ఇంగ్లీషులోనూ ప్రాక్టికల్స్‌

తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యలో సంస్కరణలకు బోర్డు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్‌ సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటి వరకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు మాత్రమే ప్రాక్టికల్స్‌ ఉండేవి. కొత్త విద్యాసంవత్సరం నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ అమలు చేయాలని ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇంగ్లిష్‌ రాతపరీక్షకు 80 మార్కులు, ప్రాక్టికల్స్‌కు 20 మార్కులు కేటాయించనున్నారు.కొత్త విద్యాసంవత్సరంలో పలు సంస్కరణలు అమలుచేయాలని గత నవంబరులో జరిగిన ఇంటర్‌ బోర్డు పాలకమండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో ఇంగ్లిషులో ప్రాక్టికల్స్‌ అమలు ఒకటి. విద్యార్థులు ఇంగ్లిష్‌లో మాట్లాడేలా తీర్చిదిద్దాలని, దానివల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాక్టికల్స్‌కు సిలబస్‌ కూర్పుపై భాషా నిపుణులతో బోర్డు అధికారులు చేసిన కసరత్తు దాదాపు పూర్తి కావొచ్చింది. ప్రయోగ పరీక్షల్లో భాగంగా తరగతి గదిలో విద్యార్థులతో ఇంగ్లిష్‌లో మాట్లాడిస్తారు. దైనందిన జీవితంలో ఎదురయ్యే వివిధ సందర్భాలు చెప్పి.. ఇంగ్లిష్‌లో ఎలా మాట్లాడతారో పరీక్షిస్తారు. ఇందుకు సంబంధించిన నిపుణులు విధివిధానాలు రూపొందిస్తున్నారు. వాటికి సంబంధించిన పుస్తకాలనూ ముద్రించాలని భావిస్తున్నారు. పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు వైవా తరహాలోనే ఈ పరీక్ష ఉంటుందని ఒకరు వ్యాఖ్యానించారు. జూనియర్‌ కళాశాలల తరగతులు ప్రారంభమయ్యే నాటికి ప్రాక్టికల్స్‌పై ఇంటర్‌ బోర్డు స్పష్టత ఇవ్వనుందిఇంటర్‌లో సెకండ్‌ లాంగ్వేజ్‌ సబ్జెక్టులైన తెలుగు, సంస్కృతం, హిందీ తదితరాల సిలబస్‌ మార్చాల్చి ఉంది. అయితే ఈ విద్యాసంవత్సరంలో ఫస్టియర్‌, వచే ఏడాది(2024`25)లో సెకండియర్‌ పాఠ్యపుస్తకాలు మార్చాలని బోర్డు నిర్ణయించింది. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా భాషా విధానం మారింది. దానిపై జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం లాంగ్వేజ్‌ సబ్జెక్టులకు కొత్త సిలబస్‌ రావొచ్చని అంచనాకు వచ్చిన అధికారులు ఈ ఏడాది ఇక్కడ మార్పు చేస్తే ఇబ్బంది అవుతుందని బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌కు సూచించినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతానికి సెకండ్‌ లాంగ్వేజ్‌ను పాత సిలబస్‌ ప్రకారమే బోధించనున్నారు.ఇంటర్‌ బోర్డు ఇప్పటివరకూ ఎంఈసీ, సీఈసీ గ్రూపులకు ఒకే స్థాయి గణితాన్ని అమలుచేస్తూ వస్తోంది. మరీ ఎక్కువ స్థాయి గణితం సీఈసీ విద్యార్థులకు అవసరం లేదని భావించిన బోర్డు.. కొత్త విద్యాసంవత్సరం నుంచి మార్చాలని గతంలో నిర్ణయించింది. కామర్స్‌ విద్యార్థులకు అవసరమైన మేరకు సిలబస్‌ ఉంచి.. కొన్ని మార్పులతో ప్రత్యేకంగా గణితం సబ్జెక్టు తీసుకురావాలని నిర్ణయించారు. అది కూడా ఈసారి అమల్లోకి రావడం లేదు. ప్రత్యేకంగా సీఈఏ (కామర్స్‌, ఎకనామిక్స్‌, అకౌంటింగ్‌) గ్రూపును తీసుకురావాలని నిర్ణయించినా.. అది కూడా ఈ విద్యాసంవత్సరం అమలుకావడం లేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *