దారిమళ్లుతున్న పంచాయతీ నిధులు

అభివృద్ధి చెందాలి అంటూ భారీ నినాదాలు చేస్తూనే పంచాయితీలకు ఇవ్వాల్సిన నిధులను తొక్కి పెడితే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? ఏపీలో పంచాయితీలలో వినపడుతున్న ప్రధాన ప్రశ్న ఇదే. పంచాయితీ అధికారులకు చేతిలో చిల్లి గవ్వలేకుండా ముందడుగు వేయమంటే ఎలా వెళ్లగలరో సీఎం చెప్పాలని అంటున్నారు. గ్రామాల్లో కనీసం రోడ్డు బాగుచేసుకోవడానికి కూడా నిధులు లేకపోవడం మరీ విడ్డూరంగా మారింది. కేవలం ప్రచారాలకు ప్రాధాన్యతనిస్తూనే సీఎం, ఎమ్మెల్యేలు కాలం గడిపేస్తు న్నారేగాని పంచాయితీలకు నిధులను అందజేయడం విషయంలో మాత్రం మౌనం వహించడం గమనా ర్హం. గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌ల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామంటూన్నారు గాని ఖాతాలన్నీ ఖాళీ యే అని సర్పంచ్‌లు అంటున్నారు. చివరికి డబ్బులు లేక…. పనులు చేయలేక… ప్రజల్లోకి వెళ్లలేని పరి స్థితుల్లో సర్పంచ్‌లు ఉన్నారు.ప్రభుత్వం నుంచి పంచాయతీలకు వివిధపద్దుల కింద రావాల్సిన నిధులు ఈ ఏడాదిలో ఇంకా విడు దల కాలేదు. రూ.4 చొప్పున ఇవ్వాల్సిన తలసరి గ్రాంటు, భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లపై స్టాంపు డ్యూటీ వాటా తదితర పన్నులు పంచాయతీలకు ఈ ఆర్థిక సంవత్సరంలో జమ కాలేదు. 3, 4 రాష్ట్ర ఆర్థిక సంఘా లు సిఫారసు చేసిన నిధులనూ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదు.కర్నూలు జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో 15.11 లక్షల జనాభా ఉంది. గత ఏడాది చివర్లో మొత్తం పంచాయతీ ఖాతాల్లోని నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ చేసింది. దీంతోపాటు మార్చి 31న పంచాయతీ ఖాతాల్లోని జనరల్‌ ఫండ్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం మాయం చేసింది. ఇలా ఉమ్మడి జిల్లాలోని పంచా యతీల నుంచి రూ.కోట్లు ఖాళీ చేసేసింది. మార్చి 31న ఖాతాల్లో ఉన్న నిధులు ఏప్రిల్‌ ఒకటో తేదీకి కని పించకుండా పోయేసరికి సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. దీంతో ప్రభుత్వం తీసుకు న్న జనరల్‌ ఫండ్‌ను పది రోజుల్లో వెనక్కి ఇచ్చేసింది. పంచాయతీ ఖాతాల్లోని సొమ్ములను రాష్ట్ర ప్రభు త్వం వెనక్కి లాగేస్తుండడంతో అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు నిధులు అందించేలా చర్యలు తీసుకుంది. ఉమ్మడి జిల్లాలోని 973 పంచాయతీలూ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ`గ్రామస్వరాజ్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకుని, ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరిచాయి. ఇక నుంచి ఆ ఖాతాలకే కేంద్రం ఆర్థిక సంఘం నిధులు నేరుగా జమ కానున్నాయి.ఏపీలో అనేక గ్రామపంచాయితీల సర్పంచ్‌లు గ్రామాల్లో పనులు చేయడానికి నిధుల కొరతతో పనులు ఆగిపోయాయి. దీంతో ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిరదని వారే వాపోతున్నారు. సీఎం, ఎమ్మెల్యేలకు ఈ సంగతి తెలిసినా బొత్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల సర్పంచ్‌లు తమ ఇబ్బందులు చెప్పుకోలే ని స్థితిలో ఉండిపోయారు. తమ పాచంయతీ ఖాతాలోని ఆర్ధికసంఘం నిధులను ప్రభుత్వం వెనక్కి తీసు కుంది. పంచాయితీలో అభివృద్ధి పనులు నిలిచిపోయి ప్రజల ముందుకు వెళ్లలేకపోతున్నామని సర్పంచ్లు వాపోతున్నారు. చాలా పంచాయితీల్లో చేసినపనులకు బిల్లులు రాక సర్పంచ్‌లు ఇబ్బంది పడుతు న్నారు. ఏపీలో దాదాపు అన్ని గ్రామపంచాయితీల్లోనూ పరిస్థితులు ఇలానే ఉన్నాయనే అభిప్రాయాలే వ్యక్తమవు తున్నాయి. ఈ కారణంగా ప్రజలు ప్రభుత్వం తీరును ఎండగడుతున్నారు. ఈ భయంతోనే ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు సైతం గ్రామాల్లో తిరగడానికి వెళ్లి అవమానాలపాలవుతున్నారు. ఇటీవలి గడపగడపకు కార్యక్రమంలో జరిగిన సంఘటనలే అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *