కాపు నేతలతో కేసీఆర్‌ మంతనాలు

ఏలూరు, ఆగస్టు 24
ఆంధ్రాలో భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌)ను బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధినేత. కేసీఆర్‌ ప్రధాన దృష్టి పెట్టారు. ప్రధానంగా అధికారానికి దూరంగా ఉన్న కాపు వర్గాన్ని చేరదీయాలని నిర్ణయిం చుకున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆ సామాజికి వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్‌ ను ఆంధ్ర ప్రదేశ్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నేతలను కూడా ఆకర్షించే పని ఒకవైపు సాగుతూనే ఉండగా మరోవైపు ముఖ్యంగా కాపులను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ లో కాపుల భవనానికి అత్యంత ఖరీదైన స్థలం కేటాయించింది. దీంతో కాపుల్లో. కేసిఆర్‌ పట్ల సానుకూలత ఏర్పడిరది. ఈ నేపథ్యంలో వరుసగా కాపు నేతలు, ప్రముఖులతో కేసీఆర్‌ సమావేశ మవుతున్నారు. విశ్రాంత ఇన్‌ కంట్యాక్స్‌ ఆఫీసర్‌ మంగిశెట్టి రంగబాబు తమిళనాడు ప్రభుత్వంలో చీఫ్‌ సెక్రటరీగా పనిచేసి రిటైరైన రామ్మోహనరావులు ఇటీవలే కేసీఆర్‌ ను కలిసారు. వీరే కాక ఆంధ్ర ప్రాంతానికి చెందిన వివిధ రిటైర్డ్‌ కాపు అధికారులు, కాపు వ్యాపారస్తులు, కాపు బిల్డర్లు, కాపు సంఘ నేతలు వరుస పెట్టి కేసిఆర్‌ ను కలుస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 200 మంది నేతలను కలిసి ఉంటారనేది ఒకఅంచనా. వీరిందరితోనూ ఏపీలో భారసను బలోపేతం చేయడంపై కేసిఆర్‌ చర్చిస్తున్నారు. వీరందరూ బీఆర్‌ ఎస్‌ కు మద్దతుగా నిలవాలని నిర్ణయిం చుకున్నట్లు సమాచారం. కాపులకు రాజ్యాధికారం లక్ష్యంగా ఏపీలో రాజకీ యాలు నడపాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. బీఆర్‌ఎస్‌ అధికారం లోకి వస్తే కాపు నేతనే ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించనున్నారు. ఈ విధంగా కాపుల్లోకి చొచ్చుకుపోవాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఇందుకు మొదటి మెట్టుగా కావులతో విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్‌ ప్లాన్‌ చేస్తున్నారు. కాపు నేతల నేతృత్వంలో చలో విజయవాడకు పిలుపునివ్వనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *