భారీగా తగ్గిన ఖరీఫ్‌

ఈ ఏడాది ఖరీఫ్‌ సాగులో అంతగా ఉత్సాహం కనిపించడం లేదు. జులై నాల్గవ వారం వచ్చినా సేద్యం పుంజుకోలేదు. మెట్ట, మాగాణి అనే తేడా లేకుండా దాదాపు అన్ని పంటల సాగు నెమ్మదిం చింది. ఒక్క పత్తి మినహా తతిమ్మా పంటలన్నీ ఇప్ప టికి సాగు కావాల్సిన దాని కంటే తక్కువగా సాగ య్యాయి. అంతేకాదు నిరుడు, ముందటేడు కంటే కూడా తక్కువ విస్తీర్ణంలో వేశారని ప్రభుత్వ గణాం కాలు తెలియజేస్తున్నాయి. వాతావరణం అనుకూలం గా ఉన్నా, వర్షాలు ఒక మేరకు బానే కురిసినా, ప్రధానంగా గోదావరి, కృష్ణా డెల్టా కాల్వలకు ముందుగానే సాగునీరు వదిలినా పంటల సాగులో పురోగతి లేకపోవడం గమనార్హం. ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 36.82 లక్షల హెక్టార్లు కాగా జులై 20 వరకు అన్ని పంటలూ కలుపుకొని 13.04 లక్షల హెక్టార్లలో పంటలు వేయాలి. కానీ 10.16 లక్షల హెక్టార్లలోనే వేశారు. దాదాపు మూడు లక్షల హెక్టార్ల (22 శాతం) తగ్గుదల కనిపిస్తోంది. ఇదే సమయానికి ముందటేడు 15.67 లక్షల హెక్టార్లలో, నిరుడు 10.07 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు.వరి నాట్లు ఇప్పటికి 4.37 లక్షల హెక్టార్లలో పడాల్సి ఉండగా 3.02 లక్షల హెక్టార్లలోనే పడ్డాయి. నాట్లు 1.35 లక్షల హెక్టార్లలో (31 శాతం) తగ్గాయి. ముందటేడు ఇదే సమయానికి 4.09 లక్షల హెక్టార్ల లో, నిరుడు 3.70 లక్షల హెక్టార్లలో వరి నాట్లు పడ్డాయి. ముతక ధాన్యాలైన జొన్నలు, మొక్కజొన్న, సజ్జ, రాగి, తృణధాన్యాల సాగులో 21 శాతం తగ్గు దల ఉంది. కంది, పెసర, మినుము, ఉలవలతో సహా అన్ని పప్పుధాన్యాలూ 27 శాతం తగ్గాయి. మొత్తం ఆహారధాన్యాలు ఇప్పటికి 5.92 లక్షల హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 4.11 లక్షల హెక్టార్లలోనే సాగయ్యాయి. సాగు 31 శాతం తగ్గింది.మొత్తం నూనెగింజల సాగులో 24 శాతం తగ్గుదల ఉంది. రాయలసీమలో కాస్త ముందస్తుగా సాగు చేసే వేరుశనగ సాగులో సైతం గణనీయంగా తగ్గుదల కనిపిస్తోంది. సాధారణ సాగులో 31 శాతం లోటు నెలకొంది. ఇదిలా ఉండగా వాణిజ్య పత్తి సాగు దూకుడు విూదుంది. ఇప్పటికి సాగు కావాల్సిన దాని కంటే ఐదు శాతం ఎక్కువ సాగైంది. సీజన్‌ మొదట్లో వర్షాలు మొరాయించినా రెండు వారాల నుండి రుతు పవనాలు, అల్పపీడనాల వలన వానలు బానే కురి శాయి. గోదావరి వరదలు, భారీ వర్షాలకు అక్కడక్కడ వరి నాట్లు మునిగి దెబ్బ తిన్నాయి. వేసిన వివిధ పంటల విత్తనాలు కొట్టుకుపోయాయి. కాగా మెట్ట ప్రాంతాల్లో ఈ వర్షాలు సాగుకు ఉపకరించాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *