మూడు విూటింగ్‌ లు… ఆరు మాటలు

ఓ వైపు ఎండలు.. మరో వైపు రాజకీయాలు.. ఏపీలో పరిస్థితులు చాలా హాట్‌ హాట్‌ సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయ భేరీ మోగించాలని టీడీపీ, మరోసారి అధికారం చెజిక్కించుకోవాలని వైసీపీ ఎదురుచూస్తున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ ఎలాగైనా మళ్లీ అధికారం చేపట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అటు ప్రతిపక్షంలో ఉన్న తెలుగు దేశం పార్టీ.. అధికారంలో ఉన్న వైసీపీ చేస్తున్న అన్యాయాలను వెలికితీస్తూ, ప్రజలకు అర్థం అయ్యేలా వివరిస్తూ తనదైన శైలిలో ముందుకెళ్తోంది. దీంతో ఎన్నికలకు ఏడాది సమయం మిగిలి ఉండగానే రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నాయకులు కూడా ప్రజల దగ్గరికి వెళ్లి అనేక హావిూలు ఇచ్చి వస్తున్నారు. కొందరు నాయకులైతే మూడు విూటింగులు, ఆరు మాటలు అన్న విధంగా నాయకులు తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎత్తులకుపై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్న వేళ.. వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి తన పార్టీకి సంబంధించి ఆయా నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను ఫిక్స్‌ చేస్తూ వస్తున్నారు. టీడీపీని కోలుకోనివ్వకుండా దెబ్బ తీసేలా పార్టీ అధినాయకత్వం తన అభ్యర్థులకు సూచనలు చేస్తోందని సమాచారం. అభ్యర్థుల ఎంపికపై కూడా ఆచూ తూచి వ్యవహరిస్తున్నారని, పక్కాగా గెలుస్తామని నమ్మకం ఇచ్చిన వారికే ఈ సారి సీట్లు వస్తాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంపై వైసీపీ కన్నేసింది. టెక్కలి అసెంబ్లీ సీటు నుంచి దువ్వాడ శ్రీనివాస్‌ భార్య దువ్వాడ వాణి పోటీ చేస్తారని ప్రకటించింది. ఇక్కడ అసలు ట్విస్ట్‌ ఏంటంటే.. వైసీపీ సీనియర్‌ నాయకుడు, గతంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్‌ టెక్కలి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. తాజా వైసీపీ నిర్ణయంతో ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. దువ్వాడ శ్రీనివాస్‌ చాలా సీనియర్‌ నేత. అతనికి మాస్‌ ఫాలోయింగ్‌ తప్ప పర్సనల్‌గా ఓటింగ్‌ లేదని ముందుగానే గ్రహించిన వైసీపీ ఓ అంచనాకు వచ్చింది. చాలా తెలివిగా ఆయన భార్యకు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి బరిలోకి దించేందుకు సిద్ధమైంది. దీంతో వైసీపీ అధినేత.. తన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో ఏ స్థాయిలో గ్రౌండ్‌ వర్క్‌ చేస్తున్నారో అర్థమవుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *