ఫేస్బుక్ లైవ్ పెట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫేస్బుక్ లైవ్ పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది. సన అనే యువతి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. కొంతకాలం క్రితం ఆమె హేమంత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన నాటి నుంచి ఆమెను అత్తమామలు తరచూ వేధించడం మొదలు పెట్టారు. అది చాలదన్నట్టు భర్త హేమంత్ సైతం మరో అమ్మాయికి దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే సనకు భర్త నుంచి కూడా వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. 5 నెలల నుంచి వేధింపులు భరించి భరించి విసుగు చెందిన సన ఫేస్బుక్లో లైవ్ వీడియో పెట్టి తన బాధనంతా వివరించి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం సన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్న్నారు.