భయందర్ క్రీక్‌లో శ్రద్ధావాకర్ మొబైల్ కోసం పోలీసుల శోధన

సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు బాధితురాలి మొబైల్ కోసం తన అన్వేషణను కొనసాగిస్తున్నారు.(Shraddha Case) హత్య అనంతరం ముంబయి పర్యటనకు వచ్చిన ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా శ్రద్ధావాకర్(Shraddha Walkar)మొబైల్ ఫోన్ ను ధ్వంసం చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది.(Shraddha Walkars Mobile) దీంతో ముంబయిలోని భయేందర్ క్రీక్ (Bhayandar Creek)శ్రద్ధా ఫోన్ కోసం పోలీసులు(Police) శోధిస్తున్నారు.(Search) జ్వరం రావడంతో ఆఫ్తాబ్ కు పాలిగ్రాఫ్ పరీక్ష ఆగిపోయింది. ఆగిపోయిన పాలిగ్రాఫ్ పరీక్షను శుక్రవారం రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)లో శుక్రవారం పునఃప్రారంభించనున్నారు.

ఆఫ్తాబ్ ను శుక్రవారం పాలీగ్రాఫ్ పరీక్ష కోసం ల్యాబ్ కు తీసుకువస్తారని ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రతినిధి సంజీవ్ గుప్తా చెప్పారు. గురువారం సాయంత్రం ఆఫ్తాబ్ కు జరిపిన లై డిటెక్టర్ పరీక్షలో శ్రద్ధావాకర్ హత్య ఘటనకు సంబంధించి కీలకమైన ఆధారాలు లభించాయని ఢిల్లీ పోలీసులు చెప్పారు. శ్రద్ధాను 35 ముక్కలుగా నరికిన నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా ఛతర్‌పూర్ ఫ్లాట్ నుంచి ఢిల్లీ పోలీసులు ఐదు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.అయితే ఆమె మృతదేహాన్ని కోసేందుకు ఉపయోగించిన రంపాన్ని ఇంకా స్వాధీనం చేసుకోలేదని పోలీసులు తెలిపారు.కత్తులు నేరం చేయడానికి ఉపయోగించాడో లేదో నిర్ధారించడానికి పరీక్ష కోసం వాటిని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపినట్లు పోలీసు శాఖ వర్గాలు తెలిపాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *