పొత్తులు…కత్తులు

ఏపీలో టీడీపీ , బీజేపీ మధ్య పరస్పర విమర్శలు పెరుగుతున్నాయి. జగన్‌ ప్రభుత్వం అవినీతి, అరాచకాల్లో మనిగిపోయిందని ఆ పార్టీ అగ్రనేతలు ప్రకటించారని మరి చర్యలెప్పుడు తీసుకుంటారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు .. ఏపీ టీడీప అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పదే పదే ఈ విషయాలను ప్రకటిస్తున్నారు. దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఆ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి మండి పడుతున్నారు. అచ్చెన్నాయుడు తీరును విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పినప్పుడు ఆర్టికల్‌ 355 ప్రకారం కేంద్రం కల్పించుకునే అధికారం ఉందని… ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని అచ్చెన్నాయుడు ఇటీవల డిమాండ్‌ చేస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు ఏపీలో అరాచక పాలన ఉందని అన్నారని ఆయన అంటున్నారు. ఏపీలో ప్రభుత్వ ఉగ్రవాదం, నేరాలపై అమిత్‌ షా తో పాటు నడ్డా కూడా ఆందోళన వ్యక్తం చేశారని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. వివేకా కేసులో సీబీఐపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాడి చేస్తోందని.. ఏపీలో దళితులు, బడుగు వర్గాలపై జరుగుతున్న హింస బీజేపీకి కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏపీలోకి సిబిఐని చంద్రబాబు అనుమతించలేదని, అమిత్‌ షాపై తిరుపతిలో దాడి జరిగితే చంద్రబాబు చర్యలు తీసుకోలేదని సోము విమర్శలు గుప్పించారు. ఆ విషయాలపై మాట్లాడే దమ్ముందా అంటూ చంద్రబాబుకు సోము వీర్రాజు సవాల్‌ విసిరారు. ల చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా వద్దన్నారని, చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయనను విూడియా ప్రతినిధులు ఎందుకు ప్రశ్నించలేదని సోము నిలదీశారు. సోము వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంలాగా మార్చిన జగన్‌ పై కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరితే సోముకు ఎందుకు అంత కోపం వచ్చిందని అచ్చెన్న ప్రశ్నించారు.రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ విధ్వంసంపై, పాలనపై పోరాడాల్సిన సోము వీర్రాజు ఆ పార్టీని వెనకేసుకు రావడానికి ప్రయత్నించడం దారుణం అన్నారు. అచ్చెన్నాయుడు తీరు ఆడలేక మద్దెల ఓడన్నట్లుగా ఉందని విష్ణువర్ధన్‌ రెడ్డి మండిపడ్డారు. వైసీపీపై పోరాడలేక బీజేపీపై నిందలేయడం చేతకాని తనమేనన్నారు. వైసీపీపై పోరాడలేక బద్వేలు, ఆత్మకూరు ఉపఎన్నికల్లో పోటీ చేయలేక పారిపోయారు..స్థానిక ఎన్నికల్లో నామినేషన్లలు వేసి మరీ పోటీకి దూరంగా ఉన్నారన్నారు. ప్రతిపక్ష పార్టీగా వైసీపీ వైఫల్యాలపై నిలదీయలేకపోయారు.. ప్రతిపక్ష పార్టీగా అన్ని రకాలుగా వైఫల్యంగా చెందారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ గా ఘోర వైఫల్యం చెందిన విషయాన్ని ప్రజలు గుర్తించారని.. దాన్ని కప్పి పుచ్చుకునేందుకు బీజేపీపై వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యంపై కేంద్రం జోక్యం చేసుకోవాలనుకుంటే 2018`19లోనే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించేవారని విష్ణువర్దన్‌ రెడ్డి గుర్తు చేశారు. అప్పట్లో సాక్షాత్తూ హోంమంత్రి అమిత్‌ షా పై తిరుపతిలో రాళ్ల దాడి జరిగిందన్నారు. ఓ వైపు పొత్తు కోసం ప్రయత్నిస్తూ.. మరో వైపు బీజేపీని దెబ్బతీసే కుట్రలను తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ అమలు చేస్తోందని విష్ణువర్ధన్‌ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం .. ఏపీలో వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని.. ఆ రెండు పార్టీలు ఒకటేనన్న అభిప్రాయం కల్పించేందుకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రోజూ అలాంటి ప్రకటనలు చేస్తున్నారన్నారు. పొత్తులు ఉంటాయనుకున్న పార్టీల మధ్య ఇలా మాటల మంటలు పెరుగుతూండటంతో.. ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *