లక్ష మంది ఐటీ ప్రొఫెషనల్స్‌ తో వైసీపీ

ఏపీలోని అధికార వైఎస్సార్సీపీకి చెందిన ఐటీ విభాగం వినూత్నంగా లక్ష మంది ఐటీ ప్రొఫెషనల్స్‌తో ఒక భారీ ఐటీ సైన్యాన్ని రూపొందిస్తోంది. దీనికి సంబంధించి మిషన్‌ ఐటీ ఆర్మీని ఆ పార్టీ ఐటీ విభాగ రాష్ట్ర అధ్యక్షులు సునీల్‌కుమార్‌ రెడ్డి పోసింరెడ్డి శనివారం ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో ఆ పార్టీ ఐటీ విభాగం ఐటీ ప్రొఫెషనల్స్‌తో ఒక భారీ సదస్సును నిర్వహించింది. ఈ సదసుకు హైదరాబాద్‌ జంటనగరాల్లోని వైసీపీ అభిమానులైన ఐటీ ఉద్యోగులు, రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ ఐటీ ప్రొఫెషనల్స్‌ భారీ ఎత్తన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు సునీల్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి ఒక బలమైన శక్తిమంతమైన ఐటీ సైన్యం ఉండాలని తాము భావించామన్నారు. మిషన్‌ ఐటీ ఆర్మీ పేరిట వైసీపీకి ఒక భారీ ఐటీ ఆర్మీని ఆవిష్కరిస్తున్నామన్నారు. వైసీపీ ఐటీ విభాగానికి 5 లక్షలకు పైగా సభ్యత్వముందన్నారు. వీరిలో కనీసం లక్ష మందితో బలీయమైన ఐటీ సైన్యాన్ని ఏర్పాటు చేసి పార్టీ సేవలకు అంకితం చేయాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్‌ను ప్రారంభించామన్నారు. పార్టీ అభిమానులైన ఐటీ నిపుణులు, ఉద్యోగులంతా కూడా ఈ సైన్యంలో చేరి తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. దీని కోసం ప్రత్యేక పోర్టల్‌ను ఆరంభించామన్నారు.అంతా కూడా గ్రావిూణ ప్రాంతాలకు వెళ్లి అక్కడ గ్రావిూణ యువత, గ్రామాల్లోని ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లతో మమేకమవుతారని, వారి సాధకబాధలు తెలుసుకుని వారికి మంచి ఉద్యోగావకాశాలు లభించేలా ఈ వేదిక కృషి చేస్తుందన్నారు. అలాగే పార్టీ విజయాలను, ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ సాధించిన విజయాలను, సంక్షేమ కార్యక్రమ ఫలాల గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళతామన్నారు. ఈ తరహా సదస్సులను దేశంలోని ముఖ్య పట్టణాల్లో నిర్వహించి ఆ ప్రాంతాల్లోని ఐటీ ప్రొఫెషనల్స్‌తో అనుసంధానమవుతామన్నారు. ఐటీ వింగ్‌ పార్టీకి, పార్టీ అభిమానులైన ఐటీ ప్రొఫెషనల్స్‌కు మధ్య ఒక వారధిగా వ్యవహరిస్తుందన్నారు. చంద్రబాబుది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తాను ఐటీ అభివృద్ధి చేశానని టీడీపీ నేత చంద్రబాబు నిత్యం సెల్ఫ్‌ డబ్బా కొట్టుకుంటుంటారని సునీల్‌ కుమార్‌ రెడ్డి దుయ్యబట్టారు. నిజానికి హైదరాబాద్‌లో ఐటీ ప్రగతికి బీజం పడిరది మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డ హయాంలో అయితే తదనంతరం ఐటీ ఊపందుకుంది మాత్రం వై.ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హాయంలోనేనని, ఇవేవో దాచేస్తే దాగే గణాంకాలు కావని, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పిన లెక్కలేనని చెప్పారు. హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ పేరిట ఆయన హంగామా చేసి తన వాళ్ల చేత భూములు కొనిపించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారని విమర్శించారు. అమరావతిలో కూడా అలాగే రాజధాని పేరిట రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి రాష్ట్రాన్ని ముంచేశారన్నారు. కోవిడ్‌ కష్టాలు చుట్టుముట్టినా కూడా ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ రాష్ట్రాన్ని ప్రగతి పథంవైపు సమర్థవంతంగా నడిపిస్తున్నారని ఆయన అన్నారు. ఈ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ప్రస్తుతం జగన్‌ ప్రభుత్వంలో పారిశ్రామిక, ఐటీ అభివృద్ది ఊపందుకుంటోందన్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఏపీవైపు చూస్తోందని, విశాఖపట్నం ప్రఖ్యాత ఐటీ కేంద్రంగా అభివృద్ధి చెంది, దేశంలోని పెద్ద పెద్ద నగరాలతోనే పోటీపడబోతోందన్నారు. ఇప్పటికే ఇక్కడ అదాని లాంటి సంస్థ అతి పెద్ద డాటా కేంద్రాన్ని ఏర్పాటు చేసి 50వేల ఉద్యోగాలు కల్పించబోతోందన్నారు. ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం రూపొందించిన ఐటీ విధానపత్రం ద్వారా రాబోయే మూడేళ్లలో మరో 50వేల ఉద్యోగాలు ఈ రంగంలో కల్పించబోతున్నామన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *