కాంగ్రెస్‌ లో నయా జోష్‌

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంకగాంధీ తెలంగాణ పర్యటనకు ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 8న ప్రియాంకగాంధీ హైదరాబాద్‌ పర్యటనకు రానున్నట్లు సమాచారం. సరూర్‌నగర్‌ స్టేడియంలో జరగనున్న నిరుద్యోగ నిరసన సభలో ప్రియాంకగాంధీ పాల్గొననున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 5 లేదా 6న ఈ సభ నిర్వహించాలని టీ కాంగ్రెస్‌ ముందుగా నిర్ణయం తీసుకుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సభను 8వ తేదీకి వాయిదా వేశారు.ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. ఈ నెల 8న అక్కడ ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పడనుంది. దీంతో కర్ణాటక నుంచి ఢల్లీికి తిరిగి వెళ్లే సమయంలో ప్రియాంకగాంధీ హైదరాబాద్‌లో పర్యటించనున్నట్లు టీపీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై టీ కాంగ్రెస్‌ పోరాటం చేస్తోంది. అందులో భాగంగా జిల్లాల్లో నిరుద్యోగ నిరసన సభలు నిర్వహిస్తోంది. ఇటీవల నల్లగొండలో ఈ సభ నిర్వహించగా.. ఇప్పుడు సురూర్‌నగర్‌లో సభకు టీ కాంగ్రెస్‌ ఏర్పాట్లు చేస్తోంది.ఈ సభలో ప్రియాంకగాంధీ పాల్గొననన్నట్లు సమాచారం. ఇవాళ టీపీసీసీ ముఖ్యనేతలతో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే జూమ్‌ విూటింగ్‌ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రియాంకగాంధీ పర్యటనపై చర్చించనున్నారని తెలుస్తోంది. నిరుద్యోగ నిరసన సభ ఏర్పాట్లపై నేతలతో చర్చించనున్నారు. ప్రియాంకగాంధీ తెలంగాణ పర్యటనకు వస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. కానీ కర్ణాటక ఎన్నికల ప్రచారం ఉన్నందువల్ల వాయిదా పడుతూ వస్తోంది. ప్రియాంకగాంధీని తెలంగాణకు తీసుకురావాలని టీపీసీసీ నేతలు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోన్నారు. అందులో భాగంగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆమెను తెలంగాణలో కూడా పర్యటించాలని నేతలు కోరారు. దీంతో తెలంగాణకు వచ్చేందుకు ప్రియాంకగాంధీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరో కొద్ది నెలల్లో జరగనున్న వేళ.. ప్రియాంకగాంధీ రాకతో టీ కాంగ్రెస్‌లో కొత్త జోష్‌ వస్తుందని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రేవంత్‌, భట్టి పాదయాత్రలతో కాంగ్రెస్‌ కాస్త పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ జోష్‌ను ఇలాగే కంటిన్యూ చేయాలని టీపీసీసీ నేతలు భావిస్తున్నారు. రేవంత్‌ పాదయాత్ర ఇప్పటికే ముగియగా.. ప్రస్తుతం భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. మరోవైపు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తాను పాదయాత్ర చేస్తానని, ఏఐసీసీ అనుమతి కోరతానని చెప్పారు. పార్టీ సీనియర్‌ నేతలందరూ ఏకతాటిపైకి వస్తుండటంతో హస్తం శ్రేణుల్లో నయా జోష్‌ కనబడుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *