ఆలయాలకు భారీగా ఆదాయం

విజయవాడ, ఆగస్టు 3 :
ఏపీలోని ప్రధాన ఆలయాలలో ఒక్కటైన విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం చాలా ఫేమస్‌. ఎంతోమంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకనేందుకు వస్తుంటారు. అయితే ఈసారి అమ్మవారి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది.ఈ ఏడాది 150 కోట్ల రూపాయల వివిధ రూపాలలో ఆదాయం సమకూరింది. గత ఏడాడి 86 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. అయితే ఈ ఏడాది గత ఏడాది కంటే రెట్టింపు ఆదాయం సమకురినట్లు దుర్గగుడి ఈఓ తెలిపారు. ఈ ఏడాది తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత రెట్టింపు ఆదాయంలో నికర ఆదాయం నమోదైన ఆలయాల్లో ఇంద్రకీలాద్రి నిలిచింది.2023 `24 సంవత్సరానికి కాను ఏకంగా 156 కోట్ల 96 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఈ రేంజ్‌ లో తిరుమల తర్వాత స్థానంలో ఇంద్రకీలాద్రి ఆదాయంరావడం ఇదే తొలిసారి. కరోనా తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల సంఖ్యతో పాటు ఆదాయం కూడా పడిపోయింది. సాధారణంగా ఇంద్రకీలాద్రి ఆదాయం 100 కోట్ల రూపాయల లోపే ఉంటుంది. గత ఏడాది 80 కోట్ల 80 లక్షల ఆదాయం రాగా..ఈ ఏడాది రికార్డు స్థాయిలో 150 కోట్ల రూపాయలు దాటడం విశేషం. కరోనా తర్వాత 2022 `23 సంవత్సరంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. అలా అమ్మవారిని దర్శించుకుని కానుకలు సమర్పించడంతో పాటు విశిష్టమైన పూజల ద్వారా వచ్చే ఆదాయం పెరిగింది. అలానే టిక్కెట్‌ , ఎఫ్డీఆర్‌ లపై వచ్చే వడ్డీ ,సేవలు ,ఇతర లైసెన్స్‌?ల ద్వారా గణనీయంగా ఆదాయం పెరిగింది. గతంలోనూ ఏ ఆర్ధిక సంవత్సరం లోను ఇంత ఆదాయం వచ్చిందన సందర్భం లేదు అంటున్నారు పాలకమండలి సభ్యులు.
జనవరి నుంచి జూలై వరకు 7 నెలల్లో హుండీ కి రూ. 827 కోట్లు
తిరుమలేశుడి హుండీ కానుకలతో కొండ ఖజానా నిండుతోంది. ఇప్పటికే రూ.17 వేల కోట్ల డిపాజిట్లు, 11 టన్నుల బంగారు బ్యాంకుల్లో వెంకన్న నిధి భద్రంగా ఉండగా నెల నెలా పెరుగుతున్న హుండీ ఆదాయం శ్రీనివాసుడ్ని మరింత సంపన్నుడ్ని చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 7 నెలల్లో హుండీ కి రూ. 827 కోట్లకు పైమాటే. ప్రతినెల రూ. 120 కోట్ల మార్క్‌ ను రీచ్‌ అవుతున్న శ్రీవారి హుండీ ఆదాయం వెంకన్నను మరింత రిచెస్ట్‌ గార్డ్‌ ను చేస్తోంది.తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు..వెలకట్టలేని ఆభరణాలు, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్న అలంకార ప్రియుడు. ఆపదమొక్కుల స్వామికి సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా పరమ భక్తుడే. నాటి నుంచి నేటి వరకు భక్తులు ముక్కులో భాగంగా సమర్పించే కానుకలు ఇప్పుడు వెంకన్న హుండీని నింపేస్తున్నాయి. ఇప్పటికే 11 టన్నుల బంగారు ఆభరణాలు, రూ. 17 వేల కోట్ల రూపాయలు బ్యాంకులు డిపాజిట్‌ ఉన్న వెంకన్నకు రోజురోజుకు హుండీ లో కానుకల వెల్లువ కొనసాగుతోంది. కోరుకున్న కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కలియుగ దైవం కొండపై కటాక్షిస్తుండటం తో రికార్డ్‌ స్థాయిలో హుండీ కానుకలు టీటీడీ ఆదాయాన్ని పెంచేస్తున్నాయి. ఏడాది జనవరి నుంచి జూలై వరకు 7 నెలల్లో ఏడుకొండలవాడికి రూ. 827 కోట్ల కు పైగా ఉండి ఆదాయం వచ్చింది. జూలై నెలలో రికార్డు స్థాయిలో రూ.129.3 కోట్ల కానుకలు శ్రీవారి హుండీకి చేరాయి.జూలై నెలలో 23.23 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా జూలై 10, 17, 24, 31 తేదీల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5 కోట్ల కు పైగానే ఉంది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 7 నెలల్లో 12 రోజులు హుండీ ఆదాయం రూ. 5 కోట్ల మార్క్‌ ను దాటింది. ఇలా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు హుండీ ని కానుకలతో నింపేస్తుండగా ఈ 7 నెలల్లోనే శ్రీవారి హుండీ మరో రికార్డును కూడా సొంతం చేసుకుంది. జనవరి 2న తిరుమల పరకామణిలో శ్రీవారి హుండీ లెక్కింపు సరికొత్త రికార్డును బ్రేక్‌ చేసింది. ఏకంగా జనవరి 2 హుండీ కానుకలు మొత్తం రూ. 7,68,20,000 లు గా తేల్చింది. ఈ లెక్కన సరికొత్త రికార్డుగా వెంకన్న హుండీ ఆదాయం నమోదైంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *