ముంచేసిన మిచౌంగ్‌

నెల్లూరు, డిసెంబర్‌ 6
పీలో మిచౌంగ్‌ తుఫాన్‌ తీవ్ర బీభత్సం సృష్టించింది.రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో పంట నష్టం భారీగా జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నష్టం గురించి ప్రభుత్వాధికారులు ఇప్పటికే సవిూక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌ లో మిచౌంగ్‌ తుఫాన్‌ బీభత్సం సృష్టించింది. బాపట్ల వద్ద తీరం దాటింది.అయితే తుఫాన్‌ ప్రభావం రాష్ట్రం విూద బాగా చూపిస్తుంది. మరో రెండు మూడు గంటల్లో తీవ్ర తుఫాన్‌..తుఫాన్‌ గా బలహీనపడుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో గంటకు 90 నుంచి 100 కిలో విూటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మిచౌంగ్‌ తుఫాన్‌ ఎక్కువగా పంటలపైనే చూపినట్లు తెలుస్తుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో భీమవరం, కాళ్ల, ఉండి ప్రాంతాల్లో తుఫాన్‌ ప్రభావం వల్ల కరెంట్‌ సరఫరా కు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. కోతలు కోసిన రైతులు ధాన్యం తడిసిపోయిందని ఆవేదన చెందుతున్నారు.ధాన్యం మొత్తం నీటిలో తేలూతూ మురికి కాలువల్లో చేరుతుందని రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కలిదిండి, ఉండి, పెదపాడు, భీమవరం, పాలకొల్లు ప్రాంతాల్లో వరి చేలు నీట మునిగిపోయాయి. తుఫాన్‌ ప్రభావం ప్రకాశం , నెల్లూరు జిల్లాల్లో బాగా చూపించింది.మిరప తోటలతో పాటు పొగాకు పంటలు బాగా ధ్వంసమయ్యాయి. వందల ఎకరాల్లో పూల పంటలు, బొప్పాయి, అరటి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే పలు జిల్లాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.

చిత్తూరు జిల్లాలోని ఎన్టీఆర్‌ జలాశయంలో రెండు గేట్లను ఎత్తి వరద నీటిని అధికారులు బయటకు వదులుతున్నారు. దీంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.ఇప్పటికే రాష్ట్రంలోని తుఫాన్‌ ప్రభావం గురించి ముఖ్యమంత్రి జగన్‌ కలెక్టర్లు, అధికారులతో సవిూక్ష సమావేశం నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పంటనష్టం వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు సవిూక్షించాలని తెలిపారు.ఈ క్రమంలోనే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు నియోజకవర్గంలో పర్యటించారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎవరూ కూడా అధైర్య పడొద్దని ఆయన తెలిపారు. ధాన్యం తడిచినప్పటికీ..ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రభుత్వమే తీసుకుంటుందని వివరించారు.తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా ఉండడం వల్ల రైతులు వెంటనే తమ ధాన్యాన్ని సవిూపంలోని మిల్లులకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. మిల్లర్లు ఎవరైనా రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా తీరప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. పశ్చిమగోదావరి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలో వర్ష తీవ్రత అధికంగా ఉంది. రాయలసీమ జిల్లాల్లో సైతం తుఫాను ప్రభావం ఉంది. వరి, పొగాకు, పసుపు, అరటి పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో సరఫరా నిలిచిపోయింది.కాగా తుఫాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. బాధితులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. బాధితులు ఇంటికెళ్లినప్పుడు ప్రతి ఒక్కరికి రూ.1000 లేదా కుటుంబానికి రూ.2500తో పాటు నిత్యవసర సరుకులు అందించాలని ఆదేశించారు. తక్షణం విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాలని.. మనుషులు, పశువులు చనిపోతే 48 గంటల్లోనే పరిహారం అందించాలని.. పంట నష్టం అంచనాలను రూపొందించాలని సీఎం ఆదేశించారు. కాగా తుఫాను దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలనివిద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ముందుకొచ్చిన సంద్రం
మిగ్జామ్‌ తుపాను బాపట్ల వద్ద తీరాన్ని దాటనుంది. ఈ నేపథ్యంలో బాపట్ల వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. 20 అడుగుల ముందుకు తుపాను చొచ్చుకొచ్చింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. తుపాను నేపథ్యంలో 11 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. పంట మొత్తాన్ని మింగేసి వెళ్లింది మిచాంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఉప్పాడ తీరంలో కోత గురయిన ప్రాంతాలను పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు సందర్శించారు. ఉప్పాడ, మాయపట్నం, సుబ్బంపేటలో బైక్‌ విూద తిరుగుతూ తుఫాన్‌ సహయక చర్యలు పరిశీలించారు ఎమ్మెల్యే దొరబాబు. మిచౌంగ్‌ తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో మంళవారం సవిూక్ష నిర్వహించారు. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్‌, సీసీఎల్‌ఏ సెక్రటరీ ఇంతియాజ్‌, సీఎంఓ అధికారులతో సీఎం భేటీ అయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *