ఐ ప్యాక్‌ ఎఫెక్ట్‌…

అధికార పార్టీలో శాసన సభ్యుల పని తీరు తీవ్రస్థాయిలో చర్చకు దారి తీసింది. గడప గడపకు కార్యక్రమం ద్వారా శాసన సభ్యుల పని తీరును ముఖ్యమంత్రి బేరీజు వేస్తుండటంతో వెనుకబడిన వారు కాస్త మెరుగు పడినట్టు కనిపిస్తోంది. కానీ ఇంకా కొందరు పనితీరుపై సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 36, 34, 18… అధికార పార్టీలో శాసన సభ్యుల పని తీరు మెరుగు పడుతుందనేందుకు ముఖ్యమంత్రి ప్రకటించిన నెంబర్స్‌ ఇవి. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలకంగా తీసుకుంది. శాసన సభ్యులను ప్రతి గడపకు పంపి, ప్రజలతో మమేకం అయ్యేందుకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన టాస్క్‌ ఇది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిన మెదట్లో చాలా మంది శాసన సభ్యులు వెనుకబడ్డారు. ఆ తరువాత ముఖ్యమంత్రి గడప గడప కార్యక్రమంపై సవిూక్ష నిర్వహించారు. శాసన సభ్యుల పని తీరు గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని తెలియడంతో అంతా అలర్ట్‌ అయ్యారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో సీరియస్‌గా పాల్గొన్నారు. గత రెండు నెలల క్రితం వరకు 36 మంది శాసన సభ్యులు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో వెనుకబడి ఉన్నారని ప్రచారం జరిగింది. అలాంటి వారిని తప్పించేందుకు సైతం పార్టీ అధినేత జగన్‌ రెడీగా ఉన్నారని భారీ ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత పరిస్థితుల్లో భారీగా మార్పులు వచ్చాయని పార్టీ వర్గాలు అంటున్నాయి..పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యూహత్మంగా గడప గడపకు మన ప్రభుత్వాన్ని తెర విూదకు తెచ్చారు. ఈ కార్యక్రమం భారీగా సక్సెస్‌ అయ్యింది కూడా. దీంతో జగన్‌ ఈ కార్యక్రమాన్ని మరింత జోరుగా పెంచేందుకు శ్రద్ద చూపించటంతో శాసన సభ్యులు, ఇంచార్జ్‌ కదలాల్సి వచ్చింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే తప్పని పరిస్థితుల్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనక తప్పలేదు. మొదట్లో చాలా మంది శాసన సభ్యులు లైట్‌ తీసుకున్నప్పటికి ఆ తరువాత పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా జగన్‌ చూపించిన శ్రద్ధ కారణంగా అందరూ గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనక తప్పలేదు. దీంతో ఇప్పటి వరకు వెనుకబడిన శాసన సభ్యులు సైతం గడప గడపకు కార్యక్రమంలో ముందుకు వెళుతున్నారు. దీంతో 34 మందిపై అసంతృప్తి అంటూ మెదటి నుంచి జరుగుతున్న ప్రచారం కాస్త ఇప్పుడు 18మందికి తగ్గిపోయింది.గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో వెనుక బడిన శాసన సభ్యుల సంఖ్య ఉన్నపళంగా సగానికి పడిపోవటానికి కూడా ప్రత్యేకమైన కారణాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ఐ ప్యాక్‌ టీం నిత్యం పర్యవేక్షిస్తోంది. శాసన సభ్యలు రోజూ ఎన్ని గంటలు నడిచారు, ఎంత మంది నియోజకవర్గ ప్రజలను కలిశారు, వంటి వివరాలను పర్యవేక్షించి రిపోర్ట్‌లు సీఎంవోకు పంపించారు. గంటల వారీగా, రోజుల వారీగా ముఖ్యమంత్రి పేషికి పంపటంతో శాసన సభ్యులు అలర్ట్‌ అవ్వక తప్పలేదని చెబుతున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రతి నెలా గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంపై సవిూక్ష చేయటంతో, కార్యక్రమం సీరియస్‌నెస్‌ కూడా పెరిగిందని దీంతో 36, 34, మంది శాసన సభ్యులు వెనుకబడి ఉన్నారనే సంఖ్య ఇప్పుడు 18మందికి తగ్గిందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *