టాప్‌ 50 వర్శిటీల్లో చదివితేనే

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి ఏపీ ప్రభుత్వం మరో మెలిక విధించింది. టాప్‌ 50 ర్యాంకుల్లో ఉన్న వర్శిటీల్లో చదివితేనే ప్రభుత్వ సాయం అందిస్తామని తాజాగా ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర్వులు వెలువరించగా తాజాగా అవి వెలుగులోకి వచ్చాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు మూడున్నరేళ్ల పాటు విదేశీ విద్యా దీవెన పథకాన్ని నిలిపివేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కొద్ది నెలల క్రితమే పునరుద్దరించినా రకరకాల ఆంక్షలు విధించడం చాలా మంది పథకానికి దూరం అయ్యారు.రాష్ట్ర ప్రభుత్వ ఆంక్షలతో విదేశీ విద్యా దీవెన పథకానికి పేద కుటుంబాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు దూరం అయ్యారు. పథకానికి అర్హులయ్యే వారిని తగ్గించేలా కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. లబ్దిదారుల సంఖ్య మరింత తగ్గిపోయేలా మార్గదర్శకాల్లో సవరణలు చేశారు. విదేశాల్లో ఉన్నత విద్య పథకాన్ని అమలు చేస్తున్నట్లు చూపిస్తూనే,పేదలకు పూర్తి స్థాయిలో అందకుండా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. తాజా ఉత్తర్వులతో విదేశీ విద్య పేద విద్యార్దులకు అందని ద్రాక్షే అవుతుంది.గత ఏడాది పథకాన్ని పున: ప్రారంభించినపుడు క్యూఎస్‌ ర్యాకింగ్‌లో టాప్‌ 200లో ఉన్న విశ్వ విద్యాలయాల్లో సీట్లు పొందిన వారికి సాయాన్ని అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పథకానికి అర్హులైన వారికి గరిష్ట మొత్తంలో ఫీజులు చె?ల్లిస్తామని వెల్లడిరచింది. తాజా ఉత్తర్వుల్లో సబ్జెక్టుల వారీగా టాప్‌ 50 ర్యాంకుల్లో ఉన్న వాటికే సాయం ఇస్తామని ఉత్తర్వుల్లో సవరణ చేసింది. సబ్జెక్టుల వారీగా యూనివర్శిటీలను విభజించారు. ఒక్కో సబ్జెక్టుకు పథకానికి అర్హత పొందిన 50 నుంచి 70 విశ్వవిద్యాలయాలను ప్రకటించారు.విద్యార్ధులు ఏ సబ్జెక్టులో పీజీ చదవాలనుకుంటున్నారో దానికి ప్రభుత్వం సూచించిన టాప్‌ 50లో వర్శిటీల్లో మాత్రమే సీటు సంపాదించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్గదర్వాకాలను గోప్యంగా ఉంచారు. ప్రభుత్వం నిర్దేశించిన 21 సబ్జెక్టుల్లో టాప్‌ 50 ర్యాంకుల్లో నిలిచిన విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదించిన వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తరపున సాయాన్ని అందిస్తామని తెలిపింది.టాప్‌ 50 ర్యాంకుల్లో నిలిచిని విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 100% ఫీజు లేదా రూ. 1.25 కోట్లు చెల్లిస్తారు. వీటిలో ఏది తక్కువ అయితే అది వర్తిస్తుంది. ఇతర సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు 100% ఫీజు లేదా రూ.కోటి వరకు సాయం అందిస్తారు. కొద్ది రోజుల క్రితం జగనన్న విదేశీ విద్యా? దీవెన పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం అర్హుల జాబితాను మాత్రం విడుదల చేయలేదు.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి దఫా అర్హుల్లో సామాజిక వర్గాల వారీగా ఏఏ వర్గాలకు విదేశీ విద్య పథకంలో అర్హత సాధించారనే విషయాలను అధికారికంగా వెల్లడిరచలేదు. 213మంది విద్యార్ధులు ఈ పథకానికి ఎంపికయ్యారు. వారికి తొలివిడతో 19.95కోట్ల రుపాయల నిధులను ప్రభుత్వం అంద చేసింది. క్యూఎస్‌ 200 ర్యాంకింగ్‌ ఉన్న వర్శిటీల్లో ప్రవేశాలు దక్కడమే గగనమని భావిస్తున్న నేపథ్యంలో టాప్‌ 50 వర్శిటీలకే పథకాన్ని వర్తింప చేయాలనే ఆలోచనపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *