ఉద్యోగులపై ప్రోటోకాల్‌ ఖర్చుల భారం

నెల్లూరు, అక్టోబరు 3
రెవిన్యూ ఉద్యోగులపై ప్రభుత్వం అధిక భారం మోపుతోందని, ప్రోటోకాల్‌ ఖర్చులు చెల్లించక పోవడం వల్ల ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారని రెవిన్యూ ఉద్యోగుల సంఘం ఆరోపించింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి ధర్మాన హావిూ ఇచ్చారు. ఏపీలో రెవిన్యూ ఉద్యోగులను ప్రభుత్వ సంక్షేమ పధకాలు అమలు కోసం తీవ్రమైన పని ఒత్తిడికి ఉన్నతాధికారులు గురిచేస్తున్నారని, ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించాలని,రెవిన్యూ ఉద్యోగులందరికీ ఒకే ఉమ్మడి సర్వీస్‌ రూల్సు అమలు చేయాలని రెవిన్యూ సర్వీసెస్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు డిమాండ్‌ చేశారు.ఉద్యోగుల సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రెవిన్యూ శాఖ మంత్రి ధర్మానప్రసాద్‌ రెవిన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హావిూ ఇచ్చారు. తప్పని సరిపరిస్దితులలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు అమలు ప్రయత్నంలో బాగంగానే ఉద్యోగులపై పనిఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. పేద ప్రజలకు సేవ చేయడం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, వాటి వలన కొంత ఒత్తిడి ఉందని, బాధ్యత గా పనిచేసే రెవెన్యూ ఉద్యోగులకు పని ఒత్తిడి సహజమని, సమయం వచ్చినప్పుడు రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హావిూ ఇచ్చారు.రెవిన్యూ ఉద్యోగులు కోర్కెలు గొంతెమ్మకోర్కెలు కాదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళి, వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడు సానుకూలంగానే ఉందన్నారు. రెవిన్యూ డిపార్టుమెంట్‌ భవిష్యత్‌ లో రెవిన్యూ శాఖను ఇంకా శక్తివంతమైన వ్యవస్థగా చేస్తామని, రెవిన్యూ వ్యవస్థ మార్పులు రాబోతున్నాయని చెప్పారు. రెవిన్యూ వ్యవస్ద ద్వారా ప్రజలకు జరుగుతున్న ప్రయోజానాల ఫలితాలు గొప్పతనమంతా రెవిన్యూఉద్యోగులకే దక్కుతుందని దర్మాన తెలిపారు.ఉద్యోగుల సమావేశాలంలో పాల్గొన్న సిసిఏయల్‌ జి.సాయిప్రసాధ్‌ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో రెవిన్యూ ఉద్యోగులు చట్టాన్ని అతిక్రమించవద్దని, చట్టానికి లోబడి పని చేయాలని అన్నారు. టెలి కాన్ఫరెన్స్‌, వీడియో కాన్ఫరెన్స్‌ తో ఎక్కువ సమయం చేసే కలెక్టర్లకు తగ్గించమని సలహా ఇస్తామని చెప్పారు.ఉద్యోగులు టార్గెట్‌ టైములో చేయగలిగినంత చేయండి లేకపోతే కొంత సమయం తీసుకుని చేయాలని అంతే కానీ ఒత్తిడికి గురి కావొద్దని, ఏపని అయినా ఇష్టపడి పని చేస్తే కష్టం కాదని తెలిపారు.భవిష్యత్తులో ల్యాండ్‌ టైటిల్‌ ఆఫీసర్‌ వ్యవస్థ వస్తుందని వ్యవసాయ భూములే గాక నివాస స్థలాలు, ఇండస్ట్రీల భూములు అన్ని రకాలు కూడా రెవెన్యూ పరిపాలనలోకి వస్తాయని సి.సి యల్‌.ఎ చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *