తెలంగాణలోనే షర్మిల రాజకీయం

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌ లో విలీనం చేసి ఏపీలో షర్మిల రాజకీయాలు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై వైఎస్‌ షర్మిల సోషల్‌ విూడియాలో పరోక్షంగా స్పందించారు. ఏపీకి వెళ్లే ప్రశ్నే లేదని తన స్పందన ద్వారా తేల్చి చెప్పారు. వైఎస్‌ షర్మిల రెడ్డి తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటుందన్నారు. వైఎస్‌ షర్మిల బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలపై ఘాటు విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలు గల్లీలు సిగపట్లు పట్టి, ఢల్లీిలో కౌగిలించుకుంటున్నాయంటూ సెటైర్లు వేశారు. ఈ మేరకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలను ఎండగడుతూ ట్విట్టర్‌లో సుదీర్ఘ పోస్టును షేర్‌ చేశారు షర్మిల. ‘కుళ్లు కాయలను బంగారు సంచిలో దాచినా కంపు బయటపడదా ఏంటి? అలాగే ఉంది.. బీఆర్‌ఎస్‌, బీజేపీల అక్రమ మైత్రి. ఎంతదాచినా దాగదులే అన్నట్టు.. గల్లీలో సిగపట్లు, ఢల్లీిలో కౌగిలింతలు.. నిజం కాదని నిరూపించగలరా? బిహార్‌ లో జరిగిన బీజేపీయేతర పక్షాల సమావేశానికి విూకు ఆహ్వానం ఎందుకు అందలేదో చెప్పే దమ్ముందా విూకు? బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ బీజేపీపై కేసీఆర్‌ తీరు సరిగా లేదని చెప్పేశారు. మరోవైపు శరద్‌ పవార్‌ అయితే ఏకంగా బీజేపీ , బీఆర్‌ఎస్‌ ఒక్కటే అన్నారు. ఇంకా విూ నాటకాలు దేనికి? తమిళనాడు మాజీ మంత్రిని ఎంత రాక్షసంగా అరెస్టు చేసారో చూసాం. మరి బలమైన సాక్ష్యాలున్నాయంటూ కవితను నాలుగుసార్లు ఆఫీసుల చుట్టూ తిప్పింది సీబీఐ. మరి ఆ తరువాత ఆమెను అరెస్టు ఎందుకు చేయదు? అసలు జాబితాలో ఆమె పేరే ఉండకపోవడమేందో! ఆమె కడిగిన ముత్యమా, లేక విూది కుదిరిన బంధమా? తెలంగాణ మంత్రుల విూద ఈడీ దాడులుంటాయి, కానీ అరెస్టులు ఉండవు. కాళేశ్వరం విూద నేను నిరంతరం పోరాటం చేస్తున్నా బీజేపీ మంత్రులు పనికిమాలిన ప్రకటనలు చేస్తారు తప్ప చర్యలుండవు. ఇంతలో కేసీఆర్‌ బీజేపీని పెద్దమనసుతో క్షమించేసి సభాముఖంగా దాడులు చేయడం బంద్‌ చేస్తారు. ఆయన కుమారుడు ఆగమేఘాల విూద ఢల్లీికి పోయి అమిత్‌ షాను కలుస్తాడు. బీజేపీ ముఖ్యమంత్రులు నెలల తరబడి ఎదురుచూస్తున్నా దొరకని అపాయింట్‌ మెంట్‌ గాలికంటే వేగంగా కేటీఆర్‌ కు దొరుకుతుంది. సమాజ్దార్‌ కో ఇషారా కాఫీ అన్నట్టు.. సిగ్గులేకుండా, ఆత్మలు అమ్ముకుని చేతులు కలుపుతున్న వీరి నీచక్రీడలను నాలుగు కోట్ల ప్రజలు గమనిస్తున్నారు. త్వరలోనే తెలంగాణ ప్రజలు వీరి స్నేహానికి బొందపెడతారు’ అని ఘాటుగా విమర్శించింది షర్మిల.ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు, తెలంగాణ ప్రజలమధ్య అగాధాన్ని సృష్టించే విఫల యత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పనిలేని,పసలేని దార్శనికులకు నేను చెప్పేది ఒకటనని.. తన రాజకీయ భవిత విూద పెట్టె దృష్టిని, సమయాన్ని కేసీఅర్‌ పాలనపై పెట్టాలని సూచించారు. అన్నివిధాలుగా కేసీఆర్‌ సర్కారు పాలనలో సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవితవిూద పెట్టండి. కేసీఆర్‌ కుటుంబం అవినీతిని ఎండగట్టండి. నా భవిష్యత్తు తెలంగాణతోనే, తెలంగాణలోనే, నా ఆరాటం, నా పోరాటం తెలంగాణ కోసమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ లో విలీన వార్తను షర్మిల తన ప్రకటనలో ఖండిరచలేదు. కేవలం తాను ఏపీలో రాజకీయాలు చేస్తారని జరుగుతున్న ప్రచారాన్నే పరోక్షంగా ఖండిరచారు. తాను తెలంగాణలోనే ఉంటానంటున్నారు. వైఎస్‌ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌ లో విలీనం చేయడంపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఆమె రాజకీయాలు చేయాల్సి వస్తే విలీనం అవసరం లేదని రేవంత్‌ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఏపీ పీసీసీ చీఫ్‌ గా వెళ్లాలంటున్నారు. రేవంత్‌తో పాటు ఎక్కువ మంది ఆమె ఎపీ కాంగ్రెస్‌ లో అయితే ఉపయోగం అని విశ్లేషిస్తున్నారు. కానీ షర్మిల మాత్రం తెలంగాణలోనే రాజకీయం చేస్తానంటున్నారు. షర్మిల పార్టీ పెట్టిన తర్వాత ఎ ఎన్నికలనూ పోటీ చేయలేదు. కొన్ని ఉపఎన్నికలు వచ్చినా సైలెంట్‌ గానే ఉన్నారు. మొదట్లో షర్మిల బీజేపీ వదిలిన బాణం అనుకున్నారు. కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత అందరితో పాటు ఆమె కూడా మారిపోయారు. నిజానికి అందరి కంటే వేగంగాఆమె స్పందించారు. ఇలా ఫలితాలు వస్తున్న సమయంలోనే బెంగళూరులో డీకే శివకుమార్‌ తో సమావేశం అయ్యారు. తన సమావేశం గురించి తానే స్వయంగా బయట పెట్టారు. తర్వాత శివకుమార్‌ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరోసారి కలిశారు. శివకుమార్‌ కు వచ్చే ఎన్నికల్లో దక్షిణాది తరపున కాంగ్రెస్‌ బాధ్యతలు ఇస్తున్నట్లుగా ప్రచారం జరగడంతో.. షర్మిల ప్రయత్నం అంతా కాంగ్రెస్‌ పార్టీతో జత కట్టడానికేనన్న వాదన బలపడిరది. ఇటీవల రాహుల్‌ గాంధీ పుట్టిన రోజు నాడు కూడా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. దీంతో విలీనం ఖాయమయిందని చెబుతున్నారు. వైఎస్‌ జయంతి రోజున ఇడుపుల పాయలో సోనియా, రాహుల్‌ నివాళులు అర్పించిన తర్వాత విలీన ప్రకటన చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆమె ఏపీ రాజకీయాల్లోకి వెళ్తే కీలక మార్పులు ఉంటాయని విశ్లేషణలు వస్తూండటంతో.. తన రాజకీయం తెలంగాణలోనేనని ఆమె చెబుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *