కర్నూలులో టామాటా 30 పైసలు

కర్నూలు, అక్టోబరు 6
ఒకొక్కసారి అతి వృష్టి.. మరొకసారి అనావృష్టితో పంటలు పండడంపై అనుమానమే.. ఇక పండిన పంట చేతికి వచ్చే సమయంలో గిట్టుబాటు ధర రావాలి.. లేకుండా వ్యవసాయం దండగే అనుకుంటాడు రైతన్న.. ఒకొక్కసారి ఉల్లి, టమాటా, వంటి పంటలకు భారీ డిమాండ్‌ నెలకొని.. ఒక్కసారిగా కిలో వంద అన్నా దొరకని పరిస్థితి నెలకొంటుంది. అప్పుడు అన్నదాత పంట చేతికి రాదు.. తీరా పంట చేతికి అంది వచ్చిన తర్వాత కిలో వంద మాట దేవుడెరుగు.. కనీసం పంటకు పెట్టిన పెట్టుబడి.. మార్కెట్‌ కు తీసుకుని వెళ్లిన రవాణా ఖర్చులు వస్తే చాలు దేవుడా అంటూ రైతు కోరుకుంటాడు అని అంటే అతిశయోక్తి కాదు.. ఇటీవల దేశ వ్యాప్తంగా టమాటాకు భారీ డిమాండ్‌ నెలకొంది. అప్పుడు టమాటా రైతులు కొందరు కోటీశ్వరులు కూడా అయ్యారు కూడా. అయితే కేవలం కొన్ని రోజుల్లోనే టమాటా ధర భారీ పడిపోయింది. ఎంతగా అంటే.. కిలో టమాటా అమ్మితే రైతు కనీసం టీ కప్పు కూడా కొనుక్కోలేని స్టేజ్‌ కు చేరుకున్నది.ఏపీలో టమాటా ధర దారుణంగా పడిపోయింది. కర్నూలు జిల్లాలోని పత్తికొండ మార్కెట్లో కిలో టమోటా 30 పైసలు పలుకుతోంది. బహిరంగ మార్కెట్‌ లో కిలో రూ. 20 ఉన్నాయా.. మార్కెట్లో మాత్రం రోజు రోజుకు టమోటా ధర పతనం అవుతోంది. అయితే వారం రోజుల క్రితం టమోటాల్ని ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తుందని మార్కెట్‌ యార్డ్‌ అధికారులు చెప్పారు. కానీ ఈ హావిూ అమల్లోకి రాలేదని టమాటా రైతులు వాపోతున్నారు. పూర్తిస్థాయిలో పతనమైన టమోటా ధర తగ్గినా మార్కెట్‌ యార్డ్‌ అధికారులు పట్టించుకోవడం లేదంటూ టమాటా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమను ప్రభుత్వం ఆదుకోవాలని.. టమాటా పంటకు కనీసం గిట్టుబాటు ధర కల్పించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *