సామాన్యులు బతికేది ఎలా

భారతదేశంలో సామాన్యలు జీవితాలు దుర్భరంగా మారిపోతోంది. కార్పొరేట్‌లదే రాజ్యం అయిపోతోంది. 80 శాతం ఎగుమతుల లాభం కార్పొరేట్‌ల పాలే అవుతున్నది. అసలుకే ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరగడంతో దేశానికి ఒక్క జూన్‌ నెలలోనే సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఎన్‌పీఏ పెరుగుతూనే ఉంది. మరో వైపు రిజర్వు ఎకానవిూ తగ్గుతున్నది. గడచిన వారంలో 5,666 కోట్లు తగ్గింది. జనవరి నుంచి ప్రతీ రోజూ సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నది. ఇలా ఇప్పటికే 40,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఐఎంఎఫ్‌ ఋణం నిధి 44 బిలియన్స్‌ తగ్గింది.దేశం ఇప్పటికే రూ. 135 లక్షల కోట్ల అప్పులలో కూరుకుని పోయింది. వచ్చే ఏడాది వరకు 150 లక్షల కోట్లు దాటే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణుల అంచనా. కేంద్రం ఆర్థిక నీతిలో స్పష్టత అసలు లేదు. బహిరంగ మార్కెట్‌లో రిటైల్‌ ధరలు మూడున్నర శాతం నుంచి ఐదుకు, ఆ తర్వాత ఇప్పుడు ఆరు శాతానికి పెరిగాయి. పోస్ట్‌ఆఫీస్‌ ఎఫ్‌డీ వడ్డీ రేటు ఈ మూడేండ్లలో 7.6 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గింది. వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గింది. ఉద్యోగుల ఈపీఎఫ్‌ వడ్డీ 8.2 శాతం నుంచి మొదట 7.8 శాతానికి, ఇప్పుడు 7.1 శాతానికి తగ్గించారు. కార్పొరేట్‌ కంపెనీలలో అసలు జాబ్స్‌ లేవు. పీఎస్‌యూలలో తాజాగా 4.5 లక్షల ఉద్యోగాలు పోయాయి. 12 లక్షల వరకు కాంట్రాక్టు ఉద్యోగాలు పోయాయి. 2017లో 1,32,000 ఉద్యోగాలు తగ్గగా, 2021లో 87,000 తగ్గాయి. దేశంలో ఎనిమిది శాతం మంది నిరుద్యోగులు ఉండగా, హర్యానాలో 34 శాతం, రాజస్థాన్‌లో 30 శాతం నిరుద్యోగం ఉంది.కేంద్రం ఇప్పటిదాకా యూపీపీఎస్‌సీ నుంచి ఇచ్చిన ఉద్యోగాలు 2014లో 7,800 కాగా, 2021లో 3,986 మాత్రమే. ఇక పర్మినెంట్‌ ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరుగుతున్నది. ఓఎన్‌జీసీలో 2021 దాకా 28,489 మంది పని చేసేవారు. ఇప్పుడు 10,833 మంది పర్మనెంట్‌,17,656 మంది కాంట్రాక్ట్‌ కార్మికులు పని చేస్తున్నారుబొగ్గు దిగుమతి లాభాలు అన్నీ అదానీ జేబులకే వెళుతున్నాయి. డైమండ్‌కు 1.5 శాతం జీఎస్‌టీ ఉంటే, పిండికి, పాలకు తినే పదార్థాలకు ఐదు శాతం జీఎస్‌టీ వేస్తున్నారు. హాస్పిటల్‌లో బెడ్‌కు 18 శాతం జీఎస్‌టీ అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిడిల్‌ క్లాస్‌కు ఎక్కడ కూడా వెసులుబాటు లేదు. రూ. 1,25,000 కోట్ల టాక్స్‌ భారం వీరి విూదే పడుతున్నది. అదానీ, అంబానీలాంటి కార్పొరేట్‌ల ఆదాయాలు, ఆస్తులు భారీగా పెరుగుతూనే పోతున్నాయి. ప్రపంచంలోని పది మంది ధనికులలో వీరూ చేరిపోయారు. అదానీ 105 బిలియన్‌, అంబానీ 87 బిలియన్‌ అధిపతులుగా ఉన్నారు.ప్రతీ చోట కూరగాయలు మొదలు పండ్లు, గ్రాసరీ దాకా అంబానీ, అదానీయే ఉన్నారు. రిటైల్‌ సెక్టార్స్‌ అన్నింటిలోనూ వీరే ఉన్నారు. ట్రాన్స్‌పోర్టేషన్‌, రైల్వే, ఎయిర్‌పోర్ట్‌, పవర్‌, కోల్‌, ఖనిజ సంపద, గ్రీన్‌ఎనర్జీ, సౌర ఎనర్జీ, ఎన్‌ఓసీ కాంట్రాక్టు కూడా కార్పొరేట్‌లదే. వచ్చే ఆదాయం కూడా వారిదే. జీఎస్‌టీ ప్రభుత్వానిది. దీని భారం మాత్రం పబ్లిక్‌ విూద పడుతున్నది. కరోనా కాలంలో కార్పొరేట్‌ల ఆదాయం 30 శాతం పెరిగింది. దేశం ఎకానవిూ ఏడు శాతం తగ్గింది. క్యాపిటలిజం క్యాపిటల్‌ విూదే అయిపోయింది. సామాన్యుడు 65 శాతం ఆర్థికంగా చితికిపోయాడు. ఐదు ట్రిలియన్‌ మాటేమోగానీ, 2.3 ట్రిలియన్‌ డాలర్‌ల దేశంగా భారత్‌ ప్రస్తుతం ఉంది.జపాన్‌ 4.97, జర్మనీ 4 ట్రిలియన్‌ దేశాలుగా ఉన్నాయి. ఇండియా ఎనిమిది శాతం జీడీపీ ప్రపంచానికి చూపుతున్నది. కొవిడ్‌ చావులు, నిరుద్యోగం, ఇతర లెక్కలు కూడా కరెక్ట్‌ గా చూపడం లేదని ఆరోపణలు ఉన్నాయి. గ్లోబల్‌ హంగర్‌ (ఆకలి సూచిక) ఇండెక్స్‌ 76 కోట్ల మంది ఆకలిని ఎదుర్కుంటున్నారని చూపితే, అందులో 22.50 కోట్ల మంది భారత్‌లోనే ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచంలో రోజుకు 235 రూపాయలు ఖర్చు చేస్తే మంచి పోషక, పౌష్టికాహారం పొందవచ్చని ఒక రిపోర్ట్‌ చెబుతోంది. మన దేశంలో 71 శాతం మందికి అంతగా ఆదాయం లభించడం లేదు. దీంతో దేశంలో దాదాపు 80 నుంచి 85 శాతం మందికి పౌష్టికాహారం లభించని పరిస్థితి ఉంది. గోధుమల కొరత కారణంగా ఆరు రాష్ట్రాలలో గోధుమలకు బదులు బియ్యం రేషన్‌గా ఇస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *