హైటెక్‌ విలేజ్‌ ఆఫ్‌ ఇండియాకు జనం క్యూ

గాంధీనగర్‌, జూన్‌ 27 :
స్కూల్స్‌, కాలేజ్‌, వైఫై, కొత్త టెక్నాలజీ, స్ట్రీట్‌ లైట్లు, సిటీలోని అన్ని సౌకర్యాలు కలిగిన గ్రామాన్ని ఊహించుకోండి ఎలా ఉంటుందో? బహుశా ఇది కేవలం ఊహ మాత్రమే అనుకోవద్దు..ఎందుకంటే.. మన దేశంలోనే ఇలాంటి ఒక గ్రామం ఉంది. అక్కడ విూకు ఇలాంటి సౌకర్యాలన్నీ లభిస్తాయి. ఈ గ్రామం అనేక నగరాల కంటే అభివృద్ధి చెందిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ గ్రామం గుజరాత్‌ రాష్ట్రంలో ఉంది. పాఠశాలలు, కళాశాలలే కాకుండా నగరాల్లో లేని సౌకర్యాలు కూడా ఈ గ్రామంలో ఎన్నో ఉన్నాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇక్కడ నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఈ గ్రామం పేరు పుంసరి. హైటెక్‌ విలేజ్‌ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన పుంసరి గ్రామాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి ప్రజలు, పర్యాటకులు తరలి వస్తుంటారు. ఆసుపత్రి నుండి పబ్లిక్‌ వైఫై, ఇతర అన్ని సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.దేశంలోని అత్యంత హైటెక్‌ గ్రామంగా పేరున్న పుంసరి విలేజ్‌లో వైఫై హాస్పిటల్‌, ంఅ స్కూల్‌ వంటి నగరాల సౌకర్యాల కంటే మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అందుకే ఈ పుంసరి అభివృద్ధిని చూసి దేశవ్యాప్తంగా తరలివస్తున్న సందర్శకులు ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల గదుల్లో ఏసీలు ఉండడంతో ఆ ఊరి నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడ చదువుకునేందుకు వస్తుంటారు. ఈ గ్రామంలో మొత్తం ఐదు పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ంఅ సౌకర్యం ఉంటుంది. ప్రజలు వైద్యం కోసం నగరానికి వెళ్లాల్సిన అవసరం లేదు. దీని కోసం అన్ని సౌకర్యాలతో కూడిన ఆసుపత్రులు కూడా అందుబాటులో ఉన్నాయి.గుజరాత్‌లోని ఈ గ్రామంలో మొబైల్‌ లైబ్రరీ కూడా ఉంది. ఈ లైబ్రరీ ఆటోలో ఏర్పాటు చేశారు. చదుకోవడానికి ఇష్టపడే ఎవరైనా ఈ లైబ్రరీని ఉపయోగించుకోవచ్చు. ఒక నిర్దిష్ట సమయంలో, ఈ లైబ్రరీ సరైన ప్రదేశానికి చేరుకుంటుంది. ప్రజలు తమకు నచ్చిన పుస్తకాలను అక్కడ చదువుతారు. అంతేకాదు.. ఈ పుంసరి గ్రామం ఎంత అత్యాధునికమైనదంటే గ్రామ పంచాయతీలో బయోమెట్రిక్‌ ఉపయోగించబడుతుంది. రవాణా వ్యవస్థ, స్వచ్ఛమైన రోడ్లు, స్వచ్ఛమైన నీరు, బయోగ్యాస్‌ ప్లాంట్‌ మొదలైనవి కూడా ఉన్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *