ఆ ప్రపంచంలో ఏడాదికి 11 రోజులు

ఈ విశ్వంలో భూమికి మించిన పెద్ద జీవగ్రహం ఉందా అంటే కచ్చితంగా లేదనే సమాధానం వినిపిస్తుంది. అయితే కొన్నాళ్లుగా భూమిపై నివసించే జనాభా పెరిగిపోతుండటంతో మరో గ్రహంపై నివసించేందుకు గల అవకాశాలను సైంటిస్టులు పరిశీలిస్తూ వస్తున్నారు. ఈ మేరకు సౌరవ్యవస్థ వెలుపల గ్రహాల కోసం వెతుకుతున్న ఖగోళ శాస్త్రవేత్తలకు మార్గనిర్దేశం చేసేలా చాలా లోతైన సముద్రాన్ని కలిగి ఉండే గ్రహం కనుగొనబడిరది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది భూమిని పోలిన గ్రహం. సౌరవ్యవస్థకు ఆవల కనిపించిన ఈ భూమి మన భూమి కంటే 70 రెట్లు పెద్దది. అంతేకాకుండా మన భూమి కంటే ఐదు రెట్లు బరువైనది. ఈ గ్రహంపై సంవత్సర కాలం అంటే 11 రోజులు మాత్రమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ గ్రహంపై రెండు సూర్యుళ్లు ఉంటారు. ఒకదాని చుట్టూ భ్రమణాన్ని 11 రోజుల్లో పూర్తి చేస్తుండగా మరోదాని చుట్టూ తిరిగేందుకు 1400 సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.కెనడాకు చెందిన మాంట్రియల్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం ఈ భూమిని కనుగొంది. సూపర్‌ ఎర్త్‌ అని ఈ గ్రహానికి సైంటిస్టులు నామకరణం చేశారు. ఈ మేరకు టీవోఐ`1452బి అని పేరు పెట్టారు. ట్రాన్సిటింగ్‌ ఎక్సోప్లానెట్‌ సర్వే శాటిలైట్‌ (టీఈఎస్‌ఎస్‌), భూ ఆధారిత టెలిస్కోప్‌ల పరిశీలన సమయంలో ఈ గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. సూపర్‌ ఎర్త్‌పై హైడ్రోజన్‌, హీలియంతో కూడిన రాతి గ్రహం అయి ఉండొచ్చని, దీనిపై వాతావరణం తక్కువగా, లేదంటే అసలు ఉండకపోవచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ గ్రహం మొత్తం ద్రవ్యరాశిలో 30 శాతం వరకు సముద్ర ప్రపంచం ఉన్నట్లు అనుకరణలు చూపిస్తున్నాయి. ఈ భూమితో పోల్చి చూస్తే మన భూమిపై ఉన్న 70 శాతం నీటి ప్రాంతాలు మొత్తం ద్రవ్యరాశిలో కేవలం 1 శాతం మాత్రమే. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ అతిపెద్ద భూమి మనకు 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే మన లాంటి భూమి మరోటి ఉందని మురిసిపోవడం తప్ప చేసేది ఏవిూ లేదు. ఎందుకంటే ఒక కాంతి సంవత్సరమంటే.. దాదాపు 9 లక్షల 50 వేల కోట్ల కిలోవిూటర్లు. ఈ లెక్కన 100 కాంతి సంవత్సరాలు అంటే ఎంత దూరంలో ఉందో ఊహిస్తేనే కష్టంగా ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *