గులాబీలో మునుగోడు ఫీవర్‌

టీఆర్‌ఎస్‌ కు బై ఎలక్షన్స్‌ ఫీవర్‌ పట్టుకుంది. ఒకవేళ ఎన్నిక వస్తే విజయం సాధించాలనే లక్ష్యంతో అస్త్ర శస్త్రాలను సన్నద్ధం చేస్తుంది. ఈ విజయంతో నల్లగొండలో కాంగ్రెస్‌ పార్టీ లేదని ప్రజల్లో అపోహ కలిగించాలని ప్రయత్నాన్ని మొదలు పెట్టింది. బీజేపీ సైతం ఎలాగైనా మునుగోడులో ఉపఎన్నిక వస్తే టీఆర్‌ఎస్‌ ను ఓడిరచి తామే రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ప్రజలకు వివరించాలని భావిస్తోంది. అందులో భాగంగానే పావులు కదుపుతుండటం, ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌, బీజేపీలు ముఖాముఖీగా జరిగిన పోటీల్లో బీజేపీ పై చెయ్యి సాధించింది. దీంతో టీఆర్‌ఎస్‌ నేతల్లో ఆందోళన స్టార్ట్‌ కావడంతో జిల్లా మంత్రికే మునుగోడు బాధ్యతను అప్పగించారు. దీంతో ఆయన మునుగోడుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే బీజేపీ ఒక వైపు, మాజీ మంత్రి ఈటల మరో వైపు టీఆర్‌ఎస్‌ నేతలకు గాలం వేస్తున్నారు. ఈ నెల 27న టీఆర్‌ఎస్‌ కు చెందిన ఎమ్మెల్యేలు చేరుతారని ఈటల కీలక ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.మునుగోడులో బై ఎలక్షన్స్‌ వస్తాయనే ప్రచారంతో టీఆర్‌ఎస్‌ అలర్ట్‌ అయింది. ఆ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగానే కాంగ్రెస్‌ తో పాటు ఇతర పార్టీల చెందిన నేతలపై ఫోకస్‌ పెట్టింది. చేరికలకు తెరదీసింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి చేతిలో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ఓడిపోయారు. ప్రస్తుతం మునుగోడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి బీజేపీ నేత అమిషాతో భేటీ కావడంతో పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్‌ పార్టీతో పాటు ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేస్తే వచ్చే ఉప ఎన్నికల్లో గెలిపించుకుంటామని బీజేపీ భరోసా ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఉపఎన్నిక అనివార్యమని భావించి తిరిగి ఆస్థానంలో పాగా వేసేందుకు టీఆర్‌ఎస్‌ కసరత్తు ప్రారంభించింది. ఆ బాధ్యతను మంత్రి జగదీష్‌ రెడ్డికి అధిష్టానం అప్పగించింది. దీంతో కాంగ్రెస్‌ తో పాటు ఇతర పార్టీ కార్యకర్తలను టీఆర్‌ఎస్‌ లో చేర్చుకుంటున్నారు. మరో పక్క గట్టుప్పల్‌ మండలాన్ని ఏర్పాటు చేయడంతో ప్రజల్లో ప్రభుత్వంపై అభిమానం పెరిగిందని నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే సంబురాలు, ధూంధాంలు నిర్వహిస్తున్నారు. గెలుపు కోసం ఇప్పటినుంచే అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. పెండిరగ్‌ సమస్యల పరిష్కారంపై సైతం దృష్టిసారించారు.కాంగ్రెస్‌ పార్టీకి ఉమ్మడి నల్లగొండ జిల్లా కంచుకోట. ఏ ఎన్నికలు వచ్చినా అత్యధికంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారే విజయం సాధిస్తుంటారు. కొన్ని స్థానాలను కొద్ది ఓట్ల తేడాతో కోల్పోతారు. టీఆర్‌ఎస్‌ కు ధీటుగా కాంగ్రెస్‌ పార్టీ ఉంటుంది. అయితే మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నిక జరిగితే టీఆర్‌ఎస్‌ ను గెలిపించాలని ఆ పార్టీ నేతలు తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్‌ ను ఓడిస్తే ఇక జిల్లాల్లో ఆపార్టీ మనుగడ ఉండదని, గెలిపించినా నేతలు ఇతర పార్టీల్లోకి మారుతారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అస్త్రంగా ఉపయోగపడుతుందని అధిష్టానం భావిస్తోంది. అందుకోసం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ప్రజలు కాంగ్రెస్‌ వైపు లేరని, టీఆర్‌ఎస్‌ పక్షమేనని రుజువు చేసేందుకు ప్రణాళికలతో నేతలు ముందుకు సాగుతున్నారుబీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య జరిగిన ముఖాముఖీ పోటీల్లో బీజేపీ పార్టీయే పై చెయ్యి సాధించింది. ఒక నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక తప్ప.. దుబ్బాక ఉప ఎన్నిక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీయే విజయం సాధించింది. అంతేకాదు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో సైతం ఊహించని విధంగా 48 స్థానాల్లో విజయం సాధించి టీఆర్‌ఎస్‌ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని స్పష్టం చేసింది. అయితే బీజేపీలో చేరే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలని షరతు విధించినట్లు సమాచారం. దీంతో రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరితో మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. రాజీనామా చేస్తే గెలిపించుకుంటామని ప్రకటించారు. అయితే రాజగోపాల్‌ రెడ్డి మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అయితే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులపై ఇప్పటికే ఒకవైపు బీజేపీ అధిష్టానం, మరోవైపు ఈటల గాలం వేస్తున్నారు. పార్టీలో చేరికలను ప్రోత్సహించడంతో పాటు టీఆర్‌ఎస్‌ ను ఓడిరచడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారుకేసీఆర్‌ పాలనపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులతో పాటు కార్యకర్తలు, ప్రజలంతా అసంతృప్తిగా ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్యనే శత్రుత్వం ఉందని స్పష్టం చేశారు. పదవులకు రాజీనామా చేసి తిరిగి అధికార పార్టీ విూద పోటీలో ఉంటే గెలుపు బాధ్యత తమదేనని, ఈ నెల 27 తర్వాత పార్టీలోకి చేరికలు ఉంటాయని ప్రకటించారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నుండి బీజేపీ పార్టీలోకి త్వరలో చేరికలు ఉంటాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చర్చనీయాంశం అయ్యాయి. టచ్‌ లో ఎవరున్నారు? ఎవరు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. గతంలో ఈటలతో దగ్గర సంబంధాలు ఉన్నవారెవరు? అనే వివరాలను సేకరిస్తున్నారు. ఈటల టీఆర్‌ఎస్‌ ను ఇరకాటంలో పెట్టేందుకు వ్యాఖ్యలు చేశారా? లేకుంటే నిజంగానే గులాబీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారారa? అనేది రాజకీయ వర్గాల్లో సైతం చర్చనీయాంశమైంది. బీజేపీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతుండటం, యువత ఆకర్షితులు అవుతుండటంతో టీఆర్‌ఎస్‌ లో టికెట్‌ రాదని భావించే వారు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఎంతమంది కమలం పార్టీలో చేరుతారనేది హాట్‌ టాపిక్‌గా గా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *