ఉండాలా…దారి చూసుకోవాలా…

అదిలాబాద్‌, అక్టోబరు 3
రాష్టంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది నేతల్లో ఆందోళన తీవ్రం అవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పార్టీలు మారేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ రాకపోవడంతో వారు కాంగ్రెస్‌ పార్టీ లోకి చేరేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.రాష్టంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది నాయకుల్లో ఆందోళన తీవ్రతరం అవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పార్టీలు మారేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ముఖ్యంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ రాకపోవడంతో వారు కాంగ్రెస్‌ పార్టీ లోకి చేరేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.ఈ క్రమంలో ఇటు కాంగ్రెస్‌ వైపు నుంచి కూడా ఎలాంటి స్పందన కనిపించక పోవడంతో నాయకులు ఎటు నిగ్గు తేల్చుకోలేక పోతున్నారు. ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాలో ఖానాపూర్‌, బోథ్‌, ఆసిఫాబాద్‌ నియోజకవర్గల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే లకు టికెట్‌ ఇవ్వకపోగా వారు అతి త్వరలోనే పార్టీ మారతారని ప్రచారం జరిగింది.ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖ నాయక్‌, బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు లు పార్టీ మారుతున్నామని బహిరంగంగా ప్రకటించారు. ఆసిఫాబాద్‌ ఎంమ్మెల్యే ఆత్రం సక్కు కు పార్లమెంట్‌ టికెట్‌ ఇస్తామని సర్ది చెప్పడం తో అయన ఎలాంటి పార్టీ మార్పు నిర్ణయం తీసుకోలేదు.సీటు దక్కని బోథ్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యే లు ఎం చేయబోతున్నారు అని ఓటర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకరేమో తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీని వీడాల్సి వచ్చింది. మరొకరికి పార్టీలో మింగుడు పడలేక వెళ్తున్నారని తెలుస్తుంది. ఎమ్మెల్యే రేఖనాయక్‌ పరిస్థితి చుస్తే ఏ నిర్ణయం తీసుకోలేక తటస్థంగా ఉండిపోయారు. రేఖానాయక భర్త శ్యామ్‌ నాయక్‌ ఆసిఫాబాద్‌ టికెట్‌ ఆశిస్తూ సతీమణి సిట్టింగ్‌ బీ ఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యే గా ఉంటూనే కాంగ్రెస్‌ వైపు అడుగులు వేశారుశ్యామ్‌నాయక్‌ సతీమణికి బిఆర్‌ఎస్‌ జాబితా లో టికెట్‌ దక్కకపోయేసరికి వెంటనే పీసీసీ అధ్యక్షులు రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పైగా తన భార్య రేఖా నాయక్‌ కు సైతం పిఏ ద్వారా ఖానాపూర్‌ టికెట్‌ కోసం దరఖాస్తు చేయించా?రు. కాంగ్రెస్‌ నుండి ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌ రెండు టికెట్స్‌ కావాలని కోరుతున్నారు. కాంగ్రెస్‌ ముందు నుండి పార్టీకి జెండా మోస్తూ… కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తు టికెట్‌ ఆశిస్తున్న నాయకులకు రేఖానాయక్‌ దంపతులు అడ్డంకిగా మారారు.అమెరికా పర్యటన తరువాత నైనా పురపాలక శాఖ మంత్రి కే టిఆర్‌ తో బుజ్జగింపు వస్తుందని వేచి చుసిన ఇద్దరు ఎమ్మెల్యే లకు ఎలాంటి ఫోన్‌ రాలేదు, దీనితో వేచి చూసి విసిగి పోయిన బోథ్బీ ఎమ్మెల్యే బాపు రావ్‌ పార్టీ కి గుడ్‌ భాయ్‌ చెప్పి ఏ పార్టీకి వెళ్తున్నానో త్వరలో చెప్తానని బహిరంగ ప్రకటన చేశారు.ఎమ్మెల్యే రేఖా నాయక్‌ పై మాత్రం బిఆర్‌ఎస్‌ అధిష్టానం సీరియస్‌ గా ఉందని తెలుస్తుంది. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన కేటీర్‌.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ని వదిలేసి టికెట్‌ ఆశించిన మాజీ ఐఏఎస్‌ అధికారి శర్మన్‌ నాయక్‌, ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాథోడ్‌, జనార్దన్‌, ఖానాపూర్‌ నాయకులు పూర్ణ నాయక్‌ లను ప్రగతి భవన్‌ కు పిలిచి మాట్లాడారు. జాన్షన్‌ నాయక్‌ తన మిత్రుడని, అందరు సహకరించి గెలిపించుకురావాలని సయోధ్య కుదుర్చారు.ఈ విషయం తెలుసుకున్న రేఖా నాయక్‌కు ఏం చేయాలో తెలియని సంధిగ్ధం లో పడినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాజకీయంగా ఎదురు దెబ్బలు తగలడం మరో వైపు కాంగ్రెస్‌ లో టికెట్‌ వస్తుందా లేదా అనే టెన్షన్‌ లో దంపతులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *