పల్లెల్లో ఉప పోరుకు సిద్ధం?

ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం
మంచిర్యాల
మంచిర్యాల జిల్లాలో మరోమారు ఎన్నికల నగారా మోగనుంది. పంచాయతీ, పరిషత్‌లకు ఉప ఎన్నికల నిర్వహణ కు మార్గం సుగమమైంది. జూలైలో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. జిల్లాలో వివిధ కారణాల వల్ల ఖాళీగా ఉన్న సర్పంచ్‌, వార్డు సభ్యులు, ఎంపీటీసీ స్థానా లకు ఎన్నికలను నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అధికారులు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మూడేళ్లుగా ఆయా స్థానాలు ఖాళీగా ఉండడంతో ప్రజలు సమస్యలను ఎదుర్కొవడంతోపాటు, అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగు తోంది. ప్రస్తుతం పల్లెల్లో ఉప పోరుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
వివిధ కారణాలతో ఖాళీ
సర్పంచ్‌, వార్డు సభ్యులు, ఎంపీటీసీ పదవుల్లో ఉన్న వారు చనిపోవ డం, సస్పెన్షన్‌, రాజీనామాలు చేయడం వంటి కారణాలతో అక్కడక్కడా స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటికి మళ్లీ ఎలక్షన్‌ కమిషన్‌ ఎన్నికలను నిర్వహించాలని రెండేళ్ల కిందట ప్రాథమికంగా నిర్ణయించింది. దీంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఓటరు లిస్టు, అభ్యంతరాల స్వీకరణ ప నులు పూర్తి చేశారు. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చింది. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల పరిమితి వచ్చే సంవత్సరంతో ముగియనుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయనుండడంతో జిల్లాలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.జిల్లాలో 311 గ్రామ పంచాయతీలకు గాను 2,730 వార్డులు ఉన్నా యి. అందులో 2019లో 308 పంచాయతీల్లోని 2,706 వార్డులకు ఎన్ని కలు నిర్వహించారు. ఇందులో వివిధ కారణాలతో పలు స్థానాలు ఖాళీ కాగా, కొన్ని పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించలేదు. ఖాళీ స్థానాల తోపాటు, గతంలో ఎన్నికలు నిర్వహించని వాటిలో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న వార్డు సభ్యులు, సర్పంచ్‌, ఎంపీటీసీ స్థానాల్లో ఓటరు జాబితా, పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు పై అధికారులు దృష్టి సారించారు. ముందుగా ఓటరు జాబితాకు షెడ్యూల్‌ విడుదల చేసి తాజా జాబితాను రూపొందించనున్నారు. ఎన్ని కల నిర్వహణకు అవసర మైన పోలింగ్‌ కేంద్రాలను గుర్తిస్తున్నారు. బ్యా లెట్‌ బాక్సులు, ఇతర సామగ్రి సిద్ధం చేస్తున్నారు. రిటర్నింగ్‌, ప్రిసైడిరగ్‌ అధికారులు, పోలింగ్‌ సిబ్బందిని నియమించే పనులు చేపడుతున్నారు. ఎన్నికలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు టీ`పోల్‌లో నమోదు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఖాళీ స్థానాలు ఇవే..
జిల్లాలో మొత్తం 311 పంచాయతీలకు గాను 367 వార్డులు, 9 సర్పంచ్‌, 2 ఎంపీటీసీ స్థానాలు ఖాళీఉన్నాయి. సర్పంచ్‌ స్థానాలకు సంబంధించి దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్‌, వందూరుగూడ, గూడెం, కోటపల్లి మండలం కొల్లూరు, సిర్సా, తాండూరు మండలం తాం డూరు, కన్నెపల్లి మండలం సాలిగాం, కాసిపేట మండలం ధర్మారావు పేట, వేమనపనల్లి మండలం రాజారాం స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి మందమర్రి మండలం చిర్రకుంట, భీమారం మండలం మద్దికల్‌ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. చిర్రకుంట ఎంపీటీసీ ఆరిఫ్‌ విద్యుదాఘాతంతో మృతి చెందగా, మద్దికల్‌ ఎంపీటీసీ జ్ఞానంపెల్లి సమ్మయ్య సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈయన సర్పంచ్‌గా పోటీ చేసిన సందర్భంలో ఎలక్షన్‌ కమిషన్‌కు ఎన్నికలు ఖర్చులు సమర్పించనందున ఎంపీటీసీగా ఉన్న ఆయనపై వేటు పడిరది. ఆయన మండల వైస్‌ ఎంపీపీగా కూడా ఉన్నారు. దీంతో ఈ రెండు స్థానాల్లో మళ్లీ ఎన్నికలు జరుగనున్నాయి….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *