వ్యాయామానికి వార్మప్‌ తప్పనిసరి

వ్యాయామానికి ముందు వార్మప్‌ ఎక్సర్‌సైజులు తప్పనిసరిగా చేయాలి. వ్యాయామానికి శరీరాన్ని సిద్ధం చేయడానికి వార్మప్‌ ఎంతో అవసరం. ఎందుకంటే?

వార్మప్‌ అంటే?:వ్యాయామానికి శరీరాన్ని సన్నద్ధం చేసే వ్యాయామమిది. తేలికపాటి కార్డియోవ్యాస్క్యులర్‌ వ్యాయామాలతోపాటు స్ర్టెచింగ్‌ వ్యాయామాలు వార్మ్‌పలో ఉండాలి.

వార్మప్‌ ఎంతసేపు?: ఈ వ్యాయామం కనీసం 20 నిమిషాల నుంచి అరగంటపాటు ఉండాలి. ఎంత తీవ్రంగా చేస్తే వార్మప్‌ ఫలితం అంత ఎక్కువసేపు నిలిచి ఉంటుంది.

వార్మప్‌ ప్రభావాలు: రక్తనాళాలను వెడల్పు చేసి, కండరాలకు రక్తప్రసారం ద్వారా ఆక్సిజన్‌ అందేందుకు తోడ్పడుతుంది. ఫ్లెక్సిబిలిటీ పెరిగి, సమర్ధంగా పని చేసేందుకు తగినట్టుగా కండరాల ఉష్ణోగ్రతను పెంచుతుంది. వార్మ్‌పతో గుండె వేగం నెమ్మదిగా పెరగడం వల్ల గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *