ఐపీఎస్‌ ల మధ్య కోల్డ్‌ వార్‌

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఐపీఎస్‌ అధికారుల మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోందా? ఖాకీల బదిలీలు వారి మధ్య చిచ్చు పెట్టాయా? సమస్య డీజీపీ దగ్గరకు వెళ్లిన తర్వాత ఏం జరిగింది? ఈయన సిద్ధార్థ కౌశల్‌. కర్నూలు జిల్లా ఎస్పీ. ఈయనేమో రఘువీర్‌రెడ్డి. నంద్యాల జిల్లా ఎస్పీ. ఇద్దరు అధికారుల మధ్య పోలీసుల బదిలీలు పెద్ద వివాదానికి దారితీశాయి. అది పోలీస్‌ శాఖలో పెద్ద చర్చగా మారింది. సమస్య శ్రుతిమించకుండా పోలీస్‌ బాస్‌లు ఎలా పరిష్కరిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తిగా ఉంది. ఏఎస్‌ ఐ నుంచి కానిస్టేబుల్‌ వరకు దాదాపు 66 మందిని బదిలీ చేస్తూ కర్నూలు ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే అది తన పరిధిలోని కర్నూలు జిల్లాకే పరిమితం కాకుండా.. పొరుగునే ఉన్న నంద్యాల జిల్లా నుంచి కొందరిని కర్నూలు జిల్లాకు.. కర్నూలు జిల్లా నుంచి మరికొందరిని నంద్యాల జిల్లాకు ట్రాన్స్‌ ఫర్‌ చేశారు. ఇదే సమస్యకు కేంద్రంగా మారింది. తమ జిల్లాలో కూడా కర్నూలు ఎస్పీనే బదిలీలు చేయడాన్ని నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డి తప్పు పట్టారట. అంతేకాదు.. కర్నూలు జిల్లాకు బదిలీ అయిన నంద్యాల పోలీసులను రిలీవ్‌ చేయలేదట. అలాగే కర్నూలు జిల్లా నుంచి బదిలీపై వచ్చిన వాళ్లను నంద్యాల జిల్లాలో విధుల్లోకి తీసుకోలేదట. సిబ్బంది ట్రాన్స్‌ఫర్లపై ఒక్క మాట చెప్పకుండా.. చర్చించకుండా.. ఏకపక్షంగా బదిలీ చేయడాన్ని డిపార్ట్‌మెంట్‌లోనూ ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.కర్నూలు ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ ఉత్తర్వులపై డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారట నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డి. దాంతో ఆ సమస్య ఏంటో పరిశీలించి? పరిష్కరించాలని కర్నూలు రేంజ్‌ పరిధిలోని ఉన్నతాధికారికి సూచించారట డీజీపీ. ఇక్కడే సమస్య మరో మలుపు తిరిగినట్టు తెలుస్తోంది. బదిలీల వ్యవహారం పక్కన పెట్టి.. సమస్యను తన దృష్టికి తీసుకురాకుండా నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేయడంపై ఆ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారట. పోలీస్‌ శాఖలో ఇది మరో రగడను రాజేసినట్టు సమాచారం. దీనిపై ఖాకీ వర్గాల్లోనే రకరకాలుగా చర్చ జరుగుతోందట. సమస్య వస్తే జిల్లా స్థాయిలో ఐపీఎస్‌లకు చెప్పుకొంటారని.. అదే ఐపీఎస్‌ల మధ్యే ఇబ్బందులు వస్తే ఎవరికి చెబుతారని కొందరు ప్రశ్నిస్తున్నారట.ఈ సమస్యను ఎలా తెగ్గొడతారో కానీ.. బదిలీ అయిన సిబ్బంది పరిస్థితి గందరగోళంలో పడిరది. కర్నూలు జిల్లాలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఒకరిని ఏఎస్‌ ఐగా పదోన్నతి కల్పించి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పోస్టింగ్‌ ఇచ్చారు ఎస్పీ సిద్దార్థ కౌశల్‌. తాజా గొడవలో ఆ బదిలీ డైలమాలో పడిరది. జిల్లాల విభజన తర్వాత .. ఎక్కడికక్కడ ఊూఆలు వచ్చేశారు. వాళ్ల పరిధిలోనే పరిపాలన సాగుతోంది. కానీ.. సాంకేతికంగా కొన్ని చిక్కుముళ్లు అలాగే ఉండిపోయాయో ఏమో.. తాజా ఘటన పోలీస్‌ శాఖలోనే పెద్ద చర్చగా మారింది. మరి.. ఇద్దరు జిల్లా స్థాయి అధికారుల మధ్య తలెత్తిన సిబ్బంది ట్రాన్స్‌ఫర్ల సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *