విజయవాడకు లోకేష్‌

విజయవాడ, అక్టోబరు 6
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఢల్లీి వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు 20 రోజులుగా హస్తినలో ఉన్న ఆయన.. గురువారం రాత్రి విజయవాడకు తిరిగొచ్చారు. ఢల్లీి నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు లోకేష్‌ చేరుకున్నారు. లోకేష్‌కు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలతో కరచాలనం, అభివాదం చేసిన లోకేష్‌.. అనంతరం ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లారు. ఈ ఉదయం రాజమండ్రికి నారా లోకేష్‌ చేరుకుని. జైల్లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్‌ అయ్యారు. సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌పై విచారణ, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల గురించి బాబుతో చర్చించనున్నారని తెలుస్తోంది. అలాగే పార్టీ పరంగా చేపట్టాల్సి కార్యక్రమాలు, భవిష్యత్‌ కార్యాచరణ గురించి బాబుతో లోకేష్‌ మాట్లాడే అవకాశముంది. హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్లు, కస్టడీపై శుక్రవారానికి విచారణ వాయిదా పడిరది. ఈ అంశాన్ని కూడా చంద్రబాబుకు వివరించనున్నారు. కేసుల్లో న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలనే విషయాలతో పాటు టీడీపీ`జనసేన పొత్తు పరిణామాల గురించి చంద్రబాబుతో చర్చించనున్నారు.చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత రెండుసార్లు రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో లోకేష్‌ ములాఖత్‌ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు కేసుపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసేందుకు, అక్కడ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపేందుకు గత నెల 14న లోకేష్‌ ఢల్లీికి బయల్దేరారు. ఆ తర్వాత ఇవాళ విజయవాడకు చేరుకోగా.. రేపు మరోసారి జైల్లో బాబును కలవనున్నారు. లోకేష్‌తో పాటు కుటుంబసభ్యులు కూడా చంద్రబాబును కలవనున్నారు. బాబుతో భేటీ అనంతరం లోకేష్‌ విూడియాతో మాట్లాడే అవకాశముంది. రేపు రాజమండ్రికి లోకేష్‌ వస్తుండటంతో భారీగా శ్రేణులు కూడా చేరుకుంటున్నారు.. జాతీయ రహదారి వద్దే పార్టీ కార్యకర్తలను అడ్డగించారు. దీంతో కార్యకర్తలు వెహికల్స్‌ను రోడ్డుపైనే పార్కింగ్‌ చేసి ఎయిర్‌పోర్ట్‌ వరకు నడుచుకుంటూ వెళ్లారు. లోకేష్‌కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఢల్లీిలో 20 రోజుల పాటు ఉన్న లోకేష్‌.. చంద్రబాబు అరెస్ట్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చేశారు. పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టడంతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి చంద్రబాబు అరెస్ట్‌ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పాటు ఢల్లీి వేదికగానే చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై రాష్ట్ర నేతలతో చర్చించారు. టీడీపీ సమావేశాలకు వర్చువల్‌ విధానంలోనే లోకేష్‌ పాల్గొన్నారు. దీంతో పాటు చంద్రబాబు కేసు పరిణామాల గురించి సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో లోకేష్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయగా.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో విచారణకు రావాల్సిందిగా సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ విచారణకు హాజరయ్యేందుకు లోకేష్‌కు సీఐడీ ఇచ్చిన గడువును హైకోర్టు పెంచింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *