ఫ్రీ కరెంట్‌… ట్రాన్స్‌ పోర్ట్‌…

త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో హావిూల వర్షం కురిపించింది కాంగ్రెస్‌?. తాము ప్రభుత్వంలోకి వస్తే.. ఉచిత విద్యుత్‌?, మహిళలకు నగదు` ఉచిత రవాణా, నిరుద్యోగ భృతి వంటివి ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు మేనిఫెస్టోను విడుదల చేసింది.
కాంగ్రెస్‌? మేనిఫెస్టోలోని ముఖ్య అంశాలు..
ప్రభుత్వం తరఫు నుంచి ఉచితంగా 200 యునిట్‌?ల విద్యుత్‌?
కుటంబ పెద్దగా ఉండే ప్రతి మహిళకు నెలకు రూ. 2వేల నగదు పంపిణీ.
నిరుద్యోగ గ్రాడ్జ్యువేట్స్‌?కు నెలకు రూ. 3వేలు(రెండేళ్ల వరకు). డిప్లామా హోల్డర్స్‌?కు నెలకు రూ. 1,500 (రెండేళ్ల వరకు).
కేఎస్‌?ఆర్‌?టీసీ/ బీఎంటీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం.
ఎన్‌?ఈపీ (జాతీయ విద్యా విధానం)ని తిరస్కరించేందుకు రాష్ట్ర విద్యా విధానాన్ని ఏర్పాటు చేయడం.
2006లో సర్వీసులో చేరి, పింఛనుకు అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్‌? పొడిగింపుపై ఆలోచించడం
ప్రభుత్వ విభాగాల్లో ఇప్పటివరకు ఆమోదించని వేకెన్సీలను ఏడాదిలోపు భర్తీ చేయడం.
సముద్రంలో చేపల వేట కోసం ప్రతియేటా 500 లీటర్ల ట్యాక్స్‌? ఫ్రీ డీజిల్‌? అందజేత.
లీన్‌? పీరియడ్‌? అలోవెన్స్‌? కింద మత్స్యకారులకు రూ. 6000 అందజేత.
కేజీకి రూ.3 చొప్పున ఆవు పేడ కొనుగోలు. మేన్యూర్‌? సెంటర్ల ఏర్పాటు.
నైట్‌? డ్యూటీలో ఉండే పోలీసు అధికారులకు నెలకు రూ. 5వేల స్పెషల్‌? అలోవెన్స్‌?. ప్రతి యేటా ఒక నెల జీతం ఎక్కువగా ఇవ్వడం.
ఆర్డర్లు ఇచ్చిన 90రోజుల్లోపు పని మొదలుపెట్టడం, నిర్దేశిత సమయంలో పూర్తి చేయడం. కాంట్రాక్ట్‌? బిల్లులు సకాలంలో పూర్తి చేయడం.
బజ్‌?రంగ్‌? దళ్‌?, పీఎఫ్‌?ఐ వంటి సంస్థలను నిషేధించే విధంగా నిర్ణయం తీసుకోవడం.
ఎస్‌?సీ రిజర్వేషన్‌?ను 15శాతం నుంచి 17శాతానికి పెంచడం. ఎస్‌?టీ రిజర్వేషన్‌?ను 3శాతం నుంచి 7శాతానికి పెంచడం. మైనారిటీ రిజర్వేషన్‌?ను 4శాతానికి పునరుద్ధరించడం. లింగాయత్‌?లు, వొక్కలిగ్గాలు, ఇతర సంఘాల సభ్యులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌?లో చేర్చే విధంగా ప్రచారం చేయడం.224 అసెంబ్లీ సీట్లున్న కర్ణాటకకు ఈ నెల 10న ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే బయటకొచ్చిన కొన్ని సర్వేలు.. ఎన్నికల్లో కాంగ్రెస్‌? విజయం సాధిస్తుందని చెబుతున్నాయి. ఇంకొన్ని సర్వేలు.. హంగ్‌? వస్తుందని అంచనా వేస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *