యదేఛ్చగా మైనింగ్‌ ఉల్లం‘ఘనులు‘

రాష్ట్ర రాజధానికి అత్యంత సవిూపంలో రంగారెడ్డి జిల్లా ఉండటంతోనే ఆ ప్రజలు చేసుకున్న దౌర్బగ్యమని అనిపిస్తుంది. ఎందుకంటే రియల్‌?ఎస్టేట్‌ పెరిటి వ్యాపారులు కొండలను, గుట్టలను తోలిచి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. అంతేకాకుండా గ్రావిూణ ప్రాంతాల్లోని పర్యావరణం, పంటలు, పశుసంపదను నాశనం చేసేందుకు రియల్‌?వ్యాపారులు బ్లాస్టింగ్‌?లు చేస్తున్నారు. ఈ బ్లాస్టింగ్పై స్థానికులు పిర్యాదులు చేసిన ఫలితం లేకుండా పోయింది. ఈ బ్లాస్టింగ్‌? శబ్దాలతో స్థానికంగా నివాసముండే పెద్దలు, పిల్లలు పడుకునే పరిస్థితి గ్రామాల్లో లేకపోవడం గమనార్హం. నిబంధనలకు విరుద్దంగా రెవెన్యూ, మైనింగ్‌?, పోలీసు యంత్రాంగం లంచాలకు లాలూచీపడి వ్యాపారులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహడిషరిష్‌ గుట్టపై ఎలాంటి అనుమతులు లేకుండా జిలెటన్‌స్టిక్స్‌, టిటోనేటర్లు పెట్టి పేలుళ్లకు పాల్పడుతున్నారు. పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఇళ్లు దెబ్బతింటున్నాయని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు వ్యక్తులను ఇటీవల పోలీసులు అరెస్ట్‌ చేశారు.శంకర్‌పల్లిలో ఓ నిర్మాణ సంస్థ జరుపుతున్న ఎలాంటి అనుమతులు లేకుండా జరుపుత్ను బ్లాస్టింగ్స్‌ వల్ల పక్కనే ఉన్న ఇళ్లు దెబ్బతిన్నాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఈ అంశంపై కేసు నమోదు చేశారు. యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో అనుమతులు లేకుండా జిలెటెన్‌స్టిక్స్‌, పేలుడు పదార్థాలు వినియోగించి పెద్దెత్తున బ్లాస్టింగ్‌కు పాల్పడుతన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం తెలిసి వారు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మొండిగౌరెల్లిలోని సర్వే నంబర్‌ 19లో మైనింగ్‌ జోన్‌లో క్రషర్‌ మిషన్ల ఏర్పాటును ఆ గ్రామస్థులు తీవ్రంగా వ్యతికేరిస్తున్నారు. అయినా ప్రభుత్వం మొండిగా మైనింగ్‌కు అనుమతి ఇవ్వడం వివాదస్పదమైంది.జిల్లాలో జిలెటెన్‌ స్టిక్స్‌, డిటోనేటర్ల వినియోగానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. కొండలు, గుట్టలే కాదు సెల్లార్ల తవ్వకాలలోను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకో కుండా గుట్టుగా గుట్టలను తొలి చేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ఇళ్ల మధ్య భారీ సెల్లార్లు తవ్వేస్తున్నారు. సామర్థ్యానికి మించి జిలెటెన్‌ స్టిక్స్‌ వినియోగిస్తున్నారు. ఫలితంగా సవిూపంలోని ఇళ్లే కాదు.. బోరు బావులు కూడా దెబ్బతింటున్నాయి. ఎప్పటికప్పుడు ఈ తవ్వకాలపై నిఘా ఉంచి పేలుడు పదార్థాలను నియంత్రించాల్సిన క్షేత్రస్థాయిలోని ఎస్‌ఓటీ, సివిల్‌ పోలీసులు సహా రెవిన్యూ అధికారులు వీరికి అండగా నిలుస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.నిజానికి ఏదైనా ప్రాంతంలో సెల్లార్‌ తవ్వాలన్నా.. కొండలు, గుట్టులు తొలగించాలన్నా ఇందుకు మైనింగ్‌ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. బ్లాస్టింగ్‌ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు లైసెన్స్‌ ఉండాలి. మైనింగ్‌ చేయాలని భావించిన భూమికి రెవిన్యూ, ఫైర్‌, ఎలక్ట్రిసిటీ, పోలీసు విభాగాల నుంచి నిరభ్యంతర పత్రం పొంది ఉండాలి. ఎలాంటి అభ్యంతరాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే మైనింగ్‌శాఖ, జిల్లా కలెక్టర్‌ అనుమతులు జారీ చేస్తారు. తవ్వకాల సమయంలో జిలెటెన్‌స్టిక్స్‌, డిటోనేటర్లు వినియోగించేందుకు అవకాశం లభిస్తుంది. ఇదంతా ఓ పద్ధతి ప్రకారం పోతే ఇందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుంది. ఒక శాఖ అనుమతి ఇస్తే.. మరో శాఖ కొర్రిలు పెట్టే అవకాశం ఉంది. ఇది రిస్క్‌తో కూడిన పని. అప్పటి వరకు భూ యజమాని ఊరుకోడు. బిల్డర్‌ కూడా అప్పటి వరకు పనులు ఆపలేడు. దీంతో వారు బ్లాస్టింగ్‌ కాంట్రాక్టర్లు అడ్డదారులు తొక్కుతున్నారు.క్షేత్ర స్థాయిలోని పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ముందే ఐదు నుంచి పది లక్షల వరకు ముట్టజెప్పి.. గుట్టుగా తవ్వకాలు చేపడుతున్నారు. ఆయా శాఖల అధికారులకు విషయం తెలిసి కూడా కిమ్మనడం లేదు. అనుమతి లేకుండా చేపడుతున్న బ్లాస్టింగ్‌ వర్కులకు పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. సాధారణంగా లైసెన్స్‌డ్‌ డీలర్‌ వీటిని సరఫరా చేస్తుంటారు. అది కూడా బ్లాస్టింగ్‌ అనుమతులు ఉన్న వారికే ఇస్తుంటారు. కానీ జిల్లాలో ఎలాంటి అనుమతులు లేని వారి చేతుల్లో భారీగా పేలు పదార్థాలు కన్పిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది.?కొండలు, గుట్టలల్లో జరిగే బ్లాస్టింగ్‌కు తమకు ఎలాంటి సంబందం లేదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ప్లాట్లలోగానీ, పట్టా భూములలో బ్లాస్టింగ్‌? చేస్తే పోలీసుల అనుమతి తీసుకోవాలి. మాకున్న సిబ్బందితో జిల్లాలో జరిగే అక్రమాలపై నిరంతరం ఫీల్డ్‌?విజిట్‌? చేస్తున్నాము. జిల్లాలో ఎక్కడైనా అనుమతులు ఉన్నాయి.. అనుమతులు లేకుండా ఎక్కడ బ్లాస్టింగ్‌ గానీ, మట్టి తొవ్వకాలు గానీ జరగడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు మైనింగ్‌?కోసం దరఖాస్తులు చేసుకున్నారు.. అనుమతులు ఇచ్చారనే వివరాలపై ఆ అధికారి క్లారిటీ ఇవ్వడం లేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *