సరూర్‌ నగర్‌ లో రెండు కీలక సభలు

తెలంగాణలో నిరుద్యోగులకు భరోసాగా, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న అణచివేత ధోరణికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ, బీఎస్పీ పోటాపోటా పోటీగా సభలు నిర్వహించనున్నాయి.హైదరాబాద్‌ వేదికగా సరూర్‌ నగర్‌ స్టేడియంలో వరుస రోజుల్లో జరగబోతున్న సభలతో సరూర్‌ నగర్‌ పొలిటికల్‌ సెంటర్‌ గా మారనుంది.ఈనెల 8వ తేదీన సరూర్‌ నగర్‌ స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో యువ సంఘర్షణ సభ జరగనుంది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ప్రియాంక గాంధీ హాజరుకానున్న ఈ సభను లక్షలాది మంది యువతను సవిూకరించి విజయవంతం చేసేందుకు టిపిసిసి విశ్వప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రధాన లక్ష్యాలైన నీళ్లు, నిధులు, నియామకాలలో ముఖ్యంగా నియామకాల విషయంలో యువతకు తీరని అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది. ఈ సభ సాక్షిగా తెలంగాణ యువతకు వరాల జల్లులు కురిపించడమేకాదు, తాము అధికారంలోకి వస్తే యువతకు ఏం చేయబోతున్నామో ప్రియాంక గాంధీ చెప్తారంటూ సభపై ఉత్కంఠ పెంచారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. దీంతో ప్రియాంక పాల్గొననున్న యువ సంఘర్షణ సభకు తెలంగాణలో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో తెలంగాణలో రాహుల్‌ గాంధీ రైతు డిక్లరేషన్‌ ప్రభావం చూపిందని, అంతే స్థాయిలో ఈనెల 8వ తేదీన సరూర్‌ నగర్‌ యువ సంఘర్షణ సభలో ప్రియాంక యువత కోసం ప్రకటించబోయే కాంగ్రెస్‌ డిక్లరేషన్‌ అధికార పార్టీ వెన్నులో వణుకు పుట్టించడం ఖాయం అంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. విద్యార్దులకు, నిరుద్యోగులకు, అమర వీరుల కుటుంబాలకు తాము ఏం చేయబోతున్నామో సరూర్‌ నగర్‌ వేదికగా ప్రకటించబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉద్యోగ నియామకాల్లో అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్న ుూఖూఅ ని ఙఖూఅ తరహాలో ఎలా బలోపేతం చేయబోతున్నామో చెప్తామంటున్నారు.రాబోయే ఎన్నికల మేనిఫెస్టో సైతం ఈ వేదికపై నుండే ప్రియాంక వినిపించబోతున్నారని, తెలంగాణ దశా దిశను మార్చే కీలక హావిూలు సరూర్‌ నగర్‌ ప్రియాంక గాంధీ సభలో ఇవ్వబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు టికాంగ్రెస్‌ నేతలు. ఇప్పటికే సరూర్‌ నగర్‌ స్టేడియంలో ప్రియాంక సభ ఏర్పాట్లు పరిశీలించిన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, స్వచ్చందంగా యువత లక్షలాదిగా ప్రియాంక సభకు తరలిరావాలంటూ కోరారు. సీఎం కేసీఆర్‌ విముక్త తెలంగాణ అనే నినాదంతో, యువతకు కాంగ్రెస్‌ పార్టీ చేయబోయే సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ సరూర్‌ నగర్‌ యువ సంకల్ప సభ సాగనుంది. ముఖ్యంగా తెలంగాణలో నిరుద్యోగ యువత ప్రధాన ఎజెండాగా ప్రియాంక సభను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు.ఇదే వేదికగా ఒక్కరోజు ముందు బీఎస్పీ తెలంగాణ భరోసా సభ నిర్వహించనుంది. సరూర్‌ నగర్‌ స్టేడియంలో ఈనెల 7వ తేదీన బిఎస్పీ నిర్వహించబోతున్న ఈ సభకు ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ జాతీయ అధక్ష్యురాలు మాయావతి హాజరుకాబోతున్నారు. తెలంగాణలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న అణచివేత ధోరణికి, ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా సరూర్‌ నగర్‌ లో తెలంగాణ భరోసా సభ నిర్వహించబోతున్నట్లు బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులైన ఆర్టిజన్స్‌ కు అండగా ఉంటామని, వారి న్యాయమైన డిమాండ్‌ లకు అండగా ఏ విధంగా ముందుకు వెళ్లబోతున్నామో, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాల పేరుతో ప్రభుత్వం చేసిన ధగాను ప్రజల ముందుకు తీసుకెళ్తూనే వారికి భరోసా కల్పించబోయే హావిూలతో మాయావతి ప్రసంగం ఉంటుందని బీఎస్పీ నేతలంటున్నారు. విలేజ్‌ అసిస్టెంట్స్‌, ఉపాధిహావిూ ఉద్యోగులు ఇలా తెలంగాణ వ్యాప్తంగా రైతులు, ఉద్యోగులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలే అజెండాగా లక్షలాది మందితో తెలంగాణా భరోసా సభ విజయవంతం చేసేందుకు రాష్ట్ర బీఎస్పీ సిద్దమైంది.ఇలా దాదాపు ఒకే లక్ష్యంగా ఈ 7న బీఎస్పీ సభ, ఆ మరుసటి రోజే అదే వేదికగా కాంగ్రెస్‌ యువ సంఘర్షణ సభ నిర్వహిస్తున్నాయి. అధికార పార్టీ లోపాలు ఎత్తిచూపడానికి రెండు పార్టీలు వరుస రోజుల్లో నిర్వహించనున్న ఈ సభలు బీఆర్‌ఎస్‌ పై ఎంత ప్రభావం చూపుతాయో తెలియాలంటే మరో మూడు రోజులు వేచి చూడాల్సిందే.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *