గెలిచే గుర్రాల కోసం వరుస సర్వేలు

విజయవాడ, ఆగస్టు 16
ఆంధ?రప్రదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి.మరోవైపు ముఖ?యమంత్రి మనసులో ఏముందో తెలియక రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.ముందస్తు ఎన్నికల ప్రచారాలను పక్కన పెడితే అభ్యర్థుల వడపోత మాత్రం చురుగ్గా సాగుతోంది.ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు ఏడెనిమిది నెలల్లోకి వచ్చేశాయి.ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం కూడా ఇంకా సజీవంగానే ఉంది.ముఖ్యమంత్రి ఏ క్షణంలోనైనా ఎన్నికల ప్రకటన చేయొచ్చనే ప్రచారం కొన్నాళ్లుగా ఏపీ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ముందస్తు ఎన్నికలపై ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని కేంద్రం సమ్మతించడమే ఆలస్యమని విపక్షాలు చెబుతున్నాయి.మరోవైపు ఏపీలో అధికార పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు ఎవరనే ఉత్కంఠ మాత్రం అలాగే ఉంది. మూడ్నెల్లకోసారి నిర్వహిస్తున్న సవిూక్షల్లో కొందరికి పనితీరు మార్చుకోవాలని ముఖ్యమంత్రి సూచిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని పదేపదే చెబుతున్నారు.ఓ వైపు ముందస్తు ఎన్నికల ప్రచారం, మరోవైపు అభ్యర్థిత్వం విషయంలో అనుమానాలతో చాలామంది అధికార పార్టీ నాయకులు ఆందోళనతో గడుపుతున్నారు. ముఖ?యమంత్రి జగన్‌ మాత్రం ఎన్నికల కసరత్తులో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. నాలుగైదు సంస్థలతో సర్వేలు చేయించి వాటిని సరిపోల్చుకునే పనిలో జగన్మోహన్‌ రెడ్డి ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం ఏపీలో వైఎస్సార్సీపీకి అధికారికంగా ఐపాక్‌ సంస్థ పొలిటికల్‌ కన్సల్టెన్సీ సేవలు అందిస్తోంది. పార్టీ నాయకుల ప్రచార కార్యక్రమాల్లో కూడా ఈ సంస్థ ఉద్యోగుల్ని భాగస్వాముల్ని చేశారు. పార్టీ నిర్దేశించిన విధివిధానాలకు అనుగుణంగా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయో లేదో క్షేత్ర స్థాయి నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు.ఈ సంస్థ ఇచ్చే ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా అభ్యర్థుల పనితీరును బేరీజు వేస్తున్నారు.ఐపాక్‌ ఇచ్చే నివేదికలపైనే ముఖ్యమంత్రి పూర్తిగా ఆధారపడకుండా మరో నాలుగైదు సంస్థల నుంచి ఎప్పటికప్పుడు ఇన్‌ఫుట్స్‌ తెప్పించుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి సొంత సంస్థ సాక్షికి ఉన్న నెట్‌వర్క్‌ ద్వారా అభ్యర్థుల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేస్తున్నారు. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో సర్వేలతో ప్రాచుర్యం పొందిన మరో విూడియా సంస్థ కూడా వైసీపీకి సేవలందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీటితో పాటు తిరుపతికి చెందిన వైసీపీ కీలక నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఆధ్వర్యంలో మరో సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జనం నాడిని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.ముఖ్యమంత్రి కార్యదర్శి హోదాలో ఉన్న అవినాష్‌ ఆధ్వర్యంలో కూడా మరికొన్ని సంస్థలు నేరుగా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వానికి పొలిటికల్‌ ఇంటెలిజెన్స్‌ సేవలు అందిస్తున్న అవినాష్‌, సొంతంగా రెండు మూడు సంస్థలతో క్షేత్ర స్థాయి సమాచార సేకరణ చేస్తున్నారు. దాదాపు నాలుగేళ్లుగా అవినాష్‌ సంస్థలు ఈ బాధ్యతల్లో ఉన్నాయి. మొదట్లో సిఎంఓలో కీలకంగా వ్యవహరించిన అవినాష్‌, ఆ తర్వాత రకరకాల కారణాలతో పక్కకు తప్పుకున్న తర్వాత పూర్తి స్థాయిలో కన్సల్టెంట్‌ సేవల్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది.గతంలో అవినాష్‌ సొంతంగా ఏర్పాటు చేసుకున్న కన్సల్టెన్సీ సంస్థల ద్వారా ఇప్పుడు ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు నుంచి రాజకీయ నాయకుల పనితీరు వరకు వేర్వేరు అంశాలపై సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి వారం వారం సిఎంఓకు అందిస్తున్నట్లు తెలుస్తోంది.వేర్వేరు మార్గాల్లో సేకరించిన సమాచారం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.ఈ క్రమంలో ఎవరికి నిశ్చింతగా ఉండే పరిస్థితి లేదని చెబుతున్నాయి.ముందస్తు ఎన్నికలు రావొచ్చని విపక్ష నాయకులు పదేపదే చెబుతున్న నేపథ్యంలో సెప్టెంబర్‌ రెండో వారం తర్వాత ప్రకటన ఉండొచ్చనే అనుమానాలు అధికార వర్గాల్లో కూడా ఉంది. అక్టోబర్‌లో ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలు వెళ్లే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓటర్ల జాబితాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చిందని చెబుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు వీలుగా ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ జరుగుతోందని చెబుతున్నారు.మరోవైపు ముందస్తు ఎన్నికలకు కేంద్రం నుంచి అమోదం రాలేదని ప్రతిపక్ష పార్టీలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. మూడు నాలుగు నెలల క్రితం ఆర్ధిక ఇబ్బందులు, సంక్షేమ పథకాలను కొనసాగించే పరిస్థితులు లేకపోవడం వంటి కారణాలతో ముందస్తు ఎన్నికలకు సిద్ధమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి అమోదం రాలేదని చెబుతున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కేంద్రానికి పూర్తి స్థాయిలో అవగాహన ఉండటంతో ముందస్తుకు అనుమతించలేదని టీడీపీ నాయకుడొకరు తెలిపారు.ఎన్నికలకు ఎప్పుడొచ్చిన ఎదుర్కొడానికి క్యాడర్‌ను సిద్ధం చేసే క్రమంలోనే తమ పార్టీ నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నట్లు చెబుతున్నారు. విపక్షాలు సన్నద్ధంగా లేకపోవడాన్ని అదనుగా చూసి ప్రభుత్వాన్ని రద్దు చేసే ప్రయత్నాలను ఊహించి క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *