కలకలం రేపుతున్న ఆ కామెంట్స్‌

తెలంగాణపై కమలనాథులు గురిపెడితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏకంగా ఢల్లీి పీఠంపై కన్నేశారు. ఇందుకోసం ఇన్నాళ్లు రాష్ట్ర ప్రజల నోళ్లలో నానిన టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చుతూ రిస్క్‌ చేసేందుకు గులాబీ బాస్‌ సిద్ధం అయ్యారు. పట్టుపడితే అసాధ్యం అంటూ ఏదీ లేదని జాతీయ రాజకీయాల్లోకి బయలుదేరారు. మోడీనే టార్గెట్‌ గా నేషనల్‌ పాలిటిక్స్‌ లో కి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న కేసీఆర్‌ విషయంలో తాజాగా ఓ అంశం హాట్‌ టాపిక్‌ అవుతోంది. కేంద్రంలోని బీజేపీని గద్దే దించేందుకు ఓ వైపు ప్రతిపక్ష కూటమి ఐకత్యత కోసం ప్రయత్నాలు సాగిస్తున్న వేళ సీఎం కేసీఆర్‌ పై ఓ వీడియో సోషల్‌ విూడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. సీనియర్‌ జర్నలిస్ట్‌ రాజ్‌ దీప్‌ సర్దేశాయ్‌ మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఓ వీడియోలో ‘భారత్‌ రాష్ట్ర సమితి మహారాష్ట్రలో విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది, ఓ ప్రైవేట్‌ చర్చల్లో కేసీఆర్‌ తన సహచరులతో మాట్లాడుతూ 2024 ప్రతిపక్ష కూటమికి చైర్‌ పర్సన్‌ గా బాధ్యతలు ఇస్తే ఎలక్షన్‌ ప్రచార ఖర్చు తానే భరిస్తాను’ అని చెప్పినట్లుగా ఉంది. ఈ వీడియో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది.మోడీని ఢీ కొట్టే దమ్ము తమకే ఉందంటూ సీఎం కేసీఆర్‌ చాలా కాలంగా చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలనను దేశం చూసిందని, వీరి పాలనలో భారతదేశం అభివృద్ధి కంటే తిరోగమనంలోనే పయణించిందని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలోనే మోడీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమి విషయంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. గతంలో సీఎం కేసీఆర్‌ స్వయంగా అనేకమంది జాతీయ నేతలతో సమావేశం అయ్యారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో అఖిలేష్‌ యాదవ్‌, నవీన్‌ పట్నాయక్‌, కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి వంటి నేతలు భేటీ కావడం ఆసక్తిని పెంచింది. ఈ సమయంలో మోడీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేస్తామని అఖిలేష్‌ చెప్పగా.. జీ8 పేరుతో ‘ప్రోగ్రెసివ్‌ చీఫ్‌ మినిస్టర్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇండియా’ ప్లాట్‌ ఫామ్‌ ఏర్పాటుకు కేజ్రీవాల్‌ నేతృత్వంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే రాబోయే 2024 ఎన్నికల్లో విపక్షాల కూటమిని ఎవరు లీడ్‌ చేయాలనే దానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.విపక్షాల కూటమికి తామే నేతృత్వం వహిస్తామని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ఇప్పటికే ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై పలు ప్రతిపక్ష పార్టీల నుంచి వ్యతిరేకత వస్తోంది. ప్రాంతీయ పార్టీల అభిప్రాయాలను కాంగ్రెస్‌ పరిగణలోకి తీసుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తనకు విపక్షాల కూటమిని లీడ్‌ చేస్తే దేశం మొత్తం ప్రచారం ఖర్చును తానే భరిస్తానని కేసీఆర్‌ చెప్పాడంటూ జరుగుతున్న ప్రచారం సంచలనంగా మారుతోంది. ఇప్పటికే కేసీఆర్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున బడా కాంట్రాక్టర్లతో చేతులు కలిపి అవినీతికి పాల్పడిరదని ఈ అవినీతి సొమ్మును రాబోయే ఎలక్షన్స్‌ లో ఖర్చు చేసేందుకు ఉపయోగించబోతోందని రాష్ట్రంలోని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *