మానుసూన్‌ ప్లాన్‌ లో గ్రేటర్‌ టీమ్‌

అనుమతిలేకుండా సెల్లార్లు తవ్వి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడం పెద్ద సమస్యగా మారింది. భారీ వర్షాలు పడినప్పుడు ఈ సెల్లర్‌ గుంతల్లో నీరు నిలిచిపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో సెల్లార్‌ గుంతల్లో పడి పలువురు మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం అకాల వర్షాలు హైదరాబాద్‌ నగరాన్ని వణికిస్తున్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సెలార్లల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వచ్చే వర్షాకాలంలో సిటీలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టింది. మాన్‌ సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌ రూపొందిస్తుంది. వర్షం పడినప్పుడు రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా, లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ప్రత్యేక బృందాలు చర్యలు తీసుకుంటున్నారు.మాన్‌ సూన్‌ సన్నద్ధతలో భాగంగా భవనాల్లో సెల్లార్లపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది. అనుమతిలేని సెల్లార్‌ తవ్వకాలపై కొరడా రaులిపించాలని జోనల్‌ అధికారులకు బల్దియా కమిషనర్‌ ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న భవనాల్లో సెల్లార్ల తవ్వకాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. తగిన భద్రతా ప్రమాణాలు లేకపోయినా, నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లు తవ్వినా తక్షణమే నోటీసులు జారీ చేయాలని సూచించారు.నోటీసులకు స్పందిచకుంటే వెంటనే నిర్మాణాన్ని ఆపేసి అమనుమతులు రద్దు చేయాలని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు ఆదేశించారు. భవన నిర్మాణాల వద్ద సేప్టీ, ఆనుకొని ఉన్న బిల్డింగ్‌లపై ప్రభావం అంచనా వేయాలన్నారు. మాన్‌ సూన్‌ ప్రారంభం నుంచి ముగిసే వరకు ఎలాంటి కొత్త సెల్లార్లు తవ్వకానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *