రిషి మద్దతుదారుల వరుస భేటీలు

బ్రిటన్‌ కొత్త ప్రధాని ఎవరో సెప్టెంబర్‌ 5న తేలనుంది. ఆ రోజు కొత్త ప్రధానిని ఎంపిక చేయాలని నిర్ణయించింది అధికార కన్జర్వేటివ్‌ పార్టీ ప్రధాని పదవికి పోటీ పడాలనుకునే వారికి కనీసం 20 మంది తమ సహచర ఎంపీల మద్దతు ఉండాలి. ఈ మద్దతును సంపాదించుకున్న రిషి సునాక్‌ అప్పుడే తన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. భారత సంతతికి చెందిన రిషి ఇన్ఫోసిస్‌ కో`ఫౌండర్‌ నారాయణమూర్తికి అల్లుడు. ప్రధాని రేసులో ముందున్న రిషికి బ్రిటన్‌ రవాణా మంత్రి గ్రాంట్‌ షాప్స్‌ మద్దతు లభించడం విశేషం. గ్రాంట్‌ తాను పోటీ నుంచి విరమించుకుని రిషికి మద్దతు ఇస్తున్నట్టు అనౌన్స్‌ చేశారు. మొన్నటివరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు రిషి. బోరిస్‌ జాన్సన్‌ కేబినెట్‌ నుంచి మొదట తప్పుకున్నది కూడా రిషినే. ఆ తర్వాతే ఇతర మంత్రులు రాజీనామా చేశారు.వరుస కుంభకోణాలతో జాన్సన్‌ ప్రతిష్ట మసకబారింది. మరోవైపు దడ పుట్టిస్తున్న ద్రవోల్బణం, అప్పుల భారం, కుంటుపడిన ప్రగతి బ్రిటన్‌ ఎకానవిూకి గుదిబండగా మారాయి. ఈ నేపథ్యంలో రిషి సునాక్‌, ఇతర మంత్రుల రాజీనామాలతో జాన్సన్‌ రాజీనామా చేయక తప్పలేదు. ప్రస్తుతం ఆయన ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతున్నారు. రిషితో పాటు 10 మంది ప్రధాని పదవికి పోటీలో ఉంటారని భావిస్తున్నారు. పోటీలో ఉన్నవారిని పార్టీ నేతలు బ్యాలెట్‌ ఓటింగ్‌ ద్వారా ఎన్నుకుంటారు. రౌండ్ల వారీగా ఓటింగ్‌ నిర్వహించి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్‌ చేస్తూ ఉంటారు. చివరకు మిగిలిన ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే కన్జర్వేటివ్‌ పార్టీ కొత్త సారథిగా, ప్రధానిగా బాధ్యతలు చేపడుతారు.
ఇటీవలి కాలంలో కేసీఆర్‌ కేంద్రంపైనా, ప్రధాని మోడీపైనా వరుస విమర్శలతో జోరు విూదున్నారు. ఆయన విలేకరుల సమావేశంలో కుమారుడు కానీ, కుమార్తె కానీ కనిపించడం లేదు. అదే సమయంలో కేటీఆర్‌ కూడా వరుస ప్రారంభోత్సవాలు, అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ కేంద్రంపై, మోడీపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. గతానికి భిన్నంగా ఇప్పుడు ఆయన భాష కూడా మారింది. తండ్రి శైలిని అనుకరిస్తున్నారు. కానీ కవిత మాత్రం గతానికి భిన్నంగా.. కాదు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కడా కనిపించడం లేదు, వినిపించడం లేదు. ఇందుకు తనకు రాజకీయ ప్రాధాన్యం విషయంలో తండ్రి, అన్నతో విభేదించడమే కారణమా అన్న సందేమాలు రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. ఇవే సందేహాలు పార్టీ శ్రేణుల్లో కూడా వ్యక్తమౌతున్నాయి.
ఈ సందేహాలకు బలం చేకూర్చే విధంగా గత కొంత కాలంగా కేసీఆర్‌ కూడా కుమారుడు, కుమార్తెలతో కలిసి ఎక్కడా పార్టీ కార్యక్రమాలలో కనిపించకపోవడం. కేటీఆర్‌ కూడా తండ్రి హాజరైన కార్యక్రమాలకు దూరంగా ఉండడాన్ని వారు ఎత్తి చూపుతున్నారు. కాగా అయితే కవిత విదేశీ పర్యటనలో ఉన్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఏది ఏమైనా కవిత మౌనానికి కారణమేమిటన్నది అంతుబట్టని విషయంగానే ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *