ఈ సమ్మర్‌ హాట్‌ గురూ…

కంటికి కనిపించకుండానే కోట్లాది మందిని కబళించింది కోవిడ్‌ మహమ్మారి. అలాగే కనిపించని మరో మహమ్మారి మన దేశాన్ని ఆక్రమించబోతోంది. ఆ భూతం పేరు ఎండవేడిమి. హీట్‌వేవ్‌ కారణంగా ఇండియాలో దాదాపు 90 శాతం భూభాగం డేంజర్‌జోన్‌లో పడిరది. దీనికి కారణం ఏంటనే కోణంలో శాస్త్రవేత్తలు ఆరా తీస్తున్నారు. ఆలోగానే? మిడ్‌ సమ్మర్లోకి ఎంట్రీ ఇస్తున్నాం మనం. మండే సూరీడు ఈసారి ఎంతమంది ఉసురు తియ్యబోతున్నాడో ఊహించుకోడానికే జడుసుకోవాల్సిన పరిస్థితి. నడినెత్తినెక్కి సూరీడు చేస్తున్న నాట్యానికి పిట్టల్లా రాలిపోతున్నారు జనం. నవీ ముంబైలో ఒక బహిరంగ సభలో ఏకంగా 14 మందిని మింగేసింది వడదెబ్బ. 600 మంది ఇప్పటికీ ఆస్పత్రి బెడ్లవిూదే ఉన్నారు. 42 డిగ్రీల మండుటెండ? మిడతల్లా మాడిపోయిన జనం?. ఎండాకాలం చరిత్రలో ఇదే ఆల్‌ టైమ్‌ రికార్డ్‌.ఏప్రిల్‌ నెలలోనే ఇంత యాతనుంటే?. ఇక మే, జూన్‌ మాసాలొస్తే పరిస్థితేంటి? మంటల్లో మునుగుడేనా? మనుగడ లేనట్టేనా? ఇండియాలో ఎండలు ఈసారి మామూలుగా ఉండవనే ముందస్తు హెచ్చరికలు భారీగా వినిపిస్తున్నాయి. రాబోయే ఎండలపై కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీ చేసిన ఒక అధ్యయనాన్ని చూస్తే గుండెలు మండిపోవడం ఖాయమంటున్నారు నిపుణులు. రాబోయే మూడునెలల్లో ఇండియాలో హీట్‌ వేవ్‌లు తరచుగా తీవ్రరూపం దాల్చబోతున్నాయి. వాతావరణంలో మార్పులే దీనిక్కారణం అంటున్నారు. దేశం మొత్తంలో 90 శాతం ప్రాంతాలు హీట్‌ వేవ్‌ల ప్రభావంతో ప్రమాదంలో పడబోతున్నాయి.రాజధాని ఢల్లీి ఇప్పటికే డేంజర్‌ జోన్‌లో ఉంది. హస్తినను ఈసారి సమ్మర్‌ సీజన్‌ తీవ్రంగా దెబ్బతియ్యబోతోంది. వాతావరణ మార్పుల కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు సక్సెస్‌ కాకపోవడంతో భారీ ఉష్ణోగ్రతల తాకిడి నుంచి తప్పించుకోలేకపోతోంది ఢల్లీి నగరం. ఎండ తీవ్రత అనేది ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో తెలియాలంటే ఒక్కసారి చరిత్ర పేజీలు తిరగెయ్యాల్సిందే. 1971 నుంచి ఇప్పటివరకూ దాదాపు 706 సార్లు వడదెబ్బతో తల్లడిల్లింది ఇండియా. గత 30 ఏళ్లలో భారీ ఉష్ణోగ్రతల తాకిడికి 24 వేల మంది మృత్యువాతన పడ్డారు. ఈ ఏడాది వేసవి మరణాలు పెరిగినా పెరగొచ్చంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *