రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు

2023 ఎండిరగ్‌లో అయిదు (తెలంగాణ, మిజోరం, రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌), వచ్చే సంవత్సరం లోక్‌సభ ఎన్నికలతోపాటు నాలుగు (సిక్కిం, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా,అరుణాచల్‌ప్రదేశ్‌), 2024 చివరిలో మరో మూడు (హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌) రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. అంటే ఏడాది వ్యవధి (నవంబర్‌ 2023`నవంబర్‌ 2024 మధ్య) మొత్తం 12 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. కేంద్రం ఒకవైపు జమిలి ఎన్నికల ఆలోచన చేస్తోంది. వీటిలో ఏడు రాష్ట్రాలు పెద్దవి, మిగిలిన అయిదు చిన్న రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలలో మెరుగైన ఎంపీ సీట్లు సాధించడం బీజేపీకి అత్యంత అవసరంరాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఢల్లీి యాత్రకు వెళ్ళిన నేపథ్యంలో ఏపీలో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రావచ్చని, తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికలతోపాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చన్న ఊహాగానాలు సడన్‌గా మొదలయ్యాయి. ఒకరోజు పర్యటనకు ఢల్లీి వెళ్ళిన సీఎం వైఎస్‌ జగన్‌.. ముందుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాని కలిశారు. ఆ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో గంటకు పైగా భేటీ అయ్యారు. ఆ తర్వాత కాసేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా సమావేశమయ్యారు. అయితే, మోదీని కలిసి బయటికి వచ్చిన కాసేపటికే ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిపించాల్సిందిగా నరేంద్ర మోదీని ఏపీ సీఎం కోరారంటూ జాతీయ విూడియాలో ఓ లీకేజీ వచ్చింది. దీన్ని ఓ జర్నలిస్టు ట్వీట్‌ చేయడంతో హడావిడి మొదలైంది. ట్వీట్‌ ఆధారంగా తెలుగు న్యూస్‌ ఛానల్స్‌ బ్రేకింగ్‌ న్యూస్‌ ప్రారంభించాయి. అయితే కాసేపటికే ఏపీలో ముందస్తు యోచన లేదంటూ జగన్‌ వెంటే ఢల్లీి పర్యటనలో వున్న వైసీపీ ఎంపీ మిధున్‌ రెడ్డి విూడియా ప్రతినిధులకు కాల్‌ చేసి మరీ చెప్పారు. మరి ఏ నిప్పు లేకుండానే ఈ పొగ బయటికి వచ్చిందా ? అసెంబ్లీని ముందుగానే రద్దు చేసి, అయిదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు ఎన్నికలకు వెళ్ళాలని ఏపీ సీఎం జగన్‌ మదిలో వుందా? లేదా ? లేకుండానే ఈ లీకేజీ ఎలా వచ్చింది? ఈ అంశాలు కాసేపు గందరగోళం కలిగించాయి. ఎందుకంటే అధినేతల అంతరంగాన్ని వారు తమ దగ్గరి వారితో విూడియాకు లీకు చేయిస్తేనేగానీ నిజం వెలుగులోకి రాదు.నిజానికి ఏపీలో ముందస్తు వుండొచ్చన్న ఊహాగానాలు రావడం ఇదే మొదటి సారి కాదు. గత ఆరు నెలలుగా ఈ మేరకు ఏదో ఒక పత్రిక కథనాలు రాస్తూనే వుంది. అయితే తాజాగా జగన్‌, మోదీ భేటీ తర్వాత ఈ మేరకు లీకేజీ రావడం యాదృచ్ఛికమైతే కాదు. ఎందుకంటే జాతీయ స్థాయిలో బీజేపీ వ్యూహ రచన కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత మారింది. ఇటీవల విపక్షాలు కొత్తగా కూటమి కట్టేందుకు పాట్నాలో భేటీ నిర్వహించడం, దానికి 17 పార్టీలు హాజరు కావడం, మలి విడత సమాలోచనలు బెంగళూరు సిటీలో జులై 17, 18 తేదీలలో జరపనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పంథా మార్చిందనే చెప్పాలి. కొత్త ఆలోచనలు అమలు చేయడం ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో వున్న పార్టీలతో కూడా బీజేపీ వ్యవహార శైలిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. మే నెల కంటే ముందు తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్దం పతాక స్థాయిలో వుండిరది. కానీ గత రెండు నెలలుగా ఈ రెండు పార్టీల మధ్య మాటల మంటలు గతంలోలాగా లేవు. అధికార బీఆర్‌ఎస్‌ కీలక నేతలు కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడుతున్నారు. అడపాదడపా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీ.సర్కార్‌లో నెంబర్‌ టూ కేటీఆర్‌, ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు.. కాంగ్రెస్‌ పార్టీని దుయ్యబడుతున్నారు. అటు ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ ఫ్రెండ్షిప్‌ ఖాయమన్న ప్రచారం కూడా సడన్‌గా ఆగిపోయింది. వైసీపీకే అక్కడ బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీల పట్ల కేంద్రంలో అధికారంలో వుంటూ మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీ వైఖరి మెతకగా మారడం కచ్చితంగా యాదృచ్ఛికమైతే కాదు. దీని వెనుక సుదీర్ఘ వ్యూహం వుండొచ్చని రాజకీయ విశ్లేషకులు టీవీ డిబేట్లలో అభిప్రాయపడుతుండడం బీజేపీ వైఖరిని లోతుగా విశ్లేషించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది.. ఈక్రమంలో 2024 ఏప్రిల్‌, మే నెలలో జరగాల్సిన లోక్‌సభ ఎన్నికలను కాస్త ముందుకు అంటే రెండు, మూడు నెలల ముందుకు జరిపితే.. దానికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా సానుకూలంగా స్పందిస్తే.. 9 రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్‌సభ ఎన్నికలకు వెళ్ళే అవకాశం వుంటుంది. 2024 ఎండిరగ్‌లో ఎన్నికలు జరగాల్సిన మూడు రాష్ట్రాలలో మహారాష్ట్ర, హర్యానాల్లోను బీజేపీ ప్రభుత్వాలే వున్నాయి. సో.. బీజేపీ జాతీయ నాయకత్వం గనక జమిలి ఎన్నికలను ప్లాన్‌ చేస్తే ఆ రెండు రాష్ట్రాలు కూడా అసెంబ్లీలను రద్దు చేసి.. 2024 జనవరి, ఫిబ్రవరిలలో ఎన్నికలకు రెడీ అవ్వొచ్చు. ఇక బీజేపీతో వైరమున్న జార్ఖండ్‌ ముక్తి మోర్చా ఆ రాష్ట్రంలో ముందస్తుకు ఏ మేరకు సహకరిస్తుందో ఇప్పుడే చెప్పలేం. కానీ 11 రాష్ట్రాలు ముందుకొచ్చినపుడు జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్‌ కూడా ముందుకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఈ లెక్కన మినీ జమిలి ఎన్నికల వ్యూహంలో భాగంగా బీజేపీ హైకమాండ్‌ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నట్లు కూడా భావించవచ్చు. దేశవ్యాప్తంగా సడన్‌గా జమిలి ఎన్నికలను ప్లాన్‌ చేస్తే ఆ ప్రయోగం వికటించే అవకాశాలు వున్నాయి. దాంతో కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడం కూడా అంత ఈజీ కాదు. ఈక్రమంలోనే మినీ జమిలి ఎన్నికలను 2024 జనవరి, ఫిబ్రవరిలో వచ్చేరకంగా ప్రధాని మోదీ, అమిత్‌ షా ప్లాన్‌ చేస్తున్నారేమో అనిపిస్తోంది. ఏపీ ముందస్తుపై వచ్చిన లీకేజీ కూడా వైసీపీ నుంచి వస్తే ఆ వెంటనే దానికి ఖండిరచే వారు కాదు. ఆ లీకేజీ బీజేపీ వైపు నుంచి వచ్చిందా అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. మినీ జమిలి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ పార్టీతో నేరుగా తలపడే రాష్ట్రాలలో ఒకరకమైన వ్యూహం, థర్డ్‌ పార్టీతో తలపడే రాష్ట్రాలలో ఇంకోరకం వ్యూహాన్ని కమలనాథులు అవలంభించే సంకేతాలున్నాయి. అందులో భాగంగానే తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ పట్ల, ఏపీలో వైఎస్సార్సీపీ పట్ల బీజేపీ వైఖరి మారి వుండొచ్చు. ఇక్కడ ఇంకో అంశాన్ని కూడా చెప్పుకోవాలి. మహారాష్ట్ర తరహా పాలిటిక్స్‌ బీహార్‌లోను మొదలైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడవచ్చు. దానిని సాకుగా చూపి అక్కడ కూడా అసెంబ్లీ రద్దు చేసి, ఎన్నికల దిశగా అడుగులు పడొచ్చు. అపుడు మినీ జమిలిలో 13వ రాష్ట్రంగా బీహార్‌ కూడా చేరుతుంది. ఇక గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రపతి పాలనలో వున్న జమ్మూ కశ్మీర్‌లో ఇపుడు దాదాపు సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో మినీ జమిలిలో ఆ రాష్ట్రాన్ని కూడా కలిపే అవకాశాలున్నాయి. మొత్తవ్మిూద ప్రాంతీయ పార్టీల కంటే కూడా జమిలి ఎన్నికల వ్యూహంతో కేంద్రంలోని బీజేపీ నాయకత్వమే ముందస్తు వ్యూహరచన చేస్తుందన్న సంకేతాలకు ఆస్కారమిస్తున్నాయి. ఈ మధ్యనే తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను మార్చడం, త్వరలో మరో ఆరు రాష్ట్రాల బీజేపీ యూనిట్ల ప్రెసిడెంట్లను మార్చబోతూ వుండడం మినీ జమిలి ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *