స్వర్ణ ప్రియ

అమ్మాన్‌ (జోర్డాన్‌): జూనియర్‌ రెజ్లింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో ప్రియా మాలిక్‌ సర్ణంతో అదరగొట్టింది. గురువారం జరిగిన మహిళల 76 కిలోల ఫైనల్లో ప్రియ 5-0తో లారా సెవ్లీ (జర్మనీ)ని మట్టికరిపించింది. భారత రెజ్లర్‌ ఉడుంపట్టుకు లారా ఒక్క పాయింట్‌ కూడా స్కోరు చేయలేక పోయింది. కాగా, ఈవెంట్‌ చరిత్రలో పసిడి నెగ్గిన రెండో భారత మహిళా రెజ్లర్‌గా ప్రియ నిలిచింది. గతేడాది అంతిమ్‌ పంఘాల్‌ ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. ఇక, డిఫెండింగ్‌ చాంప్‌ అంతిమ్‌ పంఘాల్‌, సవిత, అంతిమ్‌ కుందూ ఫైనల్‌కు దూసుకెళ్లారు. 53 కిలోల విభాగం సెమీ్‌సలో అంతిమ్‌ పంఘాల్‌ 12-0తో పొలినా లుకినాపై గెలిచి టైటిల్‌ నిలబెట్టుకునేందుకు అడుగుదూరంలో నిలిచింది. ఆసియాడ్‌ బెర్త్‌ విషయంలో వినేశ్‌ ఫొగట్‌పై కేసు వేసి అంతిమ్‌ వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. 62 కిలోల సెమీ్‌సలో ఐరిస్‌ మతిల్డే (ఫ్రాన్స్‌)పై సవిత బైఫాల్‌ పద్ధతిలో నెగ్గి ఫైనల్‌కు చేరుకొంది. 65 కిలోల కేటగిరీలో అంతిమ్‌ కుండు 9-5తో ఎకతరీనా కోష్కినాపై గెలిచింది. కాగా, 72 కిలోల్లో హర్షిత 1-2తో బుకారెస్‌ సెర్ట్‌ (టర్కీ) చేతిలో ఓడి కాంస్యం కోసం తలపడనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *