప్రారంభమైన పైపుల పూడిక పనులు ప్రస్తుతం నగరిలో కొనసాగుతున్నా యి. సవిూపంలోని తిరుత్తణికి చేరుకుంటే పూడిక పనులు పూర్తయినట్లే.మెయిన్‌ సోర్స్‌ స్టేషన్‌ నుంచి గ్యాస్‌ సిటీ స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి జిల్లా రెగ్యులేటింగ్‌ స్టేషన్‌కు.. అక్కడి నుంచి ఇన్‌సైడ్‌ సొసైటీకి.. అక్కడి నుంచి నివాసాలకు సరఫరా అవుతుంది. నివాసాలకు వచ్చే గ్యాస్‌పైప్‌లైన్‌ తొలుత విూటర్‌ రెగ్యులేటర్‌కు అనుసంధానమై తదుపరి వంటగదిలోని సౌ పైపునకు కలుపుతారు. వాడకాన్ని అనుసరించి బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది.పైప్‌లైన్‌ పనులు అ?యతంత భద్రత ప్రమాణాలతో జరుగుతున్నాయి. ఈ పైపులను 1.7 విూటర్లు (సుమారు 6 అడుగుల) లోతులో అమర్చు తున్నారు. లీకేజీకి ఆస్కారం లేకుండా 16 ఇంచుల వ్యాసార్థం కలిగిన పటిష్టమైన 4 లేయర్‌ల వెల్డింగ్‌, 3 లేయర్‌ సేఫ్టీ ఉన్న పైప్‌ లైన్లను ఈ ప్రక్రియకు వాడుతున్నారు. పైప్‌ లైన్‌ మార్గంలో సూచికలను ఏర్పాటు చేస్తారు. ఇవి ఉన్న ప్రాంతంలో బోర్లు వేయడం, బావు లు తవ్వడం, చెట్లు నాటడం నిషేధం. పైపులై న్లు జాతీయ రహదారి పక్కనే వెళుతున్నాయి.పైప్‌లైన్‌ ఏర్పాటు పూర్తి అయిన తరువాత తిరుపతి, తిరుత్తణి మార్గంలో రెండు ఫిల్లింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. గ్యాస్‌ పైపుల్లో పంపే ముందు రెండు సార్లు నీటిని పంపి అల్ట్రా సోనిక్‌ టెస్ట్‌ చేస్తారు. పూర్తి స్థాయిలో పైప్‌ లీకేజీ లేదని నిర్ధారణ అయిన పిదపే గ్యాస్‌ను సరఫరా చేస్తారు. గ్యాస్‌తో నడిచే వాహనాలకు ఫిల్లింగ్‌ స్టేషన్ల వద్ద సరఫరా చేస్తారు.అగ్ని ప్రమాదాలకు ఎలాంటి ఆస్కారం లేకుండా పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా జరుగుతుంది. పనులు వేగవంతంగా జరు గుతున్నాయి. ఫిల్లింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసి, పరీక్షల అనంతరం ఫిల్లింగ్‌ స్టేషన్‌కు గ్యాస్‌ వచ్చేందుకు ఏడాది సమయం పడుతుంది. ఆపై ఇళ్లకు పైప్‌లైన్‌ ఏర్పాటు చేస్తాం. ప్రస్తు తం లక్నోలో పైప్‌లైన్‌ గ్యాస్‌ సరఫరా ప్రక్రియ పూర్తిస్థాయిలో పూర్తయి ఇంటింటికీ సరఫరా చేస్తున్నాం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *