నల్గోండలో పశుసంవర్ధక శాఖలో బదిలీలలు

నల్లగొండ జిల్లాలో పశుసంవర్ధక శాఖలో జరుగుతున్న తంతు. నల్లగొండ జిల్లాలో పెండిరగ్‌లో ఉన్న గొర్రెల యూనిట్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం గొర్రెలను కొనుగోలు చేసే ప్రాంతం నుంచి రైతు ఇంటికి చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గొర్రెలను రవాణా చేసేందుకు డీసీఎంల కోసం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు పిలిచారు. ఈ టెండర్లలో 9మంది కాంట్రాక్టర్లు పాల్గొనగా అధికార పార్టీకి చెందిన నాయకుడికే టెండర్‌ కేటాయించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో 37,078 యూనిట్లను అనంతపురం, కడప జిల్లాలనుంచి తరలించేందుకు ఒక్కో యూనిట్‌కు రూ.6,500చొప్పున చెల్లించేందుకు నిర్ణయించింది. ఈ లెక్కన గొర్రెల రవాణాకు రూ.24,10,07,000 ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. అధికారులు నిబంధనలకు నీళ్లు వదిలి అక్రమంగా కాంట్రాక్టును కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.. అయితే అందులో కేవలం ఒకే ఒక్కరికి మాత్రమే టెండర్‌ కేటాయిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే మిగతా కాంట్రాక్టర్లను ఎందుకు పక్కకు పెట్టారనేది ప్రత్యేక కమిటీలోని ఏ సభ్యుడు కూడా స్పష్టంగా చెప్పడం లేదు. ఆయా శాఖల అధికారులను అడిగితే మిగతా వారిని ఎందుకు రిజెక్ట్‌ చేశారో తమకు తెలియదని, రికార్డులు చూసి చెప్పాలని పేర్కొనడం గమనార్హం. అంటే కారణాలు లేకుండానే మిగతా 8మంది కాంట్రాక్టర్లను పక్కకు పెట్టినట్లు అధికారుల మాటలను బట్టి స్పష్టమవుతోంది. అంటే నిబంధనల ప్రకారం టెండర్‌ వేసిన కాంట్రాక్టర్‌ను కారణాలు లేకుండానే పక్కకు పెట్టడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గొర్రెల రవాణా కోసం వాహనాలను కేటాయిస్తానని టెండర్‌ వేసి దక్కించుకున్న ఆ ఒకే ఒక కాంట్రాక్టర్‌ మిర్యాలగూడకు చెందిన అధికార పార్టీ నాయకుడు కావడంతోనే ప్రభుత్వ నిబంధనలను పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే అధికార పార్టీ నేతలు ఇచ్చే తాయిలాలకు అలవాటుపడిన అధికారులు నిబంధనలకు నీళ్లు వదిలి అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇటువంటి వాటిపై జిల్లా పాలనాధికారి దృష్టిసారించి విచారణ చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని బాధిత కాంట్రాక్టర్లు వాపోతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *