బీహార్‌ లో బీజేపీ మార్క్‌ పాలిట్రిక్స్‌

బీహార్‌ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. జేడీయూ`బీజేపీ సర్కార్‌లో సంక్షోభం గంట గంటకు ముదురుతోంది. తాజా పరిణామాలతో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేందుకు మిత్రపక్షం జేడీయూ ప్రయత్నం ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. మిత్రపక్షం బీజేపీతో సీఎం నితీశ్‌ కుమార్‌ చాలా కాలంగా అంటీమున్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ నేతృత్వంలో ఆదివారం జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశానికి గైర్హాజరు కావడంతో మోడీకి నితీశ్‌ కుమార్‌కు మధ్య క్లాష్‌ క్లియర్‌గా కనిపిస్తోందనే వాదన తెరపైకి వస్తోంది. జులై 17 తర్వాత కేంద్రం నిర్వహించిన నాలుగు సమావేశాలకు నితీశ్‌ కుమార్‌ డుమ్మా కొట్టడంతో బీజేపీ, జనతాదళ్‌ మైత్రి బంధానికి బ్రేక్స్‌ పడనుందనే చర్చ జోరందుకుంది. జేడీయూ మాజీ జాతీయ అధ్యక్షుడు ఆర్‌సీపీ సింగ్‌ పార్టీకి శనివారం రాజీనామా చేశారు. ఆర్సీపీ సింగ్‌పై నితీశ్‌ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్సీపీ సింగ్‌ బీజేపీతో సన్నిహితంగా ఉండటంతో పాటు తన అనుమతి లేకుండా ఆర్సీపీ సింగ్‌ను మోదీ తన కేబినెట్లోకి తీసుకోవడం నితీశ్‌ కుమార్‌కు ఆగ్రహం తెప్పించిందట. ఈ క్రమంలోఆర్సీపీ సింగ్‌ కుమార్తెల అక్రమాస్తులకు సంబంధించి సీఎం నితీశ్‌ కుమార్‌ వివరణ కోరడం, ఆ వెంటనే ఆయన పార్టీకి రాజీనామా చేయడం బీహార్‌ రాజకీయంలో దుమారానికి తక్షణ కారణంగా మారింది.బీహార్‌లో ప్రస్తుతం జేడీయూ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతోంది. తాజా పరిణామాలతో ఆగస్టు 11కు ముందే జేడీయూ`బీజేపీ సర్కార్‌ కూలిపోతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో నితీశ్‌ కుమార్‌ అలర్ట్‌ అయ్యారు. అధికారాన్ని హస్తగతం చేసుకోకుండా ఉండేందుకు తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీకు చెక్‌ పెట్టేందుకు నితీశ్‌ కుమార్‌ అనేక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. జేడీయూ`బీజేపీ సంకీర్ణ కూలిపోతే నితీశ్‌ మళ్లీ ఆర్‌జేడీతో జట్టుకట్టాలని భావిస్తున్నట్లు బీహార్‌ రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. మరో వైపు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని కలిసేందుకు నితీశ్‌ కుమార్‌ అపాయింట్‌ మెంట్‌ కోరినట్లు ప్రచారం జరుగుతోంది. మోడీకి చెక్‌ పెట్టేలా ప్రభుత్వంలో భాగమైన బీజేపీతో విడిపోయి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని నితీశ్‌ మరో ఆలోచనలో ఉన్నారని అయితే మధ్యంతర ఎన్నికలకు జేడీయూ ఎమ్మెల్యేలు సుముఖంగా లేకపోవడంతో ఆర్జేడీ, కాంగ్రెస్‌ తో పాటు వామపక్షాలను కలుపుకొని బీహార్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సీఎం ఆయా పార్టీలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది.కొంత కాలంగా మిత్ర పక్షం బీజేపీలో క్రమక్రమంగా నితీశ్‌ కుమార్‌ దూరం పెంచుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు జేడీయూ` బీజేపీ సర్కార్‌ ఏ క్షణమైనా కూలేందుకు సిద్ధంగా ఉండటంతో నితీష్‌ కుమార్‌ సరికత్త ఎత్తుగడలు వేస్తున్నారు. మహారాష్ట్రలో ఏక్‌ నాథ్‌ షిండే రూపంలో ఉద్దవ్‌ ఠాక్రే ప్రభుత్వంపై తిరుగుబాటు జరిగినట్లుగా బీహార్‌లోనూ బీజేపీ గేమ్‌ స్టార్ట్‌ చేసే అవకాశాలు ఉన్నాయని పసిగట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా హుటాహుటీనా పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కావడం, ఇతర పార్టీలతో సంప్రదింపులు జరపడం వెనుక బీజేపీ ఎత్తుగడలకు చిక్కకుండా తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో భాగంగా తెలుస్తోంది. ప్పటికే బీహార్‌లో జేడీయూ`బీజేపీ పొత్తు తెగిపోతోందని ప్రచారం నడుస్తోంది. చాలా మంది జేడీయూ ఎమ్మెల్యేలు మధ్యంతర ఎన్నికలకు విముఖత చూపుతున్నందున, రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకోవడానికి ఆ పార్టీ.. ఆర్జేడీ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని చూస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.బీహార్‌లో ఇలాంటి రాజకీయ గందరగోళం మధ్య నితీశ్‌ కుమార్‌ మంగళవారం పాట్నాలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలందరినీ ఈ సమావేశానికి పిలిచినట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత ఎన్డీఏ నుంచి వైదొలిగే అంశంపై బీహార్‌ సీఎం కీలక ప్రకటన చేస్తారని అంతా ఆశిస్తున్నారు. మరోవైపు బీజేపీతో విభేదాల వార్తలను జేడీయూ జాతీయ అధ్యక్షుడు లాలన్‌ సింగ్‌ ఖండిరచారు. మిత్రపక్షమైన బీజేపీతో అంతా బాగానే ఉందని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం జరిగే కీలక సమావేశానికి ఆర్జేడీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాట్నాకు తరలిరావాలని కోరారు. కాగా, ఎన్డీయేకు మరో మిత్రపక్షమైన బీహార్‌ మాజీ సీఎం జితన్‌ రామ్‌ మాంరీa నేతృత్వంలోని హిందుస్థానీ అవామ్‌ మోర్చా కూడా తమ ఎమ్మెల్యేలందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీని గెంటేసి.. ఆర్జేడీతో కలిసి నితీష్‌ కుమార్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ చర్చల దశకు వచ్చాయి. దాదాపుగా పూర్తయ్యాయి. మంగళవారం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో నితీష్‌ కుమార్‌ పార్టీ దారుణంగా దెబ్బతిన్నది. అయినప్పటికీ బీజేపీ ఆయనకు ముఖ్య మంత్రి పదవి ఇచ్చింది. కానీ మెజార్టీ స్థానాలు బీజేపీ దగ్గర ఉన్నాయి.దీంతో ఆయన చేయడానికి ఏవిూ లేకుండా పోతోంది. దీంతో ఆర్జేడీని ప్రభుత్వంలోకీ తీసుకుని.. బీజేపీని పంపేయాలని అనుకుంటున్నారు. ఆర్జేడీకి ప్రభుత్వ ఏర్పాటుకు చాలాకొద్ది స్థానాలే తగ్గాయి. కాంగ్రెస్‌ కూడా ఈ మార్పు పట్ల సానుకూలంగా ఉంది.గతంలో నితీష్‌ తమను డంప్‌ చేసి వెళ్లిపోయినా ఇప్పుడు తప్పు దిద్దుకునేందుకు ప్రభుత్వ ఏర్పాటుకు కలసి వస్తున్నందున వారుకూడా ఓకే అంటున్నారు. ఈ కారణంగా ఇప్పుడు బీజేపీ కీలక రాష్ట్రంలో అధికారం కోల్పోతోంది. ఎన్డీఏలో ఉన్న ఓ మాదిరి పార్టీ జేడీయూనే. ఇప్పుడు ఆ పార్టీ కూడా గుడ్‌ బై చెబుతోంది. ఇప్పటికే జేడీయూ బీజేపీతో అన్ని సంబంధాలు తెంచుకుంది. నీతి ఆయోగ్‌ భేటీకి కూడా నితీష్‌ వెళ్లలేదు. ప్రభుత్వ మార్పుపై బీహార్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *