కమలం లెక్క ఎంటో…

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నాడి ఎవరికి అందడం లేదు’’ఏపీలో జనసేన పార్టీ తెలుగుదేశంతో జట్టు కట్టకుండా బీజేపీ అడ్డుపడుతోందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆరోపించారు. టీడీపీతో జనసేన జట్టు కట్టకుండా బీజేపీ అడ్డుపడుతోందని, ఏపీలో వైసీపీకి అనుకూలంగా బీజేపీ వ్యవహరిస్తోందని పితాని ఆరోపించారు. ఏపీలో జనసేన, తెలుగుదేశం పార్టీతోనే ఉందని, త్వరలోనే క్వారిటీ వస్తుందని చెప్పారు.ఏపీలో జనసేన టీడీపీతోనే ఉందని, బీజేపీ నాయకులు వైసీపీకి తాబేదారుల్లా వ్యవహరిస్తున్నారని పితాని అన్‌?నరు. రాజకీయాల్లో బీజేపీ తప్పుడు పద్దతులు అవలంబిస్తోందని ఆరోపించారు. బీజేపీ నాయకులు సిఎం జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీనీ నాయకుడి నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినవి కాదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఎన్నికల ముంచుకొస్తున్న వేళ, రాజకీయ పొత్తుల విషయంలో జరుగుతున్న తాత్సరం టీడీపీ కలవర పెడుతోంది.బీజేపీ ఆవిర్భవించిన నలభై ఏళ్లలో దేశంలో రెండు పార్లమెంటు స్థానాల నుంచి ఒంటరిగా దేశంలో అధికారాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఆ పార్టీ ఎదిగింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సొంతంగా ఒక్క అసెంబ్లీ నియోజక వర్గాన్ని కూడా గెలుచుకోలేని పరిస్థితిలో ఉంది. పొరుగున ఉన్న తెలంగాణలో పార్టీ పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తుంటే ఆంధ్రాలో మాత్రం కనుచూపు మేరలో ఎక్కడ బీజేపీ పతాకం రెపరెపలాడే పరిస్థితి కనిపించడం లేదు.ఏపీ బీజేపీలో ఉన్నన్ని గ్రూపులు మరో పార్టీలో కనిపించవు. వీటిలో ప్రధానంగా వైసీపీ అనుకూల బీజేపీ, టీడీపీ అనుకూల బీజేపీ వర్గంతో పాటు, ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం ఉన్న ఒరిజినల్‌ బీజేపీ నాయకులు ఉన్నారు.2024లో కేంద్రంలో హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేయాలని భావిస్తున్న బీజేపీ ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిలోనే ఉంది. బీజేపీకి దగ్గర కావాలని టీడీపీ చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆ పార్టీ పట్టించుకోవట్లేదు.బీజేపీ ఏపీలో ఎదగడం కంటే, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బలహీన పడాలనే భావనతోనే ఇన్నాళ్లు బీజేపీ ఉంది. అదే సమయంలో బీజేపీ సొంతంగా బలపడే ప్రయత్నాలు కూడా పెద్దగా సత్ఫలితాన్ని ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీలో అధికారంలోకి రాగానే టీడీపీ ఎంపీలు వ్యూహాత్మకంగా బీజేపీలో చేరిపోయారు. ఏపీలో తమ పార్టీ బలపడుతుంది, టీడీపీ ఖాళీ అయిపోతుందనే ఉద్దేశంతో బీజేపీ కూడా చేరికల్ని స్వాగతించారు.అయితే టీడీపీ ఎంపీల పార్టీ ఫిరాయింపులు, వ్యక్తిగత కారణాలతో జరిగాయో, టీడీపీ అధినేత చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయో కాని బీజేపీకి మాత్రం ఆశించిన ఫలితం దక్కలేదు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం స్థానానికి ఎదగాలని భావించిన బీజేపీ కోరిక నెరవేరలేదు.ఏపీలో అధికార మార్పిడి జరిగి నాలుగేళ్ల గడిచిపోయాయి. ఇప్పుడు ఎన్నికలు సవిూపిస్తున్న సమయంలో టీడీపీతో స్నేహాన్ని స్వాగతించి, తర్వాత కాలంలో భంగపడటం కంటే ప్రస్తుతానికి వైసీపీ చెడకుండా చూసుకోవడమే మేలని బీజేపీ భావిస్తోంది. ఏపీలో టీడీపీతో పొత్తు లేకపోయినా బీజేపీకి వచ్చే నష్టం ఏమి ఉండదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ వచ్చినా చివరకు బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిన అనివార్యత అయా పార్టీలకు ఉన్నందున ప్రస్తుతానికి గుంభనంగా ఉండటమే మేలని బీజేపీ భావిస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *