మొన్న లోకేష్‌.. నేడు చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌ లో ఎప్పుడో ఎన్నికల వేడి మొదలైంది. అధికార పార్టీ వైసీపీ పార్టీ నేతల మద్య ప్రతి పక్ష నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌ లో సాగుతుంది. సీఎం జగన్‌ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ గత ప్రభుత్వం పనితీరు అంటూ టీడీపీ నేతలపై మాటల తూటాలు విడుస్తున్నారు. ప్రభుత్వ పని తీరు ఇది అంటూ పాదయాత్ర చేస్తోన్న టీడీపీ నేత నారా లోకేష్‌ తో పాటు పలువురు నేతలు సవాల్‌ విసురుతున్నారు. ఇప్పటికే లోకేష్‌ అనంతపురం జిలాల్లో ఉన్న కియా సంస్థ ముందు సెల్ఫి దిగి ఛాలెంజ్‌ విసరగా.. తాజాగా టీడీపీ అధ్యక్షులు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వంతు వచ్చింది. సీఎం సీఎం జగన్‌కు చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్‌ విసిరారు. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి సెల్ఫీ సవాల్‌ విసిరారు మాజీ సీఎం చంద్రబాబునాయుడు. నెల్లూరులో టిడ్కో కాలనీ ముందు ఫోటోలు దిగిన చంద్రబాబు సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేసి? సీఎం జగన్‌కు సవాల్‌ విసిరారు. గత ప్రభుత్వంలో పేదల కోసం కట్టిన వేలాది ఇళ్లు ఇవి?రాష్ట్రంలో నాడు నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలని చెప్పారు. మరి నాలుగేళ్లలో విూరు నిర్మించిన పేదల ఇళ్లు ఎన్నో లెక్క చెప్పగలరా.. అసలు విూరు కట్టిన ఇళ్లెన్నో చూపించగలరా జగన్‌ అంటూ చంద్రబాబు ట్యాగ్‌ చేశారు.నెల్లూరులో ఏర్పాటు చేసిన టీడీపీ ప్రాంతీయ సదస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. అంతేకాదు వై నాట్‌ కుప్పం అని వైసీపీ నేతలు హేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఏపీలో పొలిటికల్‌ మూడ్‌ మారిపోయిందన్నారు. ఇకపై టీడీపీ గురి వై నాట్‌ పులివెందులేనని చెప్పారు చంద్రబాబు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *