నందమూరి ఫ్యామిలీలో చీలిక…

విజయవాడ, అక్టోబరు 6
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో అరెస్టయి జైలుకెళ్లారు. ఆయన జైలుకెళ్లి దాదాపు ఇరవై ఏడు రోజులు కావస్తుంది. టీడీపీ సానుభూతిపరులందరూ స్పందిస్తున్నారు. చివరకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ? ఆయనను కలిసేందుకు విజయవాడకు వచ్చేందుకు ప్రయత్నించి పోలీసులు అనుమతించకపోవడంతో చివరకు రాజమండ్రి జైలుకెళ్లి ములాఖత్‌ అయి వచ్చారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి రాజమండ్రిలోనే ఇరవై ఐదు రోజుల నుంచి ఉన్నారు. ఆయనను కలుస్తూ ఆరోగ్య సమస్యలపై వాకబు చేస్తున్నారు. ములాఖత్‌ అవుతూ మరో వైపు టీడీపీ నేతలతో పాటు ఆయన కుటుంబ సభ్యులు న్యాయపోరాటం చేస్తున్నారు. కానీ అదే కుటుంబానికి చెందిన జూనియర్‌ ఎన్టీఆర్‌ మాత్రం ఇప్పటి వరకూ చంద్రబాబు అరెస్ట్‌ పై పెదవి విప్పలేదు. మౌనంగానే ఉంటున్నారు. తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి వీరవిధేయుడినంటూ పలు మార్లు తనకు తానుగా ప్రకటించుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ మాత్రం ఈసారి మాట్లాడకపోవడంపై పార్టీ వర్గాలే అసహనం వ్యక్తం చేస్తున్నాయి. టాలీవుడ్‌ నుంచి నిర్మాతలు అశ్వనీదత్‌, మురళీ మోహన్‌, దర్శకుడు రాఘవేంద్రరావు వంటి వారు చంద్రబాబు అరెస్ట్‌ ను ఖండిస్తూ ప్రకటనలు చేశారు. అశ్వనీదత్‌ నేరుగా రాజమండ్రికి వెళ్లి భువనేశ్వరిని పరామర్శించి వచ్చారు. కానీ జూనియర్‌ నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్‌ రావడం లేదు. డెబ్భయి మూడేళ్ల చంద్రబాబును అరెస్ట్‌ చేయడాన్ని పార్టీలకతీతంగా అందరూ వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆ ఫ్యామిలీలో ఒక సభ్యుడైన జూనియర్‌ మాత్రం వీటికి దూరంగా ఉన్నారు. దీనికి కారణాలేంటన్న చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతుంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో బలమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అది తాత నుంచి సంక్రమించిన అభిమానమే. టీడీపీ క్యాడర్‌ కూడా ఆయనను అభినందిస్తుంది. కానీ ఆయన మాత్రం చంద్రబాబు అరెస్ట్‌ విషయంలో కించిత్‌ కామెంట్‌ చేయకపోవడం వెనక ఏమై ఉంటుందా? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. అసెంబ్లీలో భువనేశ్వరిపై వైసీపీ నేతలు కామెంట్స్‌ చేశారంటూ చంద్రబాబు పార్టీ కార్యాలయంలో బోరున విలిపించిన తర్వాత ఆయన స్పందించారు. కానీ ఇప్పుడు అరెస్ట్‌ అయితే మాత్రం మిన్నకుండి పోయారు. ఇతర రాష్ట్రాలకు చెందిన సినీ నటులు కూడా దీనిపై స్పందించినా జూనియర్‌ లో మాత్రం రెస్పాన్స్‌ లేదు. చంద్రబాబు తన తండ్రి హరికృష్ణను పక్కన పెట్టడమే ఇందుకు కారణమన్నది ఒకవైపు వినిపిస్తుంది. దీంతో పాటు ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిదన్న కోణంలోనూ ఆయన సీబీఎన్‌ అరెస్ట్‌పై స్పందించడం లేదంటున్నారు. ఆయన స్పందించినా లేకపోయినా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఫ్లెక్సీలు కడుతూ మావోడే కాబోయే సీఎం అంటున్నారు. చివరకు నందమూరి బాలకృష్ణకు కూడా జూనియర్‌ విషయంలో అసహనం వచ్చి ఐ డోన్ట్‌ కేర్‌ అనేశారు. దీంతో నందమూరి కుటుంబంలో భారీ చీలిక వచ్చిందన్న టాక్‌ పార్టీలో వినపడుతుంది. బాలయ్య తమకు ఎవరి మద్దతు అవసరం లేదని చెప్పి జూనియర్‌ ను మరింత దూరం చేశారంటున్నారు. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *