ఎత్తుకెళ్లి పోవాలా నా సామిరంగా

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్ని దర్శకత్వంలో నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నా సామిరంగా’. అశికా రంగనాథ్‌ కథానాయిక. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో తుది దశ చిత్రీకరణ జరుగుతోంది. ‘నా సామిరంగా’ చిత్రం నుంచి తొలిగీతం ‘ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తోంది’ త్వరలో విడుదలవనుంది. ఈ సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్‌లో రైతు గెటప్‌లో నాగార్జున ఆకట్టుకున్నారు. పొలంలో ట్రాక్టర్‌పై కాలు ఉంచి బీడీ కాలుస్తూ సరికొత్త లుక్‌లో కనిపించారు. ప్రసన్నకుమార్‌ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *