ప్రభుత్వంపై నెట్టేసిన సుప్రీం

స్వ లింగ వివాహాలకు సంబంధించి సుప్రీంకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. తీర్పును సమర్ధిస్తూ ఒక వర్గం, తీర్పును వ్యతిరేకిస్తూ మరో వర్గం మెయిన్‌ విూడియాలో, సోషల్‌ విూడియాలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగిస్తోంది.స్వలింగ వివాహాలకు చట్టబద్ధతను కల్పించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎల్జీబీటీక్యూ వర్గం వారిని హతాశులను చేసింది. సుప్రీంకోర్టు తమ హక్కును గుర్తించి, తమకు అనుకూలంగా తీర్పును వెలువరిస్తుందని వారంతా ఆశించారు. కానీ, స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే విషయంలో చట్టాలు చేసే ప్రభుత్వాలదే ప్రధాన పాత్ర అని, తమది కేవలం సవిూక్షించే బాధ్యత అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే స్వ లింగ పౌరుల హక్కుల పరిరక్షణకు సంబంధించి కొన్ని కీలక ఆదేశాలను మాత్రం వెలువరించింది.
స్వలింగ వివాహాలకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై సోషల్‌ విూడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తీర్పుపై ఎల్జీబీటీక్యూ (ఒఉఃుఖి) వర్గం ఈ తీర్పుపై తీవ్రమైన అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. తమ సహ జీవనానికి సుప్రీంకోర్టు వైవాహిక చట్టబద్ధత కల్పిస్తుందని తాము ఆశించామని, కానీ తమ ఆశపై కోర్టు నీళ్లు చల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ విూడియాలో, ముఖ్యంగా, ట్విటర్‌ లో తమ వాదన వినిపిస్తున్నారుసుప్రీంకోర్టు తీర్పులో తమ వర్గం వారిపై పై పై సానుభూతి మాత్రమే కనిపించిందని, తమ సమస్యను సరిగ్గా అర్థం చేసుకుని తీర్పు వెలువరించలేదని ఎల్జీబీటీక్యూ వర్గానికి చెందిన ఒక యూజర్‌ ట్వీట్‌ చేశారు. కొన్ని దశాబ్దాలుగా సమాజం నుంచి వివక్షను, హింస ను ఎదుర్కొన్నామని, ఇప్పుడైనా తమకు సమాన హక్కులు లభిస్తాయని ఆశించామని, కానీ తమ ఆశ అడియాసే అయిందని ఆ యూజర్‌ తన సుదీర్ఘ పోస్ట్‌ లో ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన కృత్రిమ సానుభూతి వ్యాఖ్యలు తమకు అవసరం లేదని, వారి కృత్రిమ, పైపై సానుభూతి తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. ‘‘మాటలు మాత్రం చెప్పారు, కానీ, మాకు అవసరమైన నిర్దిష్టమైన చర్యలు మాత్రం చేపట్టలేదు’’ అని విమర్శించారు. ‘‘మా బాధను అర్థం చేసుకోకుండా, మమ్మల్ని, మా సమస్యలను ఏ మాత్రం పట్టించుకోకుండా, మమ్మల్ని ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై వదిలేశారు’’ అని మరో ట్విటర్‌ యూజర్‌ సుప్రీంకోర్టు తీరుపై స్పందించారు. భారతదేశ వైవాహిక చట్టాల్లో మార్పులు చేసి, లైంగిక సమానత్వాన్ని సాధించడానికి సుప్రీంకోర్టు ప్రయత్నించలేదని మరో యూజర్‌ విమర్శించారు. సుప్రీంకోర్టుకు శుష్క ప్రియాలని మండిపడ్డారు.స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించకుండా సుప్రీంకోర్టు సరైన తీర్పునే ఇచ్చిందని మరో ట్విటర్‌ యూజర్‌ వ్యాఖ్యానించారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ఈ తీర్పును ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ తీర్పును ఇచ్చిన ధర్మాసనంలో చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తో పాటు జస్టిస్‌ ఎస్కే కౌల్‌, జస్టిస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ హిమ కొహ్లి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ ఉన్నారు. జస్టిస్‌ చంద్ర చూడ్‌ తో పాటు జస్టిస్‌ ఎస్కే కౌల్‌, జస్టిస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ వేర్వేరు తీర్పులను రాశారు. దేశంలో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే విషయంపై అడుగు దూరంలో ఆగిపోయింది సుప్రీంకోర్టు. చట్టబద్ధతను కల్పిస్తున్నట్టు తీర్పును వెలువరించకపోయినప్పటికీ.. స్వలింగ సంపర్కుల హక్కుల గురించి కీలక వ్యాఖ్యలు చేస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక ఆదేశాలిచ్చింది.భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఎస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ పీఎస్‌ నరసింహతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం కొంతకాలంగా ఈ వ్యవహారంపై విచారణ జరుపుతూ వచ్చింది. ఈ అంశంపై గత మేలో వరుసగా 10 రోజుల పాటు విచారణ జరిగింది.ప్రభుత్వంతో పాటు పిటిషనర్ల తరఫు వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్లో పెట్టింది సర్వోన్నత న్యాయస్థానం.’’ప్రాథమిక హక్కులను పరిరక్షించేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేయడాన్ని అధికార విభజన సిద్ధాంతం (డాక్ట్రిన్‌ ఆఫ్‌ సెపరేషన్‌ ఆఫ్‌ పవర్స్‌) అడ్డుకోలేదు. న్యాయస్థానం చట్టాలను చేయలేదు. కానీ ఆ చట్టాలను అర్థం చేసుకుని అమలు చేయగలదు. స్వలింగ సంపర్కుల విషయం కేవలం పట్టణాలకు, సమాజంలోని ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితం కాదు,’’ అని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ చెప్పారు.’’స్వలింగ సంపర్కుల వివాహలను కలుపుకునే విధంగా.. ప్రత్యేక వివాహ చట్టాన్ని సవరించాలా? లేదా? అన్నది పార్లమెంట్‌ చేతుల్లో ఉంది. శాసనపరమైన అంశాలలో జోక్యం చేసుకోవడం కోర్టుకు తగదు,’’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *